ఓఎన్జీసీలో అసిస్టెంట్ అకౌంటెంట్‌గా పని చేస్తున్న చంద్ర కిషోర్, అతని కుమారులు జోషీల్, నిఖిల్ మృతదేహలను బంధువులు సొంత ఊరు తాడేపల్లిగూడెం తీసుకుని వెళ్లారు. సొంత గ్రామంలో అంత్యక్రియలు చేసేందుకు తీసుకెళ్లారు. కాకినాడ జీజీహెచ్‌లో మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహించారు. రెండు రోజుల్లో పోస్టుమార్టం రిపోర్టులు వస్తాయని వైద్యులు చెప్పారు. చంద్ర కిషోర్ ఆత్మహత్య చేసుకున్నట్లుగానే వైద్యులు ప్రాథమికంగా చెబుతున్నారు. మెడకు ఉరితాడు బిగించుకుని ఒక్కసారిగా మోకాళ్లపై కూర్చున్నట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
చంద్ర కిషోర్ కుటుంబం, కంపెనీలో ఏమైనా ఘర్షణలు ఉన్నాయా? అనే కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు. చంద్ర కిషోర్ మొబైల్ స్వాధీనం చేసుకుని.. కాల్ డేటా, వాట్సాప్ వెరిఫికేషన్ చేస్తున్నారు. ఘటన జరిగిన రోజు అపార్ట్మెంటులో సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నారు. పిల్లలు స్కూల్ విషయంలో ఇంత దారుణానికి ఎందుకు ఒడిగడతాడు అని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇద్దరు కుమారులను కాళ్లు, చేతులు కట్టేసి నోటికి గుడ్డ కట్టి నీటి బకెట్‌లో ముంచి ప్రాణం తీసి.. ఆపై తానూ ఫ్యాన్‌కు ఉరివేసుకుని చంద్ర కిశోర్ ఆత్మహత్యకు పాలపడ్డాడు.