ఇవాళ రాయలసీమ జిల్లాల్లో సీఎం జగన్ మోహన్ రెడ్డి పర్యటించనున్నారు. వరద ప్రభావిత ప్రాంతాలైన వైయస్సార్ కడప, చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో సీఎం జగన్ ఇవాళ, రేపు పర్యటించనున్నారు. ఇవాళ వైయస్సార్ కడప, చిత్తూరు జిల్లాలలో పర్యటించి నేరుగా బాధిత ప్రజలు, రైతులతో సీఎం ఇంటరాక్ట్ కానున్నారు సీఎం జగన్ మోహన్ రెడ్డి. ఈ నేపథ్యం లో భారీ వర్షాలకు దెబ్బతిన్న అన్నమయ్య ప్రాజెక్టును సీఎం జగన్ మోహన్ రెడ్డి పరిశీలించనున్నారు. అంతేకాదు… ప్రాజెక్టు పరిసర గ్రామాల…
ఆంధ్రప్రదేశ్‌లో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు అతలాకుతలమైన వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన కేంద్ర బృందం ఏపీ సీఎం జగన్‌తో భేటీ అయ్యారు. వరద సహాయ కార్యక్రమాలకు సీఎం వెంటనే నిధులు ఇచ్చి ఆదుకున్నారని కునాల్ తెలిపారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో పరిస్థితిని గురించి సీఎం జగన్‌కు కేంద్ర బృందం వివరించింది. వరద ప్రభావిత ప్రాంతాల్లో రాష్ర్ట ప్రభుత్వం తీసుకున్న చర్యలను కేంద్ర బృందం అభినందించింది. కేంద్ర బృందం తరపున కునాల్ సత్యార్థి జగన్‌కు వివరాలు వెల్లడించారు.…
ఏపీలో భారీవర్షాలు, వరదల కారణంగా అపారమయిన నష్టం సంభవించింది. కడప జిల్లాలో వరద గ్రామాల్లో ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి పర్యటించారు. వరద బాధితులను పరామర్శించిన సజ్జల రామకృష్ణా రెడ్డి సహాయక చర్యలను పర్యవేక్షించారు. కడప జిల్లాలో వరద విలయం సృష్టించిందని, ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తం చేయడంతో ప్రాణనష్టం తగ్గిందన్నారు. వరదల తరువాత ప్రభుత్వం అన్ని రకాలుగా ఉదారంగా సహాయ కార్యక్రమాలు చేపట్టిందని, నిబంధనలు సడలించి సహాయ కార్యక్రమాలు చేశారన్నారు. వరదల కారణంగా పంట నష్టపోయిన…
ఎర్రచందనం దొంగలు రెచ్చిపోతున్నారు. తాజాగా కడపజిల్లాలో నిన్న అర్ధరాత్రి ప్రొద్దుటూరు ఫారెస్టు అధికారులు,40 మంది తమిళనాడు ఎర్రచందనం కూలీల మధ్య ఛేజింగ్ జరిగింది. ఖాజీపేట మండలం నాగసాయిపల్లె చెక్ పోస్టు వద్ద నుండి ఐచర్ వాహనంలో ఎర్రచందనం తరలిస్తున్నారన్న సమాచారం అందింది. దీంతో స్మగ్లర్లను పట్టుకునేందుకు ప్రయత్నించారు ప్రొద్దుటూరు ఫారెస్టు అధికారులు. ఫారెస్టు అధికారుల దాడిని తప్పించుకునేందుకు ప్రొద్దుటూరు వైపు ఐచర్ వాహనంలో పరారవుతూ వాహనంలో నుండి దూకి పారిపోయారు 45 మంది తమిళనాడు కూలీలు. బొజ్జవారిపల్లె…
