Balakrishna: సౌతిండియాలోని అన్ని ఫిల్మ్ ఇండస్ట్రీల్లో ప్రస్తుతం విపరీతంగా చర్చలో ఉన్న అంశం నందమూరి బాలకృష్ణ మల్టీస్టారర్ మూవీ. బాలయ్య బాబు చాలాకాలంగా మల్టీ స్టారర్ సినిమాలకు దూరంగా ఉంటున్నారు. ఇప్పుడు నడుస్తున్న ట్రెండ్ కు అనుగుణంగా ఆయన కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్, సూపర్ స్టార్ రజినీకాంత్‌తో కలిసి రెండు భాగాలుగా తెరకెక్కే భారీ ప్రాజెక్టు చేయనున్నట్లు ప్రచారం అవుతోంది.