Andrapradesh : ప్రకాశంలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆర్టీసీ బస్సును ఢీ కొట్టిన లారీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆంధ్ర ప్రదేశ్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.. ప్రయాణికులతో వెళ్తున్న ఆర్టీసీ బస్సును వేగంగా వచ్చిన లారీ ఢీ కొట్టింది.. ఈ ప్రమాదంలో డ్రైవర్ అక్కడిక్కడే మృతి చెందినట్లు తెలుస్తుంది.. 20 మందికి పైగా ప్రయాణీకుల కు తీవ్ర గాయాలు అయినట్లు పోలీసులు తెలిపారు. వివరాళ్లోకి వెళితే..
ఏపీ కాకినాడ లో ఈ ప్రమాదం జరిగింది.. కాకినాడ నుండి కర్నూల్ కు వెళుతున్న ఆర్టిసి బస్సు ప్రకాశం జిల్లాలో ప్రమాదానికి గురయ్యింది. జాతీయ రహదారిపై వేగంగా వెళుతున్న బస్సు త్రిపురాంతకం మండలం శ్రీనివాస్ నగర్ సమీపంలో ఓ లారీని ఢీకొట్టింది. అదుతప్పిన బస్సు రోడ్డుపక్కన ఆగివున్న లారీని ఢీకొట్టడంతో డ్రైవర్ తీవ్రంగా గాయపడ్డాడు. రెండు వాహనాల మధ్య ఇరుక్కుపోయిన ఆర్టిసి డ్రైవర్ అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. మరో 12మంది ప్రయాణికులకు కూడా తీవ్ర గాయాలయ్యాయి.. ఈ ప్రమాధాన్ని గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించేశారు..
Also Read
- Pawan Kalyan: స్థానిక సంస్థల ఎన్నికలు.. జనసేన నేతలకు పవన్ పిలుపు..
- Varupula Subbarao Resigns from YSRCP: వైసీపీకి బిగ్ షాక్.. పార్టీకి వరుపుల సుబ్బారావు గుడ్‌బై.. పవన్ సమక్షంలో జనసేనలో చేరిక..
- Deputy CM Pawan Kalyan: కాకినాడలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు.. అభివృద్ధి, స్వేచ్ఛపై పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు
- Minister Narayana: అన్ని మున్సిపాలిటీలకు ఒకేసారి ఎన్నికలు.. మంత్రి నారాయణ కీలక ప్రకటన
సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. తీవ్ర గాయాలపాలైన ప్రయాణికుల ను మార్కాపురం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఇద్దరి పరిస్థితి విషమంగా వుండటం తో వారిని మెరుగైన వైద్యం కోసం ఒంగోలుకు తరలించారు… జేసేపి సాయంతో బస్సు లో నుంచి డ్రైవర్ మృత దేహాన్ని బయటకు తీశారు.. పోస్ట్ మార్టం కోసం ఆసుపత్రికి తరలించారు.. ఈ ఘటన పై పూర్తి వివరాలు తెలియాల్సి ఉన్నాయి..
ఇదిలా ఉండగా.. శనివారం తెల్లవారుజామున వైఎస్సార్ కడప జిల్లాలో జరిగిన రోడ్డుప్రమాదంలో ఆర్టివో తో పాటు మరొకరు మృతిచెందారు. ఆర్టీవో శివప్రసాద్ అలంఖాన్ పల్లె వద్ద విధులు నిర్వహిస్తుండగా ప్రమాదం జరిగింది. తెల్లవారుజామున విధుల్లో ఉన్న సమయంలో శివప్రసాద్ తో పాటు కేశవ్ అనే మరో వ్యక్తిని టిప్పర్ లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కేశవ్ అక్కడికక్కడే మృతిచెందగా.. శివప్రసాద్ తీవ్రంగా గాయపడ్డారు.. అతని పరిస్థితి విషమంగా మారడంతో అతను కూడా మృతి చెందినట్లు సమాచారం..
తాజావార్తలు
-
Kona Venkat : ఆ డైరెక్టర్లను బ్యాన్ చేయాలి.. సంచలన కామెంట్లపై కోన వెంకట్ క్లారిటీ
-
Gyanesh Kumar: జ్ఞానేశ్ కుమార్, ఈసీకి 124 మంది మాజీ-బ్యూరోక్రాట్ల మద్దతు.!
-
Telangana Govt: వియత్నాంకు 40 మంది ఉపాధ్యాయులు, అధికారుల బృందం.. ఎందుకంటే..
-
BJP: ‘‘దేశాన్ని పార్లమెంటే పాలిస్తుంది, వీధులు కాదు’’.. కాంగ్రెస్, కాక్రోచ్‌లపై బీజేపీ ఫైర్..
-
Yash : డేవిడ్ రెడ్డి డైరెక్టర్’తో యష్.. అంతా ఒట్టిదేనట!
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!