Vijayawada: ప్రముఖ శక్తిపీఠం విజయవాడ ఇంద్రకిలాద్రిపై వెలసిన కనకదుర్గ అమ్మవారి ఆలయంలో అంతర్గత బదిలీలు చేపట్టారు. ఆలయ ఈవో శీనా నాయక్ ఆధ్వర్యంలో ఈ బదిలీల ప్రక్రియను నిర్వహించారు. దేవాదాయ శాఖ కమిషనర్ ఆదేశాల మేరకు ప్రతి ఆరు నెలలకోసారి ఆలయ అధికారులు, అర్చకులు, వేద పండితులు, పరిచారకులకు బదిలీలు నిర్వహించడం ఆనవాయితీగా కొనసాగుతోంది. Read Also: Minister Narayana: రాష్ట్రంలో రెండు కొత్త వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్స్.. ఆధునిక ప్లాంట్లను సందర్శించిన మంత్రి నారాయణ..!…
Vijayawada: విజయవాడలోని ప్రసిద్ధ ఇంద్రకీలాద్రిపై కొలువైన కనకదుర్గ అమ్మవారి ఆలయంలో ఆదివారం ఈవో రామ్ చంద్ర మోహన్ ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఆలయంలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉన్న సమయంలో సెక్యూరిటీ సదుపాయాల లోపం కనిపించడంతో ఈవో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆలయ ఏఈఓ చంద్రశేఖర్‌ను క్లూ లైన్ల పరిశీలన సమయంలో కనిపించకపోవడంతో ఆయనకు చార్జ్ మెమో జారీ చేశారు. అంతేకాదు, అంతరాలయం ఎదుట ఉన్న హుండీని తొలగించాల్సిందిగా రెండుసార్లు ఆదేశించినా అధికారులు పట్టించుకోకపోవడాన్ని ఈవో తప్పుబట్టారు.…
ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీ దుర్గామల్లేశ్వరస్వామి ఆలయ ప్రధాన అర్చకులు లింగంభొట్ల బద్రీనాథ్ బాబు కన్నుమూశారు. బుధవారం తెల్లవారు జామున బద్రీనాథ్ బాబు తన ఇంట్లోనే గుండెపోటుతో మృతి చెందారు. చాలా ఏళ్లుగా ఆయన దుర్గగుడి ప్రధాన అర్చకులుగా ఉన్నారు. బద్రీనాథ్ బాబు మృతి పట్ల ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. దుర్గ గుడి ప్రధాన అర్చకులు లింగంభొట్ల బద్రీనాథ్ బాబు మృతి పట్ల దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. ‘శ్రీ…
విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన కనక దుర్గమ్మ అమ్మవారిని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు దర్శించుకున్నారు. కొత్త సంవత్సరం సందర్భంగా సీఎం కనక దుర్గమ్మను దర్శించుకున్నారు. దర్శన అనంతరం పండితులు సీఎంకు వేదాశీర్వచనాలు చేసి.. తీర్థ ప్రసాదాలను అందజేశారు. అంతకు ముందు సీఎం చంద్రబాబుకు అర్చకులు, సిబ్బంది పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. నూతన సంవత్సరం సందర్భంగా ఇంద్రకీలాద్రికి భారీగా భక్తులు రాగా.. ఆలయ అధికారులు ఘనంగా ఏర్పాట్లు చేశారు. కనక దుర్గమ్మ అమ్మవారిని దర్శించుకున్న సీఎం చంద్రబాబు.. తెలుగు…
దసరా శరన్నవరాత్రులు బెజవాడలోని ఇంద్రకీలాద్రిపై 7వ రోజు వైభవంగా సాగుతున్నాయి.. ఇంద్రకీలాద్రి పై కనకదుర్గమ్మ సరస్వతీదేవి అలంకారంలో దర్శనం ఇస్తున్నారు.. ఈ రోజు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అమ్మవారిని దర్శించుకోనున్నారు..
Indrakiladri: విజయవాడ కనకదుర్గ ఆలయంలో గత రెండు రోజుల్లో ఎదురైన అనుభవాలను దృష్టిలో పెట్టుకుని మార్పులు చేస్తున్నామని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ జి.సృజన తెలిపారు.