రాజమహేంద్రవరం రూరల్ ఈరోజు రాజమహేంద్రవరం పుష్కర ఘాట్ వద్ద ఏర్పాటు చేసిన గోదావరి ఘాట్స్ పరిశీలన కార్యక్రమంలో ముఖ్య అతిధిలుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి వర్యులు కందుల దుర్గేష్, శాసన సభ్యులు పార్లమెంట్ సభ్యురాలు దగ్గుబాటి పురందేశ్వరి పాల్గొ్న్నారు. ఈ సందర్బంగా మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ.. పుష్కర సన్నాహాలు ప్రారంభమయ్యాయని, గతంలో జరిగిన మూడు పుష్కరాలు టీడీపీ ప్రభుత్వ హయాంలోనే అని ఆయన గుర్తు చేశారు. పరిమిత వనరులుతో గోదావరి తీరాన్ని అభివృద్ధి…
మన రాష్ట్రం సినిమాటోగ్రఫీకి అనేక విధాలుగా తోడ్పడిందని పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. కోనసీమ , కృష్ణా పర్యాటక ప్రాంతాల్లో అనేక షూటింగులు జరిగాయని.. గత పాలకులకు చిత్తశుద్ధి ఉంటే కేరళ నుంచి కోనసీమను అభివృద్ధి చేసేవాళ్లని ఆయన పేర్కొన్నారు. రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఆయన మాట్లాడారు.
రాజమండ్రి రూరల్ సీటుపై టీడీపీ వర్సెస్ జనసేన పార్టీల మధ్య తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఈ సారి టికెట్ తనకేనంటూ టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చెబుతుండగా.. కాదు తనకు పవన్ కల్యాణ్ మాట ఇచ్చారని జనసేన నేత కందుల దుర్గేష్ పేర్కొంటున్నారు. ఇక, రాజమండ్రిలో పవన్ టూర్ తర్వాత రాజమండ్రి రూరల్ నియోజకవర్గంలో టీడీపీ వర్సెస్ జనసేన పార్టీల మధ్య రచ్చ స్టార్ట్ అయింది.
ఏపీలో రానున్న రోజుల్లో ప్రభుత్వ వ్యతిరేక విధానాలపై అలుపెరుగని పోరాటం చేస్తామన్నారు జనసేన తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షుడు కందుల దుర్గేష్. విశాఖలో స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జరిగిన సభను చూస్తే జనసేనకు జనం బ్రహ్మరధం పడుతున్నారని అర్థమైందన్నారు. కేంద్రానికి పవన్ కళ్యాణ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయవద్దని చెప్పారన్నారు. వైఎస్సార్ ప్రభుత్వం కేంద్రం మీద వత్తిడి తీసుకురాలేదన్నారు దుర్గేష్. స్టీల్ ప్లాంట్ ఉద్యమంపై అఖిల పక్షం వేయాలని పవన్ కళ్యాణ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారని, అయితే…