AP Crime: కాళ్లు, చేతులు కట్టేసి.. బకెట్‌లో ముంచి ఇద్దరు కుమారుల హత్య.. ఆపై..
- కాకినాడలో సంచలనంగా మారిన మూడు మరణాలు..
- ఇద్దరు కుమారులను దారుణంగా హత్య చేసిన తండ్రి..
- ఆ తర్వాత తాను ఆత్మహత్య..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AP Crime: కాకినాడలో మూడు మరణాలు ఇప్పుడు సంచలనంగా మారిపోయాయి.. ఇద్దరు కుమారులను అత్యంత దారుణంగా హత్యచేసిన ఓ తండ్రి.. ఆ తర్వాత ఆత్మహత్య చేసుకున్నాడు.. రాష్ట్రంలో కలకలం సృష్టిచిన కాకినాడ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే.. కాకినాడ వోఎన్జీసీలో అసిస్టెంట్ అకౌంటెంట్ గా పనిచేస్తున్నాడు చంద్ర కిషోర్ అనే వ్యక్తి.. భార్య తనూజ.. ఇద్దరు పిల్లలతో కలిసి స్థానికంగా నివాసం ఉంటున్న చంద్రకిషోర్.. ఒకటో తరగతి చదువుతున్న పెద్ద కొడుకు జోషీల్, యూకేజీ చదువుతున్న రెండో కొడుకు నిఖిల్‌ను అత్యంత పాశవికంగా ప్రాణాలు తీశాడు.. ఇద్దరి కాళ్లు, చేతులు తాళ్లతో కట్టేసి, నీళ్ల బకెట్లలో తలల ముంచి.. ఊపిరి ఆడకుండా చేసి.. ఇద్దరని చంపేశాడు.. ఇక, పిల్లలు చనిపోయారని నిర్ధారించుకున్న తర్వాత తాను ఉరి వేసుకున్న ఆత్మహత్య చేసుకున్నాడు చంద్ర కిషోర్..
Read Also: Bangladesh: బంగ్లాదేశ్‌లో మరోసారి హిందూ ఆలయంపై దాడి.. విగ్రహాన్ని ధ్వంసం చేసిన దుండగులు
Also Read
- Techie Suicide: జీతం ఇవ్వాలని వేధింపులు.. మహిళా టెక్కీ ఆత్మహత్య..
- EV Car Fire Accident: విజయవాడ వెస్ట్ బైపాస్పై ఘోర రోడ్డు ప్రమాదం.. ఈవీ కారు దగ్ధం, నలుగురు సజీవదహనం..
- Bollaram Incident: ఉద్యోగంలో నుంచి తీసేశాడని కక్ష.. చిన్నారి కిడ్నాప్, హత్య..
- Maharashtra: పెళ్లి నిశ్చయం.. ప్రియురాలిని లోయలోకి తోసిచంపిన ప్రియుడు..
భార్య తనూజ.. పిల్లలను హోలీ వేడుకలకు తీసుకుని వెళ్లిన చంద్ర కిషోర్.. ఆ తర్వాత పిల్లలకు యూనిఫామ్ కోసం టైలర్ దగ్గరికి తీసుకుని వెళ్తానని ఇంటికి తీసుకుని వచ్చాడు.. ఈ మధ్యనే పిల్లలు స్కూల్ మార్చినట్టుగా చెబుతున్నారు.. అయితే, ఇద్దరు కుమారులను కన్న తండ్రే ఇంత దారుణంగా హత్య చేయడం స్థానికంగా కలకలం రేపుతోంది.. పిల్లలు చదువులో వెనకబడ్డారని హత్య చేశాడనే ఓ వాదన ఉండగా.. అసలు ఈ హత్యలు, ఆత్మహత్యల వెనుక ఏం జరిగింది.. ఏ కారణంతో ఆ తండ్రి ఇంత కిరాతకంగా మారిపోయాడు అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు.. ముగ్గురి మరణాలపై అన్ని కోణాల్లో విచారణ జరుపుతున్నారు.. ఆత్మహత్య చేసుకున్న చంద్రకిషోర్.. సూసైడ్ నోట్ రాశాడు.. పిల్లలు పోటీ ప్రపంచంలో రాణించలేకపోతున్నారని.. దీంతో వారిని చంపేసినట్లు సూసైడ్ నోట్‌లో పేర్కొన్నాడు.. అయితే, భార్యను నమ్మించి.. ఇద్దరు పిల్లల్ని దారుణంగా హత్య చేశాడు..
తాజావార్తలు
-
Emraan Hashmi Accident: ఇమ్రాన్ హష్మీకి త్రుటిలో తప్పిన ప్రమాదం.. పల్టీ కొట్టిన కారు..!
-
RC 17: సినిమా ఓపెనింగ్ కాదు.. ఆఫీస్ మాత్రమే.!
-
రూ.14,999కే itel 5G ఫోన్.. 120Hz డిస్‌ప్లే, 5000mAh బ్యాటరీతో City 300 లాంచ్..!
-
Sahibzada Farhan: అభిషేక్ శర్మ, విరాట్ కోహ్లీ రికార్డులు బద్దలు.. పాకిస్థాన్ కొత్త కెప్టెన్ వీర విహారం..
-
Trump: ట్రంప్ ప్రచార సభలో గందరగోళం.. నిరసనకారుడిని చితకబాదిన మద్దతుదారులు
ట్రెండింగ్
-
Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!
-
Qais Ahmad: మాములు యాక్టింగ్ కాదయ్యా.. నీ పెర్ఫార్మన్స్కు ఆస్కార్ కూడా పనికిరాదేమో.! వీడియో వైరల్..
-
టాటా.. బైబై.. గయా.. WCL 2026 లీగ్ స్టేజీలోనే ఇండియా చాంపియన్స్ ఔట్..!
-
How To Grow Tej Patta In Pots: మార్కెట్ నుంచి తెచ్చే పని లేదు.. ఇంట్లోనే ఈజీగా బిర్యానీ ఆకు మొక్కను పెంచండి..
-
Sound Glow ఫీచర్తో Apple HomePod Mini 2 లాంచ్.. ఫీచర్లు మాత్రం మైండ్ బ్లోయింగ్ అంతే.!