CM Revanth Reddy: 2034 జూన్ వరకు తెలంగాణ లో కాంగ్రెస్ అధికారంలో ఉంటుందని సీఎం రేవంత్‌రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. నేను కాంగ్రెస్ కార్యకర్తను.. ఏ ఎన్నిక వచ్చిన కోట్లాడత.. నాది లీడర్ మనస్తత్వం కాదు.. క్యాడర్ మనస్తత్వం అన్నారు. డోర్ టు డోర్ కూడా తిరుగుతానని స్పష్టం చేశారు. సెక్యూరిటీ అనుమతి ఇవ్వడం లేదు కానీ.. ఇస్తే ఇల్లు ఇల్లు తిరుగుతానన్నారు. నాకు ఓపిక.. వయసు ఉందని చెప్పారు. అనంతరం సీఎం రేవంత్ బీజేపీ…
తెలంగాణ రాజకీయాల్లో మరోసారి ఆరోపణలు, ప్రత్యారోపణలు ఊపందుకున్నాయి. కాంగ్రెస్ సీనియర్ నేత మధు యాష్కీ, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబంపై తీవ్ర విమర్శలు గుప్పించారు.
కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతి కేసులో మాజీ సీఎం కేసీఆర్‌పై చర్యలు తీసుకోకుండా.. సీబీఐ విచారణకు ఎందుకు ఇచ్చినట్టు అని ప్రభుత్వంను ఎంపీ డీకే అరుణ ప్రశ్నించారు. సీబీఐ మీద నమ్మకం లేదన్న కాంగ్రెస్.. ఇప్పుడు ఎందుకు ఇచ్చినట్టు అని విమర్శించారు. బీజేపీపై బట్ట కాల్చి మీద వేసేందుకు సీబీఐకి కేసు అప్పగించారని.. సీబీఐకి ఈ ప్రభుత్వం సహకరిస్తుందన్న నమ్మకం తనకు లేదన్నారు. బీజేపీ, బీఆర్ఎస్ ఒకటే అనే చెప్పేందుకు.. ఇదంతా ఒక పన్నాగం అని మండిపడ్డారు. బీఆర్ఎస్‌ను…
ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో కాళేశ్వరం ప్రాజెక్టుపై ఆరోపణలు, ప్రత్యారోపణల యుద్ధం నడుస్తోంది. జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదిక ఆధారంగా.. కేసును ప్రభుత్వం సీబీఐ విచారణకు అప్పగించింది. కమిషన్ నివేదిక ఆధారంగా సీబీఐ విచారణ జరపాలని కేంద్ర హోం మంత్రిత్వ శాఖకు తెలంగాణ సర్కార్ లేఖ రాసింది. డీఎస్పీ యాక్ట్ సెక్షన్ 6 కింద రాష్ట్రం నుంచి కేంద్రానికి నోటిఫికేషన్ వెళ్లింది. రాష్ట్రంలో సీబీఐకి జనరల్ కన్సెంట్ ఇస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కేంద్రం కూడా సెక్షన్…
Jagga Reddy : కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డి మరోసారి బీఆర్ఎస్ (BRS) నాయకులపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ప్రాజెక్టుల లోపాలు, అవినీతి, లిక్కర్ దందాలు, భూ కబ్జాలు అంటూ మాజీ సీఎం కేసీఆర్ కుటుంబంపై నిప్పులు చెరిగారు. మీడియాతో మాట్లాడుతూ.. “కాళేశ్వరం ప్రాజెక్టు లక్ష కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించామని చెబుతారు. అందులో కనీసం 30 శాతం అంటే 30 వేల కోట్లు తినేశారు. హరీష్ రావు అందుకే ప్రాజెక్టు దగ్గరే పడుకున్నాడు. దమ్ముంటే ప్రభాకర్…
Ponguleti Srinivasa Reddy: తెలంగాణ రాష్ట్రం పునర్నిర్మాణ దిశగా నడుస్తుందని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో పేదల పాలన, కలల సాధనకు ప్రభుత్వం కట్టుబడిందని రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు. తాజాగా నిర్వహించిన సభలో ఆయన ప్రజలనుద్దేశించి మాట్లాడుతూ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. మీ అందరి దీవెనలతో ఇందిరమ్మ రాజ్యం వచ్చింది.. రాష్ట్ర ప్రభుత్వానికి ఎంత కష్టం వచ్చినా పేదవాడి కళలను సహకారం చేసేందుకు సీఎం రేవంత్ రెడ్డి నేతృత్యంలో రాష్ట్ర…
ఎర్రవెల్లి ఫాంహౌస్‌లో కేసీఆర్, హరీష్‌రావు భేటీ ముగిసింది.. సుమారు మూడున్నర గంటలపాటు సమావేశం కొనసాగింది. కాళేశ్వరం కమిషన్ ఏర్పాటైనప్పటి నుంచి ఇప్పటివరకు జరిగిన విచారణపై కేసీఆర్ సమీక్ష నిర్వహించారు. కేవలం రాజకీయ కక్షతోనే కాంగ్రెస్ పార్టీ కాళేశ్వరం విచారణ కమిషన్ ఏర్పాటు చేశారని కేసీఆర్ ఆరోపణలు చేశారు. జూన్ 5న కేసీఆర్, జూన్ 9న హరీష్ రావు కాళేశ్వరం కమిషన్ ఎదుట విచారణలో వినిపించాల్సిన వాదనలు, వివరణలపై చర్చలు జరిపారు.
TPCC Mahesh Goud : ఎమ్మెల్సీ కవిత మాజీ సీఎం కేసీఆర్‌కు రాసిన లేఖ వ్యవహారం తెలంగాణలో హాట్ టాపిక్ గా మారింది. ఈ నేపథ్యంలో బీఆర్ఎఎస్, కాంగ్రెస్ నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ఈ క్రమంలోనే టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ ఇంట్లో కుంపటి తట్టుకోలేక కేటీఆర్ సతమతం అవుతున్నాడని, ఎకు మేకై మరో పవర్ సెంటర్ రావడంతో మతిభ్రమించి, రేవంత్ రెడ్డి పైన కేటీఆర్ మాట్లాడారని ఆయన మండిపడ్డారు. కవిత…