విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా సాగుతున్నాయి.. అక్టోబరు 15వ తేదీన ప్రారంభమైన ఈ ఉత్సవాలు.. 24వ తేదీ వరకూ కొనసాగనున్నాయి. దసరా శరన్నవరాత్రి మహోత్సవాల సందర్భంగా కనకదుర్గ అమ్మవారిని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని దర్శించుకోనున్నారు.
దేవీ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా బెజవాడ దుర్గమ్మకు టీటీడీ పట్టువస్త్రాలు సమర్పించింది. టీటీడీ బోర్డు సభ్యులు మీకా శేషు బాబు , గాదిరాజు వెంకట సుబ్బరాజు అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించారు.
ఇవాళ్టి నుంచి దసరా ఉత్సవాలు ఇంద్రకీలాద్రిపై స్టార్ట్ అయ్యాయి. ఈరోజు అమ్మవారు బాలా త్రిపుర సుందరీదేవిగా భక్తులకు కనిపించనున్నారు. తెల్లవారు జాము నుంచే అమ్మవారికి స్వపనాభిషికం, ప్రత్యేక అలంకరణ చేసేశారు. దీంతో తొలి రోజున అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు వేల సంఖ్యలో ఇంద్రకీలాద్రికి తరలి వస్తున్నారు.
రేపటి (బుధవారం ) నుంచి లోక కళ్యాణార్ధం, భక్తజన శ్రేయస్సు కోసం విజయవాడలోని ఇంద్రకీలాద్రి కనకదుర్గమ్మ ఆలయంలో పవిత్రోత్సములు స్టార్ట్ కానున్నాయి. ఈ పవిత్రోత్సముల నేపథ్యంలో మూడు రోజుల పాటు ఆలయంలో జరిగే అన్ని ప్రత్యేక్ష పరోక్ష సేవలను ఆలయాధికారులు నిలిపేశారు.
ACB: విజయవాడలో ఇంద్రకీలాద్రిపై కొలువుదీరిన కనకదుర్గమ్మను వేలాది మంది భక్తులు దర్శించుకుంటారు.. అయితే, ఆలయ అధికారులు వివాదాల్లో ఇరుకున్న సందర్భాలు అనేకమే.. తాజాగా, దుర్గగుడి సూపరింటెండెంట్ నగేష్ ఇళ్లలో సోదాలు నిర్వహిస్తున్నారు ఏసీబీ అధికారులు.. ఆదాయానికి నుంచి ఆస్తులు కలిగి ఉన్నారని ఆరోపణలపై ఈ సోదాలు జరుగుతున్నాయి.. దుర్గగుడి కార్యాలయంతో పాటు విజయవాడలోని నగేష్ నివాసంలో సోదాలు కొనసాగుతున్నట్టుగా తెలుస్తోంది.. ఇదే సమయంలో నగేష్ బంధువులు, సోదరుల ఇళ్లలోనూ ఏసీబీ తనిఖీలు చేస్తోంది.. తూర్పు గోదావరితో పాటు…
Kanaka Durga Temple: విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై దుర్గగుడి పాలకమండలి సమావేశం ముగిసింది.. ఈ సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడిన దుర్గగుడి చైర్మన్ కర్నాటి రాంబాబు.. చర్చించిన అంశాలు, తీసుకున్న నిర్ణయాలను వెల్లడించారు.. వేసవి దృష్ట్యా అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తులకు మజ్జిగ పంపిణీ చేయాలని నిర్ణయించామని తెలిపారు చైర్మన్ కర్నాటి రాంబాబు.. అన్నదాన భవనం, ప్రసాదం పోటుకి త్వరలోనే టెండర్లకు ఆహ్వానిస్తున్నాం.. దీనిపై నిర్ణయం తీసుకున్నామని వెల్లడించారు. ఇక, సాయంత్రం సమయంలోనూ అన్నదానం నిర్వహించాలని నిర్ణయించాం.. భక్తుల…