Nara Lokesh: పోర్టు ఆధారిత మౌలిక సదుపాయాల్లో పెట్టుబడులు పెట్టండి.. సీఈవోకి లోకేష్ విజ్ఞప్తి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Nara Lokesh: పోర్టు ఆధారిత మౌలిక సదుపాయాల్లో పెట్టుబడులు పెట్టాలని ట్రాఫిగురా సీఈవో సచిన్‌గుప్తాను మంత్రి లోకేష్ కోరారు. విశాఖ, కాకినాడ పోర్టుల్లో అధునాతన వేర్‌హౌసింగ్ మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. విద్యుత్ వాణిజ్యంలో భాగస్వామ్యం కావాలని సచిన్‌గుప్తాను కోరారు.ఎల్‌ఎన్‌జీ రీగ్యాసిఫికేషన్ టెర్మినల్ ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. తాజాగా గ్లోబల్ రియల్ ఎస్టేట్ ఇన్వెస్టిమెంట్ ప్లాట్ ఫాం ఈఎస్ఆర్ గ్రూప్ ఇండియా ఇన్వెస్టిమెంట్స్ హెడ్ సాదత్ షా, డైరెక్టర్ (లీజింగ్) ప్రకృత్ మెహతాతో రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ ముంబయిలోని తాజ్ ల్యాండ్స్ హోటల్ లో భేటీ అయ్యారు. ఈఎస్ఆర్ గ్రూప్ ఆసియా-పసిఫిక్ లో $154 బిలియన్ ఆస్తులు, భారత్ లో $1.7 బిలియన్ ఆస్తులతో 2.8 మిలియన్ చదరపు మీటర్ల గ్రాస్ ఫ్లోర్ ఏరియా కలిగి ఉంది. రియల్ ఎస్టేట్, లాజిస్టిక్స్, డేటా సెంటర్స్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్, ఎనర్జీ, ఇండస్ట్రియల్ పార్కులపై ఈఎస్ఆర్ గ్రూప్ దృష్టిసారిస్తోంది.
READ MORE: Komatireddy Venkat Reddy: మీలాగా మాటలు కాదు చేతల ప్రభుత్వం మాది.. హరీష్ రావుకు కోమటిరెడ్డి కౌంటర్!
Also Read
- Rahul Gandhi: అంబానీని టార్గెట్ చేసిన ఎలాన్ మస్క్..‘‘మరో వ్యక్తి కూడా ఉన్నారు’’ అంటూ రాహుల్ సంచలన వ్యాఖ్యలు!
- OTR: నారాయణ్ ఖేడ్‌లో భూ మంతర్.. ఫామ్ ల్యాండ్స్ పేరుతో విచ్చలవిడి వెంచర్స్
- OTR: ఆర్టీసీ ఎన్నికలకు BRS దూరం ఎందుకు?
- US: భారతీయ ఐటీ సంస్థలకు అమెరికా షాక్.. గ్రీన్ కార్డ్ ప్రోగ్రామ్ నుంచి సస్పెన్షన్!
ఈ సందర్భంగా మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ… విజనరీ సీఎం చంద్రబాబునాయుడు నేతృత్వంలో ఇటీవల ఏపీ ప్రభుత్వం ఆమోదించిన ప్లగ్&ప్లే ఇండస్ట్రియల్ పార్క్స్ పాలసీ 4.0 పెట్టుబడులకు అనుకూలంగా ఉంది. విశాఖపట్నం, కాకినాడ, తిరుపతి మార్గాల్లో 1,000 ఎకరాలకు పైగా మెగా ఇండస్ట్రియల్ పార్కులను అభివృద్ధి చేస్తున్నాం. ఏపీఐఐసీతో కలిసి పారిశ్రామిక పార్కుల అభివృద్ధిలో భాగస్వామ్యం వహించండి. ఆంధ్రప్రదేశ్ లోని పోర్టుల సమీపంలో 3-5 పెద్ద లాజిస్టిక్స్ పార్కులను అభివృద్ధి చేయబోతున్నాం. విశాఖపట్నం పోర్టు, కాకినాడ పోర్టు వద్ద మల్టీమోడల్ లాజిస్టిక్స్ పార్కులు ఏర్పాటు చేయండి. దేశంలో 70శాతం రొయ్యలను ఉత్పత్తి చేస్తున్న ఏపీలో కోల్డ్ చైన్ మౌలిక సదుపాయాల రంగంలో పెట్టుబడులు పెట్టండి. ఆంధ్రప్రదేశ్ సముద్ర ఎగుమతుల కోసం కంటైనర్ ఫ్రైట్ స్టేషన్లు, గిడ్డంగుల నిర్మాణం, పోర్టు ఆధారిత లాజిస్టిక్స్ లో పెట్టుబడులు పెట్టాల్సిందిగా ఈఎస్ఆర్ ప్రతినిధులకు మంత్రి నారా లోకేష్ విజ్ఞప్తి చేశారు.
తాజావార్తలు
-
Story Board: సీఎం నుంచి పీఎం దాకా..మోడీ పాతికేళ్ల పాలనా ప్రస్థానం ఎలా సాగింది..?
-
Vijay Deverakonda: ‘నా నమ్మకం బలుపు అనిపిస్తే తగ్గాలా?’.. ట్రోలర్లకు ఇచ్చిపడేసిన రౌడీ హీరో
-
Rahul Gandhi: అంబానీని టార్గెట్ చేసిన ఎలాన్ మస్క్..‘‘మరో వ్యక్తి కూడా ఉన్నారు’’ అంటూ రాహుల్ సంచలన వ్యాఖ్యలు!
-
CM Chandrababu : ప్రధాని మోదీతో భేటీలో సీఎం చంద్రబాబు ప్రతిపాదనలు
-
Off The Record: మంత్రుల పనితీరుపై సీఎం చంద్రబాబు సీరియస్?
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!