ఉమ్మడి కడప జిల్లా ఒకప్పుడు టీడీపీకి కంచుకోటగా ఉండేది. YS ప్రభంజనంలో చతికిలపడ్డ తెలుగుదేశం పార్టీ ఇప్పటిదాకా కోలుకోలేదు. నాడు వైఎస్ చేతిలో.. రెండు దఫాలుగా జగన్ చేతిలో ఓడి.. షెడ్డుకు చేరింది సైకిల్. అప్పట్లో అధికారంలో ఉండి కూడా ఒక్కటంటే ఒక్క సీటు గెల్చుకోలేకపోయింది టీడీపీ. 2004లో ప్రొద్దుటూరులో లింగారెడ్డి ఒక్కరే గెలిచారు. 2019 ఎన్నికల తర్వాత టీడీపీ కేడర్ ఎక్కడికక్కడ సర్దుకుంది. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలుగా కీలక పదవులు వెలగబెట్టిన వారంతా అధికారం దూరం…
క్విట్ చంద్రబాబు… సేవ్ ఆంధ్రప్రదేశ్ నినాదంతో 2024 ఎన్నికలకు వెళ్తామని ప్రకటించారు ఏపీ మంత్రి ఆర్కే రోజా.. ఇవాళ ఉదయం తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్నారు మంత్రులు అంబటి రాంబాబు, రోజా, ఉషశ్రీ, ఎంపీలు గురుమూర్తి, కృష్ణదేవారయులు.. అనంతరం మీడియాతో మాట్లాడిన మంత్రి రోజా… కడప వేదికగా అభివృద్ధి, సీఎం వైఎస్ జగన్‌పై చంద్రబాబు చేసిన విమర్శలపై ఘాటుగా స్పందించారు.. కడపలో చంద్రబాబు చేసిన విమర్శలు హస్యాస్పదమన్న ఆమె.. కుప్పంలో జరిగిన అభివృద్ది, పులివేందులలో జరిగిన అభివృద్దిని పరిశీలించాలని…
రెండు రోజుల పాటు కడప, కర్నూలు జిల్లాలో బిజీ బిజీగా గడపనున్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి… ఇవాళ సాయంత్రం కడప ఎయిర్‌పోర్ట్‌కు చేరుకోనున్న ఆయన.. 5.40 గంటలకు కడప ఎయిర్ పోర్టు నుంచి రోడ్డు మార్గంలో బయల్దేరి ఒంటిమిట్టలోని టీటీడీ గెస్ట్‌హౌస్‌కు చేరుకుంటారు. ఇక, రాత్రి 7.20 గంటలకు టీటీడీ గెస్ట్‌హౌస్ నుంచి బయల్దేరి.. రాత్రి 7.30 నుంచి 7.40 గంటల మధ్య కోదండరామస్వామి ఆలయానికి చేరుకుంటారు.. ఆ తర్వాత స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు…
ఆంధ్రా భద్రాచలంగా పేరుగాంచిన ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు కడప నగర శివార్లలోని చిరు వ్యాపారుల పాలిట శాపంగా మారాయి. వీఐపీల రాక సందర్భంగా ప్రభుత్వ స్టల్లాల్లోని దుకాణాల తొలగింపుపై వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. ఎన్నో ఏళ్లుగా చిరువ్యాపారాలు చేస్తున్న దుకాణాలను అధికారులు తొలగించే యత్నాలను అక్కడి వ్యాపారులు నిరాశిస్తున్నారు. ఉన్నపళంగా దుకాణాలు తెసేయమంటే మా పరిస్థితి ఏంటని బాధితులు ప్రశ్నిస్తున్నారు. కమలాపురం రోడ్డు లోని విమానాశ్రయం నుంచి కడప నగరంలోకి వచ్చే మార్గంలో అలాంఖాన్ పల్లె ఇర్కాన్ సర్కిల్…
