Kanaka Durga Temple: నేటితో ముగియనున్న శరన్నవరాత్రులు.. రాజరాజేశ్వరి దేవిగా కనకదుర్గమ్మ..
- ఇంద్రకీలాద్రికి పోటెత్తిన భక్తులు..
- తెల్లవారుజాము నుంచి క్యూ లైన్లలో బారులు తీరిన భక్తులు..
- రాజరాజేశ్వరి దేవి అలంకారంలో దర్శనమిస్తున్న కనకదుర్గ..
- పెద్ద ఎత్తున తరలివచ్చిన భవానీలు..
- నేటితో ముగియనున్న దసరా శరన్నవరాత్రులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kanaka Durga Temple: విజయవాడ ఇంద్రకీలాద్రికి భక్తులు పోటెత్తారు. విజయదశమి కావడంతో కనకదుర్గ అమ్మవారిని దర్శించుకోవడానికి తెల్లవారుజామునుంచే భక్తులు క్యూ లైన్లలో బారులు తీరారు. దసరా శరన్నవరాత్రులు చివరి రోజు రాజరాజేశ్వరి దేవి అలంకారంలో దుర్గమ్మ భక్తులకు దర్శనం ఇస్తున్నారు. మరోవైపు భవానీలు పెద్ద ఎత్తున ఇంద్రకీలాద్రికి తరలివచ్చారు. ఈసారి భవానీలు ముందుగానే ఇంద్రకీలాద్రికి చేరుకుంటుండటంతో కొండ దిగువ నుంచే భక్తులి కిటకిటలాడుతున్నారు.. క్యూలైన్లు మొత్తం జై దుర్గ.. జై జై దుర్గ నామ స్మరణలతో మారు మ్రోగుతున్నాయి.. భక్తులు, భవానీల రద్దీ కొనసాగుతోన్న నేపథ్యంలో.. మజ్జిగ, మంచినీళ్లు, పాలు క్యూలైన్లలో యథావిథిగా పంపిణీ చేస్తున్నారు అధికారులు.. ఇక, రాత్రి 11 గంటల వరకూ అమ్మవారి దర్శనం కల్పించనున్నారు..
Read Also: Heavy Rains: తుఫాన్‌పై వాతావరణ శాఖ హెచ్చరిక.. ఏపీతోపాటు తెలంగాణకు భారీ వర్షాలు
Also Read
- TDP Office Attack Case: టీడీపీ ఆఫీసు దాడి కేసు.. రౌడీ షీట్ల వ్యవహారంలో కీలక మలుపు
- AP Drought: ఏపీలో 544 మండలాలను కరువు ప్రాంతాలుగా గుర్తించాలి.. జాతీయ విపత్తుగా ప్రకటించాలి..
- Nara Lokesh: ఏపీలో 50 శాతం మంది ఎమ్మెల్యేలు యువత.. పరిశ్రమలకు కొత్త అర్థం చెప్పడమే మా లక్ష్యం..
- Vijayawada Crime: విజయవాడలో కలకలం.. పెళ్లికి ఒప్పుకోలేదని ప్రియురాలిపై దాడి.. ప్రియుడు మృతి
మరోవైపు, కనకదుర్గమ్మను రాజరాజేశ్వరీ దేవి అలంకారంలో దర్శనం చేసుకున్నారు ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి వంగలపూడి అనిత.. హోంమంత్రికి కనకదుర్గమ్మ దర్శనం కల్పించారు ఆలయ అధికారులు, అర్చకులు.. దర్శనతరం హోంమంత్రికి వేదాశీర్వచనం చేసి ప్రసాదం, శేషవస్త్రం అందించారు వేదపండితులు.. ఇక, ఇంద్రకీలాద్రి పై భక్తుల రద్దీ అధికంగా ఉంది.. భవానీలు అధికంగా రావడంతో మరింతగా రద్దీ పెరిగింది.. కనకదుర్గమ్మ దర్శనానికి వచ్చే భక్తులతో ఆలయం లోపల సైతం భక్తులతో రద్దీగా మారిపోయింది.. అమ్మవారి దర్శనం చాలా అద్భుతంగా జరిగిందని, రాజరాజేశ్వరీ దేవి అవతారంలో దర్శించుకోవడం సంతోషం గా ఉందని అంటున్నారు భక్తులు.. క్యూలైన్ల లో నాలుగైదు గంటల సమయం పడుతున్నా సౌకర్యాలు బాగున్నాయని చెబుతున్నారు.
తాజావార్తలు
-
Shai Hope: భారత్‌ను ఎదుర్కోవాలంటే ఆ స్కోర్ సరిపోదు.. ఓటమికి ప్రధాన కారణం ఇదే: వెస్టిండీస్ కెప్టెన్
-
Earthquake : ఉత్తరాఖండ్‌లో భూకంపం.. ఢిల్లీ-ఎన్సీఆర్ వరకు ప్రకంపనలు!
-
Shreyas Iyer: సెంచరీతో శ్రేయాస్ అయ్యర్ వీర విహారం.. వెస్టిండీస్ చిత్తు చిత్తు.. భారత్ ఘన విజయం..
-
Wife Kills Husband: ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య.. ఫోన్ చాట్‌తో వెలుగులోకి దారుణం..
-
Team India New Captain: బీసీసీఐ సంచలన నిర్ణయం.. భారత మహిళా జట్టుకు కొత్త కెప్టెన్ ప్రకటన..
ట్రెండింగ్
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!