కడప జిల్లా ఎర్రగుంట్ల మండల పరిధిలో ఉన్న రాయలసీమ థర్మల్ పవర్ ప్రాజెక్టు(ఆర్టీపీపీ)లో విద్యుత్ ఉత్పత్తి తగ్గింది. ఆర్టీపీపీకి రావాల్సిన బొగ్గు సరఫరా ఆగిపోవడంతో విద్యుత్ ఉత్పత్తి తగ్గించామని అధికారులు తెలిపారు. ప్రస్తుతం ఆర్టీపీపీలో కేవలం 30 వేల టన్నులు మాత్రమే బొగ్గు నిల్వ ఉంది. ఆర్టీపీపీలో మొత్తం ఆరు యూనిట్లు ఉన్నాయి. ఈ యూనిట్లలో మొత్తం 1650 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి జరగాల్సి ఉంది. ప్రస్తుతం కేవలం 13, 6 యూనిట్లలో కలిపి 600 మెగావాట్లు…
అంతా ఊహించిన విధంగా శనివారం అర్ధరాత్రి కడప జిల్లా కమలాపురంలో పాపాఘ్ని నదిపై ఉన్న వంతెన కూలిపోయింది. దీంతో రాకపోకలు బంద్ చేసారు. గత రెండు రోజులుగా వంతెన వద్ద ప్రమాదకరంగా ప్రవహిస్తోంది. నీరు అంచుల వరకు చేరడంతో నానిపోయిన వంతెన నిన్న సాయంత్రం నుంచి కొంచెంకొంచెంగా నానుతూ వస్తోంది. ఏ క్షణమైనా వంతెన కూలుతుందని ఎన్టీవీ హెచ్చరించింది. ఈ క్రమంలో అర్ధరాత్రి దాటిన తర్వాత ఒక్కసారిగా కుప్పకూలింది. ఈ బ్రిడ్జి అనంతపురం నుంచి కడపకు వెళ్లే…
భారీవర్షాలు కడప జిల్లాలో పురాతన బ్రిడ్జిల పాలిట శాపంగా మారాయి. వరదకు కుంగిపోయింది కమలాపురం పాపాగ్ని బ్రిడ్జి. ఏ క్షణమైనా కూలిపోయేందుకు సిద్ధంగా వుంది. వరద ధాటికి చీలిపోయిన బ్రిడ్జి శ్లాబ్ క్రమ క్రమంగా దిగువకు కుంగిపోయిందని పోలీసులు, రెవిన్యూ అధికారులు తెలిపారు. ఏ క్షణంలో నైనా కమాలపురం బ్రిడ్జి కుప్పకూలే ప్రమాదం ఉందని డి.ఎస్.పి వెంకట శివారెడ్డి తెలిపారు. బ్రిడ్జి ప్రమాదాన్ని ముందస్తుగా గుర్తించి నేషనల్ హై వే అధికారుల దృష్టికి తీసుకెళ్ళారు పోలీసులు. యుద్ధప్రాతిపదికన…
భారీవర్షాలు, పొంగిపొర్లుతున్న వాగులు వంకలతో జనం గల్లంతవుతున్నారు. కడప జిల్లా చెయ్యేరు వరదలలో గల్లంతయిన వారి కోసం హెలికాప్టర్ తో గాలింపు చర్యలు చేపడుతున్నారు అధికారులు. గుండ్లూరు వద్ద వరద ప్రవాహంలో చిక్కుకున్న యువకుణ్ణి రక్షించింది నేవీ హెలికాప్టర్. పులపత్తురు శివాలయంలో పూజలకు వెళ్లి గల్లంతయిన వారి కోసం గాలింపు కొనసాగుతోంది. కార్తీకదీపం వెలిగించేందుకు వెళ్లి వరదల్లో గల్లంతయ్యారు. అందులో ఇద్దరు మహిళల మృతదేహాలు లభ్యం అయ్యాయి. చెయ్యేరులో కొట్టుకుపోతున్న మరో మృతదేహంని స్వాధీనం చేసుకున్నారు. చెయ్యేరు…