ఏపీలో కొత్త జిల్లాల పునర్వవస్థీకరణలో భాగంగా కడప, కోనసీమ జిల్లాల్లో రెండు కొత్త రెవెన్యూ డివిజన్లను ఏర్పాటుచేసింది ప్రభుత్వం. ఈ మేరకు నోటిఫికేషన్ జారీ చేసింది రాష్ట్ర ప్రభుత్వం. కోనసీమ జిల్లాలోని రామచంద్రాపురం, అమలాపురం డివిజన్లలోని 7 మండలాలను కొత్తపేట రెవెన్యూ డివిజన్ గా ప్రతిపాదిస్తూ నోటిఫికేషన్ జారీ అయింది. కొత్తపేట రెవెన్యూ డివిజనులో ఆలమూరు, ఆత్రేయపురం, రావులపాలెం, కొత్తపేట, పి.గన్నవరం, అంబాజీపేట, అయినవిల్లి మండలాలను చేరుస్తూ నోటిఫికేషన్ ఇచ్చింది రెవెన్యూ శాఖ. కడప జిల్లాలో కొత్త…
ముఖ్యమంత్రి జగన్ స్వంత జిల్లా లోని కడప రిమ్స్ లో పసికందుల మరణాలు కలవరపరుస్తున్నాయని, కడప రిమ్స్ ఘటనలో ప్రభుత్వ వైఖరి సందేహాస్పదంగా ఉందన్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. పసిబిడ్డల తల్లితండ్రులను పోలీసులతో ఎందుకు తరలించారు? కడప నగరంలోని రిమ్స్ వైద్యాలయంలో ముగ్గురు నవజాత శిశువులు ప్రాణాలు విడిచిన ఘటన మాటలకు అందని విషాదం. విద్యుత్ సరఫరా లేకపోవడం, వైద్య ఉపకరణాలు వినియోగించకపోవడం లాంటి కారణాలతోనే పసి బిడ్డలు కన్నుమూశారు. ఒక మానిటర్ తోనే 30మంది…
కువైట్ ఆర్దియ హత్యకేసుల నిందితుడు వెంకటేష్ ఆత్మహత్య చేసుకున్నాడు. కువైట్ సెంట్రల్ జైలులోనే సూసైడ్‌కు పాల్పడ్డాడు. కువైట్‌లో ముగ్గురిని హత్యచేసిన కేసులో వెంకటేష్ మీద ఆరోపణలు రావడంతో.. అక్కడి పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారు. ఆత్మహత్యకు గల కారణాలపై అధికారుల ఆరా తీస్తున్నారు. వెంకటేష్ స్వస్థలం కడప జిల్లా. జైల్లోనే ఉరివేసుకొని మరణించాడని అక్కడి అధికారులు వెల్లడించారు. మంచానికి ఉన్న వస్త్రంతో ఉరివేసుకొని చనిపోయినట్లు తెలిపారు. బుధవారం రాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది. Read Also:…
కడప జిల్లా మైదుకూరు నియోజకవర్గం అయ్యవారిపల్లెలో దారుణం చోటుచేసుకుంది. సర్పంచి ఇంటిపై వైసీపీ నాయకులు దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో ఆరుగురికి గాయాలయ్యాయి, చాపాడు మండలం అయ్యవారిపల్లె గ్రామ పంచాయతీ సర్పంచి నివాసంపై వైసీపీ నాయకులు దాడి చేశారు. ఈ దాడిలో సర్పంచితో పాటు ఆయన సోదరుడి కుటుంబ సభ్యులు ఆరుగురు గాయపడ్డారు. అయ్యవారిపల్లె గ్రామ సర్పంచి కె. రహంతుల్లా నివాసంపై వైసీపీ నేతలు ఒక్కసారిగా విరుచుకుపడ్డారు. రహంతుల్లా తిమ్మయ్యగారిపల్లెలోని నివాసంలో నిద్రిస్తుండగా దాడికి పాల్పడ్డారు. ఈ…