కడియం స్ట్రోక్ నుంచి బీఆర్ఎస్ తేరుకుందా? వరంగల్ ఎంపీ అభ్యర్థిగా ఎవర్ని ఎంపిక చేయబోతోంది? ఇప్పుడు కొత్తగా తెర మీదికి వస్తున్న ఈక్వేషన్స్ ఏంటి? పార్టీ పరిశీలిస్తున్న పేర్లేవి? సామాజిక సమీకరణల లెక్కలు ఎలా ఉన్నాయి? మాజీ డిప్యూటీ సీఎం రాజయ్య తిరిగి పార్టీలోకి వస్తారన్నది నిజమేనా? కడియం ఫ్యామిలీ ఇచ్చిన మాస్టర్ స్ట్రోక్తో మైండ్ బ్లాంక్ అయిన బీఆర్ఎస్… మెల్లిగా తేరుకుని వరంగల్ అభ్యర్థి ఎంపిక మీద దృష్టి పెడుతోందట. కడియం శ్రీహరి కుమార్తె కావ్య…
కడియం శ్రీహరి వ్యూహాత్మకంగానే కారు పార్టీని దెబ్బ కొట్టారా? ముఖ్య నేతలందర్నీ ముందే పంపేసి తాను తప్ప దిక్కులేని స్థితికి తీసుకువచ్చి… ఫైనల్గా హ్యాండివ్వడాన్ని ఎలా తీసుకుంటోంది బీఆర్ఎస్? తన కూతురు కావ్యను వరంగల్ అభ్యర్థిగా ప్రకటించాక కూడా పార్టీ మారడం వెనకున్న ఎత్తుగడ ఏంటి? ఉమ్మడి వరంగల్ జిల్లా రాజకీయాల్లో కీలక నేత కడియం శ్రీహరి. బీఆర్ఎస్ గూటికి చేరాక పదేళ్ళ పాటు కేసీఆర్ కి అత్యంత సన్నిహితంగా ఉన్నారు. పార్టీ పరంగా ఆయనకు కూడా…
ధర్మసాగర్ మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ మాట్లాడుతూ.. ప్రజలందరూ కేసీఆర్ కు అండగా కడియం ను గెలిపిస్తే అందరినీ మోసం చేసిండని ఆయన మండిపడ్డారు. డబ్బులకు లొంగి , పదవుల పేరుతో బిఆర్ఎస్ కు , తెలంగాణ అస్తిత్వానికి ప్రమాదకారిగా కడియం తయారయ్యాడని పల్లా వ్యాఖ్యానించారు. తెలంగాణ ఉద్యమంలో , మాదిగ పోరాట సమితి ఉద్యమంలో లేడు కానీ నేనే గొప్ప అని చెబుతూ అహంకారంతో అందరినీ మోసం చేస్తున్నాడని,…
లోక్ సభ ఎన్నికల ముందు బీఆర్ఎస్కు దెబ్బ మీద దెబ్బ తగులుతోంది. వరుస పెట్టి నేతలు పార్టీని వీడుతున్నారు. అయితే.. కీలక నేతలు పార్టీ వీడడం ఆ పార్టీని మరింత బలహీనపరుస్తుంది. బీఆర్ఎస్ పలువురు ఎమ్మెల్యేలు, ఎంపీలు.. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలోకి జంప్ అవుతున్నారు. తాజాగా బీఆర్ఎస్ ముఖ్యనేతలు రాజ్యసభ ఎంపీ కే కేశవరావు, ఎమ్మెల్యే కడియం శ్రీహరిలు బీఆర్ఎస్ వీడి కాంగ్రెస్ లో చేరాలని నిర్ణయించుకున్నారు. ఈ నేపథ్యంలో కె. కేశవరావు మాట్లాడుతూ.. నేను 55…
BRS Party: కడియం శ్రీహరి పార్టీ మార్పు పై బీఆర్ఎస్ నేతలు మాజీ ఎమ్మెల్యే వినయ్ భాస్కర్, పెద్ద సుదర్శన్ రెడ్డి మండిపడ్డారు. హన్మకొండ పార్టీ కార్యాలయంలో వారు మాట్లాడుతూ..
