Kajal Aggarwal: టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్.. ఇండస్ట్రీకి బ్రేక్ ఇస్తుందని, సినిమాలకు గుడ్ బై చెప్తుందని వార్తలు వినిపిస్తున్నాయి. కాజల్ సినిమాలకు గుడ్ బై చెప్తుంది అనేసరికి అభిమానులందరూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే దానికి కారణంగా కాజల్ రెండోసారి ప్రెగ్నెంట్ అయ్యినట్లు చెప్పుకొస్తున్నారు. తాజాగా ఈ రూమర్స్ కు కాజల్ స్పందించింది.
తెలుగు లో కాజల్ అగర్వాల్ ఒకప్పుడు స్టార్ హీరోయిన్. చందమామ సినిమా లో తన అద్భుతమైన నటనతో అందరిని అలరించింది. ఆ చిత్రం తరువాత వచ్చిన మగధీర సినిమాతో స్టార్ హీరోయిన్ గా మారింది.భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ను కూడా సంపాదించుకుంది. తెలుగు సినీ పరిశ్రమలో వరుస గా ఆఫర్స్ అందుకుంటూ స్టార్ హీరోయిన్ గా తనకంటూ ఓ స్పెషల్ ఇమేజ్ ను క్రియేట్ చేసుకుంది. అయితే పెళ్లి తర్వాత ఈ చందమామ సినిమాల కు దూరమైంది.…