కామారెడ్డి జిల్లాలో విషాద ఘటన చోటు చేసుకుంది. గుండెనొప్పితో ఓ వ్యక్తి డాక్టర్ లక్ష్మణ్ దగ్గరకు వచ్చాడు. అయితే ఈ నేపథ్యంలో డాక్టర్ లక్ష్మణ్ పేషెంట్‌కు చికిత్స చేస్తుండగా ఉన్నట్టుండి డాక్టర్ లక్ష్మణ్ కూడా గుండెపోటు వచ్చింది. దీంతో డాక్టర్ లక్ష్మణ్‌తో పాటు, పేషెంట్ ఇద్దరూ మృతి చెందారు. ఈ సంఘటన స్థానికంగా కలకలం రేపుతోంది. దీంతో ఇరు కుటుంబాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఈ ఘటనపై పూర్తి సమాచారం అందాల్సి ఉంది.