శరత్ బాబు, కమల్ హాసన్ కలసి అనేక చిత్రాలలో నటించారు. వాటిలో కె.విశ్వనాథ్ దర్శకత్వంలో రూపొందిన “సాగరసంగమం, స్వాతిముత్యం” చిత్రాలు కూడా ఉన్నాయి. ఈ రెండు చిత్రాలలో కమల్ హాసన్ అభినయం చూసి మన దేశంలో నటనకు ‘ఆస్కార్ అవార్డ్’ అంటూ వస్తే అది కమల్ తోనే మొదలవుతుంది అంటూ శరత్ బాబు అనేవారు. ఆ మాటను కె.విశ్వనాథ్ సైతం బలపరిచారు. అలా కమల్ కు ఆస్కార్ అంటూ అప్పట్లో సినిమా పత్రికల్లో ఆకర్షణీయమైన కథనాలు ప్రచురితమయ్యాయి.…