Off The Record: తిరుమల మినహా ప్రభుత్వ అధీనంలోని ఇతర ఆలయాలన్నీ ఏపీలోని దేవాదాయశాఖ మంత్రి అజమాయిషీలోనే ఉంటాయి. మినిస్టర్‌గా ఆ ఆలయంలో పనిచేసే అధికారులు, సిబ్బందికి ఆదేశాలు జారీ చేయొచ్చు. కానీ.. డిప్యూటీ సీఎం హోదాలో దేవాదాయశాఖ చూస్తోన్న కొట్టు సత్యనారాయణ పరిస్థితి మాత్రం వేరే విధంగా ఉంది. తిరుమలలోనే కాదు.. ఏపీలోని మరో ఆలయంలో కూడా కొట్టు మాట చెల్లుబాటు కావడం లేదట. అదే బెజవాడ కనకదుర్గ ఆలయం. ఈ గుడిలో మంత్రి కొట్టు…
ఆంధ్రప్రదేశ్‌లోని వైఎస్ జగన్మోహన్‌రెడ్డి సర్కార్.. రాష్ట్రంలోని ఆలయాల అభివృద్ధికి మాస్టర్ ప్లాన్‌ల రూపకల్పనకు చర్యలు చేపట్టింది.. ప్రతి ఆలయానికి ఆ ఆలయ సంప్రదాయాలు పాటిస్తూ.. భక్తులకు సౌకర్యాలు, అభివృద్ధి పనులు చేపట్టేలా మాస్టర్ ప్లాన్ సిద్ధం చేస్తోంది.. వచ్చే 40 ఏళ్ల అవసరాలు, అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని ఈ ప్లాన్‌కు రూపకల్పన చేయనున్నారు. తొలి దశలో దేవదాయ శాఖ పరిధిలోని 8 ప్రధాన ఆలయాలతో సహా 25 దేవాలయాలకు మాస్టర్‌ప్లాన్ రూపొందించేందుకు చర్యలు తీసుకుంటున్న విషయం తెలిసిందే…
ఈ నెలలో దేవి శరన్నవరాత్రోత్సవాలు విజయవాడ ఇంద్రాకీలాద్రిపై కొలువుదీరిన కనకదుర్గమ్మ ఆలయంలో వైభవోపేతంగా జరిగాయి. తొమ్మది రోజలు అమ్మవారు వివిధ అలంకరణలలో భక్తులకు దర్శనమిచ్చింది. ఈ నేపథ్యంలో ఈ రోజు దుర్గమ్మ ఆలయ హుండీ ఆదాయం లెక్కింపు నిర్వహించారు. ఆలయ చైర్మన్ సోమినాయుడు, ఆలయ ఈవో భ్రమరాంబ సమక్షంలో హుండీ లెక్కింపు చేపట్టారు. ఈ మేరకు అమ్మవారి హుండీ ఆదాయం రూ. 2.87 కోట్లు వచ్చినట్లు తెలిపారు. అంతేకాకుండా బంగారం 546 గ్రాములు రాగ, 9.55 కిలోల…
సీజన్ తో సంబంధం లేకుండా.. భక్త జన ప్రవాహం కనిపించే ఆలయాల్లో.. విజయవాడ కనకదుర్గమ్మ ఆలయం ఒకటి. కొన్ని రోజుల క్రితం వరకూ… ఆలయం లోపలి వ్యవహారాలు వివాదాస్పదమైన విషయం చూస్తూనే ఉన్నాం. తాజాగా.. ఆలయం వెలుపల జరుగుతున్న ఓ వ్యవహారం.. భక్తులకు ఇబ్బందికరంగా మారుతోంది. అమరావతిని రాజధానిగా గుర్తించిన తర్వాత మొదలైన ఈ వ్యవహారం.. ఇటీవల మరింత పెరిగి.. భక్తులకు సమస్యలు పెంచుతోంది. ఇటీవల జరిగిన కొన్ని పరిణామాలు చూస్తే.. దేవాదాయ శాఖ మంత్రి కార్యాలయం…
కరోనా దెబ్బకు ఇంద్రకీలాద్రిపై పడిపోయిన భక్తుల సంఖ్య 1000 కి పడిపోయింది. అయితే ఇంద్రకీలాద్రిపై తాజాగా కోవిడ్ బాధితుల సంఖ్య 52కు చేరుకుంది. అక్కడ కోవిడ్‌తో జమలమ్మ అనే అటెండర్ మృతి చెందింది. జమలమ్మ మృతితో ఇంద్రకీలాద్రి పై మృతుల సంఖ్య మూడుకు చేరింది. ఇక సోమవారం అక్కడ ఇద్దరు అర్చకులకు కోవిడ్ పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. రెండు రోజుల క్రితం కోవిడ్‌తో అర్చకుడు మృతి చెందగా.. మరొక అర్చకుని పరిస్ధితి విషమంగా మారింది. దాంతో ఇంద్రకీలాద్రిపై…