Minister Narayana: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తుకు పరిశ్రమలు ఎంతో కీలకమైనవి.. విశాఖలో జరగనున్న సమ్మిట్ ద్వారా రూ.10 లక్షల కోట్ల పెట్టుబడులు రాబోతున్నాయి.. తద్వారా 7.5 లక్షల మందికి ఉద్యోగాలు రాబోతున్నాయని తెలిపారు మంత్రి పి. నారాయణ.. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వర్చువల్‌గా కాకినాడ మ్యాట్ మైరైన్ షిప్పింగ్ కన్స్ట్రక్షన్ అండ్ రిపేర్ యార్డ్ కు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి నారాయణ, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.. ఈ యార్డ్‌ను ఏపీఐఐసీ సేకరించిన 10…
Nara Lokesh: పోర్టు ఆధారిత మౌలిక సదుపాయాల్లో పెట్టుబడులు పెట్టాలని ట్రాఫిగురా సీఈవో సచిన్‌గుప్తాను మంత్రి లోకేష్ కోరారు. విశాఖ, కాకినాడ పోర్టుల్లో అధునాతన వేర్‌హౌసింగ్ మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. విద్యుత్ వాణిజ్యంలో భాగస్వామ్యం కావాలని సచిన్‌గుప్తాను కోరారు.ఎల్‌ఎన్‌జీ రీగ్యాసిఫికేషన్ టెర్మినల్ ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. తాజాగా గ్లోబల్ రియల్ ఎస్టేట్ ఇన్వెస్టిమెంట్ ప్లాట్ ఫాం ఈఎస్ఆర్ గ్రూప్ ఇండియా ఇన్వెస్టిమెంట్స్ హెడ్ సాదత్ షా, డైరెక్టర్ (లీజింగ్) ప్రకృత్ మెహతాతో…
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని రైతులకు శుభవార్త. రాష్ట్రంలో పంట సాగు ముమ్మరంగా సాగుతున్న వేళ యూరియా కొరత నివారించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అత్యవసర చర్యలు తీసుకుంది. కేంద్ర రసాయనాలు అండ్ ఎరువుల శాఖ మంత్రితో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు చర్చలు జరిపారు. రైతులకు యూరియా అవసరాల దృష్ట్యా రాష్ట్రానికి 10,350 మెట్రిక్ టన్నుల యూరియాను విశాఖపట్నంలోని గంగవరం పోర్టులో దిగుమతికి కేంద్రం జీవో జారీ చేసింది. యూరియా విశాఖలోని గంగవరం పోర్ట్ ద్వారా దిగుమతి…
మహానాడులో దివంగత ఎన్టీఆర్ ఏఐ వీడియోలు పెట్టడం దారుణమని మాజీ ఎంపీ భారత్ అన్నారు. తూర్పుగోదావరి జిల్లాలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. చంద్రబాబును ఎన్టీఆర్ ఔరంగాజేబ్ తో పోల్చారని సంచలన వ్యాఖ్య చేశారు.
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. నెలలో 15 రోజులు, రెండు పూటలా రేషన్ సరకుల పంపిణీ చేపట్టనున్నట్లు తెలిపారు. ఆ మేరకు ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. పేదలకు ప్రభుత్వం అందించే రేషన్ సరుకుల చౌక ధరల దుకాణాలు గత ప్రభుత్వంలో మూసేసి, ఇంటింటికి అందిస్తాం అని రూ.1600 కోట్లతో వాహనాలు కొనుగోలు చేసిన విషయాన్ని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గుర్తు చేశారు.
కాకినాడ పోర్టు నుంచి ఫిలిప్పీన్స్‌కు వెళ్తున్నాయి తెలంగాణ రాష్ట్రానికి చెందిన బియ్యం.. ఫిలిప్పీన్స్‌కు 8 లక్షల టన్నుల బియ్యం ఇవ్వడానికి ఒప్పందం కుదిరింది.. అయితే, ఒప్పందంలో భాగంగా తొలి విడతలో 12,500 టన్నుల బియ్యం పంపిస్తున్నారు.. లోడింగ్ ప్రక్రియ పూర్తి చేసుకుని ఫిలిప్పీన్స్‌కు వెళ్తున్న షిప్‌ను జెండా ఊపి ప్రారంభించారు తెలంగాణ పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి..
ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) విచారణకు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి హాజరయ్యారు. హైదరాబాద్ బషీర్‌బాగ్‌లోని ఈడీ కార్యాలయానికి విజయసాయిరెడ్డి వచ్చారు. కాకినాడ పోర్టు సెజ్‌కు సంబంధించిన కేసులో ఈడీ ఎదుట ఆయన విచారణకు ఆయన హాజరయ్యారు. ఇప్పటివరకు సేకరించిన ఆధారాలపై వైసీపీ ఎంపీని ఈడీ అధికారులు ఎంత సేపు విచారణ చేస్తారో చూడాలి. వైసీపీ హయాంలో కాకినాడ సీ పోర్ట్స్ లిమిటెడ్ (కేఎస్‌పీఎల్), కాకినాడ సెజ్ (కేసెజ్)ల్లోని రూ.3,600 కోట్ల విలువైన షేర్లను కేవీ రావు (కర్నాటి వెంకటేశ్వరరావు)…
కాకినాడ తీరంలో గత 55 రోజులుగా నిలిచిపోయిన ‘స్టెల్లా ఎల్’ నౌకకు ఎట్టకేలకు మోక్షం లభించింది. ఈరోజు తెల్లవారుజామున పశ్చిమ ఆఫ్రికాకు నౌక బయలుదేరి వెళ్లింది. కస్టమ్స్ అధికారులు క్లియరెన్స్ ఇవ్వడంతో పశ్చిమ ఆఫ్రికా తీరంలోని బెనిన్ దేశ వాణిజ్య కేంద్రం కొటోనౌ పోర్టుకు నౌక బయల్దేరింది. కొటోనౌ పోర్టుకు బయల్దేరేందుకు కాకినాడ కలెక్టర్ షాన్ మోహన్ ఆదివారం అనుమతిని ఇచ్చారు. హల్దియా నుంచి 2024 నవంబరు 11న కాకినాడ తీరానికి స్టెల్లా షిప్ వచ్చిన విషయం…
ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం నేడు సమావేశం కానుంది. ఈ రోజు ఉదయం 10 గంటలకు ఏపీ కేబినెట్ భేటీ కానుంది. ఈ భేటీలో పలు కీలక అంశాలపై చర్చించనున్నారు. 43వ సీఆర్‌డీఏ అథారిటీ సమావేశంలో ఆమోదం తెలిపిన రూ.24,276 కోట్ల విడుదలకు కేబినెట్ ఆమోదం తెలపనుంది.
హైకోర్టుకు చేరింది కాకినాడ పోర్టులోని ఎంవీ స్టెల్లా నౌక వ్యవహారం..తమ పారా బాయిల్డ్ రైస్ ను స్టెల్లా నౌకలో లోడు చేసేందుకు అనుమతి ఇచ్చేలా అధికారులకు ఆదేశాలు ఇవ్వాలని హైకోర్టులో పిటిషన్ దాఖలు అయ్యింది.. అయితే, దీనిపై వివరాలు సమర్పించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది న్యాయస్థానం.. బియ్యం రవాణా చేసేందుకు అనుమతులు ఉన్నాయా? అని ప్రశ్నించింది హైకోర్టు.. నౌకలో బియ్యం లోడు చేయకుండా అడ్డుకునేందుకు ప్రభుత్వానికి ఉన్న అధికారాలు ఏమిటని ఈ సందర్భంగా ప్రశ్నించింది.