మాజీ పర్యటక శాఖ మంత్రి రోజాపై రాష్ట్ర మంత్రి కందుల దుర్గేష్ ఫైర్ అయ్యారు. దావోస్‌కు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎందుకు వెళ్లలేదని రోజా చేసిన వ్యాఖ్యలను ఆయన ఖండించారు. రాజమండ్రిలో మంత్రి దుర్గేష్ మీడియాతో మాట్లాడుతూ.. క్యాబినెట్లో అందరినీ దావోస్ తీసుకుని వెళ్లారని అన్నారు. రోజా అవగాహన రాహిత్యంతో చేస్తున్న వ్యాఖ్యలని కొట్టిపారేశారు. గత ప్రభుత్వంలో మంత్రి రోజా పర్యాటక శాఖను నిర్వీర్యం చేసిందని ఆరోపించారు. విశాఖపట్నం ఋషికొండ వద్ద పర్యాటక ప్రాంతంలో ప్యాలెస్…
బడ్జెట్‌లో వ్యవసాయం, అనుబంధ రంగాలకు 72,659 కోట్లు ప్రజా ప్రభుత్వం రైతు భరోసా ఇచ్చేందుకు కట్టుబడి ఉంది.. ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ ఇచ్చిన మాట మేరకు ముందుకు వెళ్తామని రైతు భరోసా సబ్ కమిటీ చైర్మన్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు అన్నారు. ఆదివారం డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ సచివాలయంలో రైతు భరోసా సబ్ కమిటీ చైర్మన్ భట్టి విక్రమార్క తో పాటు మంత్రులు, కమిటీ సభ్యులైన తుమ్మల నాగేశ్వరరావు, దుదిల్ల శ్రీధర్ బాబు,…
కృష్ణా జిల్లా మొవ్వ మండలం కూచిపూడి కళాక్షేత్రంలో కూచిపూడి పతాక స్వర్ణోత్సవ ముగింపు వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో మంత్రులు కందుల దుర్గేష్, కొల్లు రవీంద్ర, ఉప సభాపతి రఘురామ కృష్ణంరాజు, పామర్రు ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజా, కూచిపూడి నృత్య గురువులు, కళాకారులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రపంచంలోని వివిధ ప్రాంతాలకు చెందిన కళాకారుల కూచిపూడి నృత్య ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి.
ఇవాళ కౌల్సిల్ వేదికగా రుషికొండ అంశంపై మరోసారి రచ్చ జరిగింది.. దీనిపై శాసన మండలిలో మాట్లాడిన మంత్రి కందుల దుర్గేష్.. ఎండాడ భూములు, రుషికొండ అంశంలో స్ధానికుల అనుమతి లేకుండానే భూ వినియోగ మార్పిడి జరిగిందని విమర్శించారు.. రాష్ట్రంలో ఉన్న అన్ని బీచ్‌లలో బ్లూ ఫ్లాగ్ బీచ్ రుషికొండ బీచ్ అన్నారు.. అయితే, అన్ని అద్భుతంగా ఉండగానే రిసార్ట్స్ పడగొట్టేశారని మండిపడ్డారు మంత్రి కందుల దుర్గేష్..
Minister Kandula Durgesh: 9వ ప్రపంచ తెలుగు సాహితీ సదస్సుకు విచ్చేసిన తెలుగువారికి సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ల తరపున మంత్రి కందుల దుర్గేష్ అభినందనలు తెలిపారు.
Kandula Durgesh: పశ్చిమ గోదావరి జిల్లా ఉండ్రాజవరం మండలం సూర్యారావుపాలెంలోని బాణాసంచా తయారీ కేంద్రం సమీపంలో పిడుగు పాటు ధాటికి ఇద్దరు వ్యక్తులు మృతి చెందిన ఘటనపై సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
గుంటూరు జిల్లా కలెక్టరేట్‌లోని ఎస్.ఆర్. శంకరన్ హాల్‌లో జిల్లా సమీక్ష కమిటీ (డీఆర్‌సీ) సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మంత్రులు నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేష్, పలువురు ఎమ్మెల్యేలు, జిల్లా ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ.. జిల్లా అభివృద్ధి కమిటీ సమావేశంలో అధికార యంత్రాంగంతో చర్చించామన్నారు. రాబోయే రోజుల్లో గుంటూరు జిల్లాను అభివృద్ధి బాటలో నిలబెడతామని తెలిపారు.
పర్యాటకులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. అక్టోబర్ 26 నుంచి ఆధ్యాత్మిక యాత్రకు శ్రీకారం చుట్టనుంది. ఈ మేరకు రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ ఓ ప్రకటన విడుదల చేశారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో వారాంతంలో ప్రముఖ ఆధ్యాత్మిక దేవాలయాలు, పంచారామ క్షేత్రాలు సందర్శించేలా ఒక రోజు టూర్ ప్యాకేజీకి పర్యాటక శాఖ సన్నాహాలు చేస్తుందని మంత్రి వెల్లడించారు.
రుషికొండ పై టూరిజం మంత్రి కందుల దుర్గేష్ కీలక వ్యాఖ్యలు చేశారు. రుషికొండ నిర్మాణాలు చాలా పెద్దవి.. వాటిని ఎలా హ్యాండిల్ చేయాలో అర్థం కావడం లేదన్నారు. రుషికొండ కట్టడాలు అవినీతి సామ్రాజ్యానికి సూచికగా మ్యూజియం ఏర్పాటు చేయలేమోనని ఎద్దేవా చేశారు.
ధవళేశ్వరంలోని పోలవరం ప్రాజెక్టు కార్యాలయంలో ఫైళ్లను దగ్ధం చేసిన ఘటనపై నిర్లక్ష్యంగా ఉన్న అధికారులు, సిబ్బందిపై మంత్రి కందుల దుర్గేశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. దహనమైన వాటిని రాజమహేంద్రవరం ఆర్డీవో శివజ్యోతి జిరాక్స్ పేపర్లుగా ప్రకటించడంపై ఆయన అసహనం వ్యక్తం చేశారు. పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్టు ఎడమ కాలువ నిర్వాసితుల ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీకి సంబంధించి కాల్చివేసిన కాగితాలను నేడు మంత్రి దుర్గేష్ పరిశీలించారు. Also Read: Champai Soren: జార్ఖండ్ రాజకీయాల్లో కీలక పరిణామం..…