BJP MLA Ramana Reddy: సార్ మీకు సలామ్.. మాటకోసం సొంతింటినే కూల్చేసిన బీజేపీ ఎమ్మెల్యే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
BJP MLA Ramana Reddy: కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకట రమణారెడ్డి మరోసారి వార్తల్లో నిలిచారు. కామారెడ్డి పట్టణంలో రోడ్డు వెడల్పు చేసేందుకు సొంత ఇంటిని కూల్చివేసుకున్నారు. మున్సిపాలిటీ అధికారులకు ఆదేశాలు ఇవ్వడంతో శనివారం ఉదయం ఇంటిని కూల్చివేశారు. అయితే ఇప్పుడు నగరవాసుల దృష్టి కాంగ్రెస్ నేత మాజీ మంత్రి షబ్బీర్ అలీపై పడింది. ఈ రోడ్డుపైనే ప్రస్తుత ప్రభుత్వ సలహాదారు, మాజీ మంత్రి షబ్బీర్ అలీ ఇల్లు ఉంది. దీనిపై షబ్బీర్ అలీ ఎలా స్పందిస్తారోనని కామారెడ్డి పట్టణ ప్రజలు ఎదురు చూస్తున్నారు. రోడ్డు వెడల్పుకు అడ్డుగా ఉన్న సొంత ఇంటిని కూల్చివేసి బీజేపీ ఎమ్మెల్యే వెంకట రమణారెడ్డి మాట నిలబెట్టుకున్నారు. రోడ్డు విస్తరణ కోసం ఇళ్లు కూల్చివేసేందుకు రోడ్డు పక్కన ఉన్న ఇళ్ల యజమానులు సహకరించాలని కోరారు. పాత మాస్టర్ ప్లాన్ ప్రకారం కామారెడ్డి జిల్లా కేంద్రంలోని పాత బస్టాండ్ నుంచి రైల్వే గేటు వరకు 80 అడుగుల రోడ్డు నిర్మించాల్సి ఉంది. ప్రస్తుతం 30 అడుగుల రోడ్డు మాత్రమే ఉంది.
Read also: Minister Seethakka: ములుగులో సీతక్క పర్యటన.. మేడారం జాతర పనుల పరిశీలన
Also Read
- Vikarabad: అనంతగిరి లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. నలుగురు మృతి
- Silver Jubilee Fraternity Meet: కర్నూలు సిల్వర్ జూబ్లీ కాలేజీ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం.. ముఖ్య అతిథిగా వెంకయ్య
- Harish Rao: టీజీ ట్రాన్స్‌కో వాటాల విక్రయంపై రాహుల్ గాంధీకి హరీశ్ రావు లేఖ
- OTR: నామినేటెడ్ పోస్టులు ఫర్ సేల్? ఒక్కో పోస్టుకు ఒక్కో రేటు?
వారంలో స్వచ్ఛందంగా తొలగించండి..
రోడ్డు వెడల్పు చేయడానికి వీలు లేకుండా అనేక మంది తమ నివాస గృహాలు నిర్మించుకున్నారు. ఇళ్ల ముందు కుళాయిలు, షెడ్లు ఏర్పాటు చేశారు. రోడ్డు విస్తరణకు ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు రావాలని ఎమ్మెల్యే వెంకట రమణారెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. రోడ్డు విస్తరణ కోసం ఇళ్ల తొలగింపు తన ఇంటి నుంచే ప్రారంభించాలని, దారిలో ఉన్న తన ఇంటిని కూల్చివేసి అధికారులకు అప్పగించారు. శనివారం ఉదయం ఆర్‌అండ్‌బీ, మున్సిపల్, విద్యుత్ శాఖ అధికారుల ఆధ్వర్యంలో జేసీబీతో దగ్గరుండి ఇంటిని కూల్చివేశారు. పంచముఖి హనుమాన్ దేవాలయం కూడా ఇదే దారిలో ఉన్నందున ఆలయానికి ఇబ్బంది కలగకుండా రోడ్డు పనులు చేపట్టాలని అధికారులకు సూచించారు. వారం రోజుల్లోగా రోడ్డుపై ఉన్న కుళాయి గుంతలు, షెడ్లను స్వచ్ఛందంగా తొలగించి అభివృద్ధికి ప్రజలు సహకరించాలని కోరారు. ప్రస్తుతం ఉన్న రోడ్డుకు అదనంగా మరో 24 అడుగుల రోడ్డును నెల రోజుల్లోగా నిర్మించాలని అధికారులను ఆదేశించారు. అయితే బీజేపీ ఎమ్మెల్యే కాటిపల్లి వెంకట రమణారెడ్డి చేసిన పనికి సార్ మీకు సలామ్ అంటూ కామెంట్ చేస్తున్నారు.
Pending Challans: మూడురోజులే గడువు.. పెండింగ్ చలాన్లు కట్టని వారు కట్టేయండి బాబు..
తాజావార్తలు
-
AP Drought: ఏపీలో 544 మండలాలను కరువు ప్రాంతాలుగా గుర్తించాలి.. జాతీయ విపత్తుగా ప్రకటించాలి..
-
Jr NTR: ఒక్కడ్నీ వదలను.. మార్ఫింగ్ బ్యాచ్‌కు ఎన్టీఆర్ వార్నింగ్!
-
Petrol Diesel Price Hike: వాహనదారులకు షాక్.. పెట్రోల్ రూ.5, డీజిల్ రూ.3 పెంపు
-
Keerthy Suresh: లేడీ గ్యాంగ్‌స్టర్‌గా కీర్తి సురేశ్ ఊచకోత.. ఓటీటీ రిలీజ్ డేట్ లాక్!
-
Nara Lokesh: ఏపీలో 50 శాతం మంది ఎమ్మెల్యేలు యువత.. పరిశ్రమలకు కొత్త అర్థం చెప్పడమే మా లక్ష్యం..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!