Manda Krishna Madiga: కడియం శ్రీహరి వల్లే..రాజయ్యను బీఆర్ఎస్ బర్తరఫ్ చేసిందని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకులు మందకృష్ణ మాదిగ సంచలన వ్యాఖ్యలు చేశారు. వరంగల్ బిడ్డగా.. వరంగల్ జిల్లాకు చెందిన వాడిగా.. వరంగల్ రాజకీయాల గురించి మాట్లాడుతానని అన్నారు. కడియం శ్రీహరి ఉమ్మడి వరంగల్ జిల్లాలో మాదిగలను రాజకీయంగా ఎదుగుదకుండా అడ్డుకున్నారని మండిపడ్డారు. 40 ఏళ్లుగా ఉమ్మడి వరంగల్ జిల్లాలో కడియం శ్రీహరి మాదిగ అని చెప్తూ రాజకీయంగా ఎదుగుతూ వచ్చారన్నారు. మాదిగ సామాజివర్గానికి చెందిన రాజకీయ నాయకులను…
కాంగ్రెస్ పార్టీ మోసానికి పెట్టింది పేరని హనుమకొండ జిల్లా స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. ఇవాళ ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అసెంబ్లీ ఎన్నికల సమయంలో హామీలో పేరుతో ప్రజలను మభ్యపెట్టారన్నారు. పార్లమెంటు ఎన్నిక వేళ …..అదే మోసం పునరావృతం చేయబోతుందని, ఈ ఆర్థిక సంవత్సరంలో 4 లక్షల 50 వేల ఇండ్లు కట్టిస్తామని చెప్పారన్నారు. ఇందిరమ్మ ఇళ్లకోసం లక్షల సంఖ్యలో దరఖాస్తులు వచ్చాయని ఆయన అన్నారు.…
సీఎం రేవంత్ రెడ్డి పదవి బాధ్యతలు స్వీకరించిన తర్వాత ప్రజల సంక్షేమం గాలికి వదిలేసారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి మండిపడ్డారు. ఇవాళ ఆయన తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడుతూ.. మాజీ సీఎం కేసిఆర్ ను విమర్శించడానికి, దూషిండడమే పనిగా పెట్టుకున్నాడన్నారు కడియం శ్రీహరి. రేవంత్ రెడ్డి హుందాతనం మరిచి ఇష్టానుసారంగా మాట్లాడుతున్నాడని ఆయన వ్యాఖ్యానించారు. సీఎం అయ్యారు… ఆయన భాష మారుతుంది అని ఆశించామని కడియం శ్రీహరి అన్నారు. కానీ కేసీఆర్ ను అసభ్య పదజాలం…
తెలంగాణ భవన్ నుంచి ‘చలో నల్గొండ’ బహిరంగ సభకు బయల్దేరి వెళ్లే ముందు బీఆర్ఎస్ నేత కడియం శ్రీహరి మీడియాతో మాట్లాడుతూ.. కేసీఆర్ చేసిన అభివృద్ధిని రేవంత్ రెడ్డి ప్రభుత్వం చూడలేకపోతోందన్నారు. నిజాలు చెప్పాల్సిన బాధ్యత తమపై ఉందని ఆయన అన్నారు. తెలంగాణ ప్రజలు పదేళ్లుగా తెలంగాణ నదీ జలాలపై కేంద్రం ఆక్రమణలకు పాల్పడుతుంటే బీఆర్ ఎస్ ప్రభుత్వం అడ్డుకట్ట వేసిందన్నారు. కానీ కొత్తగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం రెండు నెలల్లోనే నదుల నిర్వహణను…
బీఆర్ఎస్ పార్టీ నేతలంతా నల్గొండ సభకు వెళ్తున్నామని స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి తెలిపారు. కృష్ణ నది కింద ఉన్న ప్రాజెక్టులు కేఆర్ఎంబీకి అప్పగించటం మంచిది కాదు అని చెప్పారు.