Vijayawada: విజయవాడ ఇంద్రకిలాద్రిలో భక్తుల సౌకర్యం కోసం కనకదుర్గమ్మ దేవస్థానం ఒక వినూత్నమైన ప్రయోగాన్ని చేపట్టింది. సర్వదర్శనం (ఉచిత దర్శనం) క్యూలో వచ్చే భక్తులకు కూడా ఉచితంగా అంతరాలయ దర్శనం కల్పించే దిశగా ఈరోజు మధ్యాహ్నం ప్రత్యేక ట్రయల్ రన్ నిర్వహించారు. రాహుకాల సమయం మధ్యాహ్నం 3 గంటల నుంచి 4 గంటల వరకు ఈ ప్రయోగాత్మక కార్యక్రమం సాగింది. New Districts In AP: మూడు కొత్త జిల్లాలు, ఐదు కొత్త రెవెన్యూ డివిజన్లకూ గ్రీన్…
Sri Mahishasura Mardini Devi: దసరా మహోత్సవాలు పదవ రోజుకు చేరుకున్నాయి.. ఇంద్రకీలాద్రిపై కొలువు దీరిన దుర్గమ్మ మహార్నవమి నేడు మహిషాసురమర్దినిగా దర్శనమిస్తున్నారు.. మహిషాసురమర్దిని అవతారానికి ప్రత్యేకత ఉంది.. రాక్షసులను సంహరించి స్వయంభుగా వెలిసిన మహిషాసురమర్దని అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు బారులు తీరారు. అయితే, శరన్నవరాత్రులలో దర్శనమిస్తున్న దేవి అలంకారాలలో మహిషాసురమర్దనికి ఎంతో విశిష్టత ఉంది. సప్తశతిలో దుర్గాదేవి అష్టభుజాలతో దుష్ట రాక్షసుడైన మహిషాసురుడిని సంహరించి లోకో పకారం చేసిన ఘట్టం వర్ణితమైంది.. సింహావాహినిగా రూపొందిన శక్తి…
Kanaka Durga Temple: బెజవాడలోని ఇంద్రకీలాద్రిపై దసరా మహోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి.. ఒక్కో రోజు ఒక్కో రూపంలో దర్శమనిస్తున్న కనకదుర్గమ్మను దర్శించుకుని భక్తులు పరవశించిపోతున్నారు.. ఇక, శరన్నవరాత్రి ఉత్సవాల్లో తొమ్మిదవ రోజు ఇంద్రకీలాద్రిపై అమ్మవారు దుర్గాదేవి రూపంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. అన్ని క్యూ లైన్లు భక్తులతో కిటకిటలాడుతున్నాయి.. లోకకంఠకుడైన దుర్గమాసురుడిని వధించి దుర్గాదేవీ స్వకంగా కీలాద్రిపై అవతరించినట్లు ఆలయ చరిత్ర చెబుతోంది. దుర్గతులను పోగొట్టే దుర్గాదేవి అవతారాన్ని దర్శించుకుంటే సద్గతులు సంప్రాప్తిస్తాయని భక్తుల విశ్వాసం. దుర్గతులను నివారించే…
బెజవాడ దుర్గమ్మ దసరా శరన్నవరాత్రి మహోత్సవాలను విజయవంతంగా నిర్వహించడంపై ఆంధ్రప్రదేశ్ సర్కార్ ఫోకస్ పెట్టింది. దసరా మహోత్సవాల ప్రణాళికలు, భక్తుల రద్దీ నిర్వహణ, క్యూ లైన్లు, భద్రతా ఏర్పాట్లు, పార్కింగ్, త్రాగునీరు, వైద్య సహాయం, శానిటేషన్ వంటి అంశాలను మంత్రి ఆనం రామనారాయణరెడ్డి సమీక్షించారు.
విజయవాడ ఇంద్రకీలాద్రి అమ్మవారి ఆలయంలో నేటి నుంచి కఠిన నిబంధనలు అమల్లోకి వచ్చాయి. దర్శనానికి వచ్చేవారికి సాంప్రదాయ దుస్తులు లేకుంటే ఆలయంలోకి అనుమతించరు.. అమ్మవారి ఆలయంలో సెల్‌ఫోన్ వాడకంపై కూడా పూర్తిగా నిషేధం విధించారు.
Vijayawada: విజయవాడలోని ఇంద్రకీలాద్రి అమ్మవారి ఆలయంలో అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇకపై ఇంద్రకీలాద్రి అమ్మవారి ఆలయంలో భక్తుల కోసం కొత్త నిబంధనలు అమల్లోకి రానున్నాయి. సెప్టెంబర్ 27 నుంచి భక్తులు తప్పనిసరిగా సంప్రదాయ దుస్తులు ధరించాలి. ఒకవేళ సంప్రదాయ దుస్తులు లేకపోతే ఆలయంలోకి ప్రవేశం ఇవ్వబోమని ఆలయ అధికారులు స్పష్టం చేశారు. అదే విధంగా, ఆలయంలో సెల్‌ఫోన్ వాడకంపై నిషేధం విధించారు. RSS Invites Congress: రేపటి నుంచి ఢిల్లీలో ఆర్ఎస్ఎస్ శతాబ్ది ఉత్సవాలు.. కాంగ్రెస్‌కు…
విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై కొలువుదీరిన కనకదుర్గ అమ్మవారి ఆలయంలో రెండో రోజు శాకంబరి దేవి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ ఉత్సవాలు మంగళవారం రోజు ప్రారంభం కాగా.. ఈ నెల 10వ తేదీ వరకు మూడు రోజుల పాటు జరగనున్నాయి. రెండవ రోజు అమ్మవారు శాకంబరి దేవిగా భక్తులకు దర్శనమిస్తారు. ఇక, రేపటితో ఈ శాకంబరీ మహోత్సవాలు ముగియనున్నాయి..
విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై కొలువుదీరిన కనకదుర్గ అమ్మవారి ఆలయంలో శాకంబరీ ఉత్సవాలు ప్రారంభం అయ్యాయి.. ప్రతి ఏడాది ఆషాఢ మాసంలో నిర్వహించే శాకంబరీ మహోత్సవాలు ఇవాళ్టి నుంచి ఈ నెల 10వ తేదీ వరకు కొనసాగనున్నాయి..
విజయవాడ కనక దుర్గమ్మ గుడి మాస్టర్ ప్లాన్ రెడీ చేయడం జరిగిందని, వచ్చే 40 సంవత్సరాల అవసరాలకు తగ్గట్టు దుర్గగుడి అభివృద్ధి పనులు చేపడుతాం అని ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని) తెలిపారు. కృష్ణా పుష్కరాల నిర్వహణకు ఇప్పటి నుంచే సన్నద్ధమవుతున్నామని చెప్పారు. విజయవాడ ఎయిర్పోర్ట్లో 70 శాతం పనులు పూర్తయ్యేలా చేశాం అని.. రాబోవు రోజుల్లో వారణాసి, అలహాబాద్కి ఫ్లైట్ కనెక్టివిటీ చేస్తున్నాం అని పేర్కొన్నారు. విజయవాడకు అతిముఖ్యమైన రైల్వే లైన్స్కి 1500 కోట్లతో టెండర్లను…