DG Nagireddy : కామారెడ్డి జిల్లాలో వరద ప్రభావిత ప్రాంతాల్లో ప్రస్తుతం పరిస్థితులు సాధారణంగా ఉన్నాయని, అత్యవసర పరిస్థితుల్లో ప్రజల ప్రాణాలను కాపాడడమే తమ ప్రధాన బాధ్యత అని తెలంగాణ డిజాస్టర్ రెస్పాన్స్ & ఫైర్ శాఖా డీజీ నాగిరెడ్డి స్పష్టం చేశారు. ఆయన మాట్లాడుతూ, “ఇప్పటివరకు 1,647 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించగలిగాం. కామారెడ్డి, నిజామాబాద్, మెదక్, నిర్మల్, రాజన్న సిరిసిల్ల, సిద్దిపేట్ జిల్లాల్లో వర్షాల ప్రభావం తీవ్రంగా ఉండటంతో విస్తృతంగా రెస్క్యూ ఆపరేషన్లు చేపట్టాం” అని తెలిపారు.
Janhvi Kapoor : అతనితో నాకు మ్యారేజ్ అయింది.. జాన్వీకపూర్ భారీ ట్విస్ట్
వెయ్యికి పైగా సిబ్బంది, 14 ఫైర్ స్టేషన్ ఆఫీసర్లు, 200 మంది శిక్షణ పొందిన రెస్క్యూ సిబ్బందితో పాటు 13 బోట్స్, 15 ఎమర్జెన్సీ వాహనాలను రంగంలోకి దించారు. వరదలో చిక్కుకున్న వారిని కాపాడటంలో ఎన్‌డీఆర్‌ఎఫ్, ఎస్‌డీఆర్‌ఎఫ్, పోలీస్ బృందాలు రాత్రింబవళ్ళు శ్రమిస్తున్నాయని ఆయన వివరించారు. కామారెడ్డి జిల్లాలో ట్యాంకర్‌పై చిక్కుకున్న ఎనిమిది మందిని సురక్షితంగా బయటికి తీసుకురావడంలో విజయం సాధించామని, అలాగే నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండలం వాడి గ్రామంలో వరద నీటిలో చిక్కుకుపోయిన 380 మందిని ఒకేసారి ఎస్‌డీఆర్‌ఎఫ్ బృందం రక్షించిందని వెల్లడించారు. “ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. లోతట్టు ప్రాంతాల వారు జాగ్రత్తలు తీసుకోవాలి. ఎలాంటి ఇబ్బందులు వచ్చినా వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలి. ప్రజల ప్రాణాలు కాపాడడమే మా ప్రథమ కర్తవ్యం” అని డీజీ నాగిరెడ్డి తెలిపారు.
TMC MP Controversy: అమిత్‌షా తల నరికి టేబుల్‌పై పెట్టాలి.. వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన టీఎంసీ ఎంపీ