Vijayawada: ప్రముఖ శక్తిపీఠం విజయవాడ ఇంద్రకిలాద్రిపై వెలసిన కనకదుర్గ అమ్మవారి ఆలయంలో అంతర్గత బదిలీలు చేపట్టారు. ఆలయ ఈవో శీనా నాయక్ ఆధ్వర్యంలో ఈ బదిలీల ప్రక్రియను నిర్వహించారు. దేవాదాయ శాఖ కమిషనర్ ఆదేశాల మేరకు ప్రతి ఆరు నెలలకోసారి ఆలయ అధికారులు, అర్చకులు, వేద పండితులు, పరిచారకులకు బదిలీలు నిర్వహించడం ఆనవాయితీగా కొనసాగుతోంది.
ఇటీవల మాజీ ఈవో కేఎస్ రామారావు బదిలీ కాలపరిమితి ముగియడంతో, ప్రస్తుత ఈవో శీనా నాయక్ బదిలీల ప్రక్రియను వేగవంతం చేశారు. ఈ క్రమంలో ఆలయంలో విధులు నిర్వర్తిస్తున్న వేద పండితులు, అర్చకులు, పరిచారకులు ఎవరెక్కడ పనిచేస్తున్నారనే విషయాన్ని ఆయన సమీక్షించారు. ఈ సమీక్ష అనంతరం 9 మంది ఉద్యోగులు, 40 మంది అర్చకులు, 20 మంది పరిచారకులు, 3 మంది వేద పండితులను కొత్తగా బదిలీ చేశారు. ఆలయంలో పనిచేస్తున్న సిబ్బందికి వృత్తిపరమైన అనుభవాన్ని విస్తరించేందుకు, ఆలయ నిర్వహణ మరింత సవ్యంగా సాగేందుకు ఈ మార్పులు సాయపడతాయని ఆలయ వర్గాలు వెల్లడించాయి.
Read Also: Apple IOS 26: విజువల్ రెవల్యూషన్.. లిక్విడ్ గ్లాస్ డిజైన్‌తో iOS 26 లాంచ్..!
ఈ బదిలీలు ఆలయంలోని వివిధ శాఖలలో సమతుల్యతను తీసుకురావడమే లక్ష్యంగా నిర్వహించినట్లు తెలుస్తోంది. భక్తుల సేవను మరింత మెరుగుపరచడమే ఈ చర్యల వెనుక ఉద్దేశమని ఈవో కార్యాలయం స్పష్టం చేసింది.