కామారెడ్డి జిల్లాలో వరద ప్రభావిత ప్రాంతాల్లో ప్రస్తుతం పరిస్థితులు సాధారణంగా ఉన్నాయని, అత్యవసర పరిస్థితుల్లో ప్రజల ప్రాణాలను కాపాడడమే తమ ప్రధాన బాధ్యత అని తెలంగాణ డిజాస్టర్ రెస్పాన్స్ & ఫైర్ శాఖా డీజీ నాగిరెడ్డి స్పష్టం చేశారు.
కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండలానికి చెందిన నిమ్మల బోయిన సందీప్ (29) అనే సాఫ్ట్‌వేర్ ఉద్యోగి లోన్ యాప్ ఏజెంట్ల వేధింపులు భరించలేక ఆత్మహత్యకు పాల్పడ్డ ఘటన తీవ్ర విషాదాన్ని కలిగించింది. హైదరాబాద్‌లోని తన నివాసంలో ఫ్యాన్‌కు ఉరేసుకొని అతను ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం అందిన వెంటనే కుటుంబ సభ్యులు సదాశివనగర్‌కు మృతదేహాన్ని తీసుకెళ్లి అంత్యక్రియలు నిర్వహించారు.కుటుంబ సభ్యుల ప్రకారం.. సందీప్ వివిధ క్రెడిట్ కార్డులు, లోన్ యాప్స్ ద్వారా సుమారు 15 లక్షల రూపాయల అప్పు…
Online Betting: కామారెడ్డిలో బెట్టింగ్ మోజు ఓ కుటుంబాన్ని రోడ్డున పడేసింది. ఆన్‌లైన్ బెట్టింగ్‌లో 80 లక్షలకుపైగా కోల్పోయి అప్పుల బాధలో మునిగిపోయిన సాఫ్ట్‌వేర్ ఉద్యోగి సంజయ్ చివరికి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటనతో అతని కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది. భార్య శ్రీలత కన్నీరుమున్నీరవుతూ.. అప్పుల బాధల వల్లే నా భర్త ఆత్మహత్య చేసుకున్నాడని, బెట్టింగ్ యాప్‌లను తక్షణమే నిషేధించాలని కోరింది. అలాగే, ఎవరైనా అప్పు ఇచ్చే ముందు కుటుంబ సభ్యులకు సమాచారం అందించాలి అంటూ వాపోయింది.…
BJP MLA Ramana Reddy: కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకట రమణారెడ్డి మరోసారి వార్తల్లో నిలిచారు. కామారెడ్డి పట్టణంలో రోడ్డు వెడల్పు చేసేందుకు సొంత ఇంటిని కూల్చివేసుకున్నారు.
కామారెడ్డి జిల్లాలో అటవీప్రాంతంలో వేటకు వెళ్లిన రాజు అనే వ్యక్తి ప్రమాదవశాత్తు బండరాళ్ల మధ్య ఇరుక్కుపోయిన సంగతి తెలిసిందే. బండరాళ్ల మధ్య సెల్ ఫోన్ పడిపోవడంతో తీసుకునేందుకు యత్నించిన రాజు... తిరిగి బయటకు రాలేకపోయాడు. పెద్ద బండరాళ్ల మధ్య తలకిందులుగా చిక్కుకుపోయాడు
చిన్న చిన్న కారణాలతో కొందరు తమ విలువైన ప్రాణాలను తీసుకునే దుస్థికి వస్తున్నారు. అమ్మ తిట్టిందని, ప్రియురాలు కాదనిందని, ఫెయిల్ అయ్యామని, ఎగ్జామ్ బాగా రాయలేదని ఇలాంటి కారణాలు చెబుతూ మనస్తాపానికి గురై బలవత్మరానికి పాల్పడుతున్నారు. ఇలాంటి ఘటనే కామారెడ్డి జిల్లా భిక్కనూర్ మండలం జంగంపల్లిలో చోటుచేసుకుంది. read also: KCR to go Bihar: బీహార్ వెళ్లనున్న కేసీఆర్. తాజా రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో త్వరలో ప్రయాణం. పంచశీల అనే యువతి డిగ్రీ పూర్తి చేసి…
కామారెడ్డి జిల్లాలో విషాద ఘటన చోటు చేసుకుంది. గుండెనొప్పితో ఓ వ్యక్తి డాక్టర్ లక్ష్మణ్ దగ్గరకు వచ్చాడు. అయితే ఈ నేపథ్యంలో డాక్టర్ లక్ష్మణ్ పేషెంట్‌కు చికిత్స చేస్తుండగా ఉన్నట్టుండి డాక్టర్ లక్ష్మణ్ కూడా గుండెపోటు వచ్చింది. దీంతో డాక్టర్ లక్ష్మణ్‌తో పాటు, పేషెంట్ ఇద్దరూ మృతి చెందారు. ఈ సంఘటన స్థానికంగా కలకలం రేపుతోంది. దీంతో ఇరు కుటుంబాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఈ ఘటనపై పూర్తి సమాచారం అందాల్సి ఉంది.
కామారెడ్డిలో ఓ వివాహత అనుమానస్పదస్థితిలో మృతి చెందిన సంఘటన చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హరిప్రసాద్, శిరీష(32)లు దంపతులు. బెంగూళూరులోని ఓ సాఫ్ట్‌వేర్ సంస్థలో వీరిద్దరూ ఉద్యోగాలు చేస్తున్నారు. కరోనా నేపథ్యంలో గత కొంతకాలంగా ఇంటినుంచే విధులు నిర్వర్తిస్తున్నారు. అయితే ఈ రోజు ఉదయం శిరీష ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుందని భర్త హరిప్రసాద్ శిరీష తల్లిదండ్రులకు సమాచారం అందించాడు. దీంతో హుటాహుటినా సంఘటన స్థలానికి చేరుకున్న శిరీష తల్లిదండ్రులు హరిప్రసాదే శిరీషను హత్యచేసి ఆత్మహత్యగా…