విశాఖలో పలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించుకోవడం సంతోషంగా ఉందని రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత పేర్కొన్నారు. 2018లో అప్పటి హోం మంత్రి చిన్నరాజప్ప చేతులు మీద భూమి పూజ జరిగిన అరిలోవా పోలీస్ స్టేషన్‌ను ఈ రోజు కూటమి ప్రభుత్వమే ప్రారంభించిందన్నారు. విశాఖలో రోడ్డు యాక్సిడెంట్ బాధితుల సహకార కేంద్రం ప్రారంభించామన్నారు.
Ration Mafia : ఏపీలో రేషన్ మాఫియాకు చెక్ పెట్టేందుకు సిట్ రంగంలోకి దిగింది. కాకినాడ పోర్టులో రేషన్ బియ్యం అక్రమ రవాణా పై సిట్ ఏర్పాటైంది. దీంతో మాఫియా గుండెల్లో గుబులు మొదలయ్యాయి. ప్రస్తుతం స్టెల్లా నౌక నుంచి సేకరించిన బియ్యం నమూనాలను పరిశీలిస్తూ సిట్ విచారణ వేగంగా సాగే అవకాశముంది. అక్రమాలకు అండదండగా ఉన్న పెద్దలపాత్ర త్వరలో బయటపడే అవకాశం ఉంది. రాష్ట్రంలో ఉన్న అన్ని పోర్టులలోనూ కాకినాడ పోర్టు వివాదాలతో చిక్కుకుంది. కాకినాడ…
ఏపీలో రేషన్ బియ్యం అక్రమ రవాణాపై సిట్ ఏర్పాటు గురించి మాజీ మంత్రి అంబటి రాంబాబు సెటైర్లు వేశారు. ప్రభుత్వం ఎన్ని సిట్‌లు ఏర్పాటు చేస్తుందని ఆయన ప్రశ్నించారు. ఇప్పటికే టీటీడీ లడ్డుపై సిట్, గంజాయిపై ఈగల్, ఇప్పుడు రైస్‌పై సిట్.. ఇవన్నీ ప్రచారం కోసం తప్ప ఏం లేదన్నారు.
అరెస్టుకు భయపడేది లేదని, సీఎం చంద్రబాబు నాయుడు ఏం చేసుకున్నా తాను సిద్దం అని వైసీపీ పక్ష నేత విజయసాయి రెడ్డి తెలిపారు. తాము అధికారంలో ఉన్నప్పుడు అదానీతో సత్సంబంధాలు ఉన్నాయిని, తమపై ఎలాంటి ఒత్తిడులు లేవన్నారు. మాజీ సీఎం వైఎస్ జగన్ రెడ్డి అత్యంత పరిపాలన దక్షుడని, రాష్ట్రంలో తాము ఇచ్చినంత జనరంజకమైన సంక్షేమ పాలన ఎవరూ ఇవ్వలేరన్నారు. సీఎం చంద్రబాబుకు లంచమిచ్చి కేవీ రావు కాకినాడ పోర్టును తీసుకున్నారు అని విజయసాయి రెడ్డి పేర్కొన్నారు.…
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తనిఖీల తర్వాత అధికార యంత్రాంగం కదిలింది. కాకినాడ పోర్టులో స్టెల్లా షిప్‌ను అధికార యంత్రాంగం సీజ్ చేసింది. ఐదు శాఖల అధికారులతో కలిపి మల్టీ డిసిప్లినరీ కమిటీని జిల్లా కలెక్టర్ షన్మోహన్ ఏర్పాటు చేశారు.
కాకినాడ పోర్టులో రేషన్ బియ్యం పట్టుబడిన వ్యవహారం ఏపీ రాజకీయాల్లో కాకరేపుతోంది.. అయితే, మీడియా చిట్‌చాట్‌లో ఈ వ్యవహారంపై కీలక వ్యాఖ్యలు చేశారు మంత్రి నాదెండ్ల మనోహర్.. కాకినాడ పోర్టు వద్ద ఒక ఛీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ ను ఏర్పాటు చేస్తామన్న ఆయన.. మూడు షిఫ్టుల్లో భద్రత పెంచుతాం.. ట్రాన్స్‌పోర్ట్ మెకానిజంలో మార్పులు చేపడతాం అన్నారు.. ఐపీసీ ఇన్వాల్వ్ చేసేలా రవాణా వ్యవస్ధ కఠినతరం చేస్తామని వెల్లడించారు..
Pawan Kalyan : రేషన్ బియ్యం అక్రమ రవాణాను అడ్డుకోవడంలో కూటమి ప్రభుత్వం కఠినంగా వ్యవహరించబోతోంది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రంగంలోకి దిగడంతో అక్రమార్కుల్లో కలకలం రేగింది. ఇవాళ ఆయన కాకినాడ యాంకరేజ్ పోర్టుకు చేరుకొని పరిస్థితిని సమీక్షించారు. కాకినాడలోని యాంకరేజ్ పోర్టులో పశ్చిమ ఆఫ్రికాకు వెళ్లేందుకు సిద్ధంగా ఉన్న స్టెల్లా ఎల్ నౌకలో 640 టన్నుల బియ్యం, అలాగే మరో బార్జ్ ఐవీ 0073 లో 1064 టన్నుల రేషన్ బియ్యాన్ని అధికారులు స్వాధీనం…
కాకినాడ తీరంలో అగ్నిప్రమాదం జరిగింది. సముద్రంలో వేటకు వెళ్తున్న మత్య్సకారుల బోటులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. గ్యాస్ సిలిండర్ పేలడంతో ఒక్కసారిగా మంటలు బోటు మొత్తం అంటుకున్నాయి. దీంతో మత్య్సకారులు లైఫ్ జాకెట్లు ధరించి సముద్రంలోకి దూకేశారు. ఇక, విషయం తెలుసుకున్న కోస్ట్ గార్డ్ సిబ్బంది ప్రాణాలకు తెగించి రెస్యూ ఆపరేషన్ నిర్వహించారు.