వన్ సైడ్ లవ్.. అది ఫలించకపోవడంతో తనకు దక్కనిది ఎవరికి దక్కకూడదని కక్ష పెంచుకున్నాడు ఆ ప్రేమోన్మాది. తన ప్రేమను నిరాకరించిందని మద్యం మత్తులో ఒంటరిగా ఉన్న యువతి ఇంటికి వెళ్లి విచక్షణ రహితంగా కత్తితో 13 సార్లు పొడిచాడు. గాయాలతో రక్తపు మడుగులో జీవచ్ఛవంలా ఆ యువతి పడిపోవడంతో ఆమె చనిపోయింది అనుకున్న ఆ యువకుడు అక్కడి నుండి పారిపోయాడు. ఆ తర్వాత ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించాడు. ఆఖరికి ఎట్టకేలకు కటకటాల పాలయ్యాడు….
Chhattisgarh: బ్యాంక్ మేనేజర్ కక్కుర్తి.. లోన్ ఇప్పిస్తానని రూ.39 వేల చికెన్ ఫుడ్ ఆరగించిన ఘనుడు
కడప జిల్లా వేముల మండలం వి.కొత్తపల్లికి చెందిన కులయప్ప అనే యువకుడు అదే గ్రామానికి చెందిన షర్మిల అనే యువతిని గత కొంతకాలంగా వన్ సైడ్ లవ్ చేశాడు. తన ప్రేమను ఒప్పుకోవాలంటూ ఆమె వెంటపడేవాడు. గత 15 రోజుల క్రితం ఆ యువతి కులయప్ప వేధింపులను భరించలేక తల్లిదండ్రులకు ఫిర్యాదు చేసింది. తమ అమ్మాయి జోలికి వస్తే నీ తాటతీస్తామని కూడా వారు హెచ్చరించారు. ఇంకేముంది రెచ్చిపోయాడు ఆ యువకుడు. తాగిన మైకంలో తన ప్రేమనే నిరాకరిస్తావా అంటూ ఆ యువతిపై ఆగ్రహం పెంచుకున్నాడు. తనకు దక్కనిది ఇంకెవరికి దక్కకూడదని కంకణం కట్టుకున్నాడేమో అందుకోసం ఆ యువతని హత్య చేయడానికి స్కెచ్ వేశాడు.
Electric Shock: బట్టలు ఆరేస్తుండగా విద్యుత్ షాక్‌తో కుమారుడు.. కాపాడబోయి తల్లి, కూతురు మృతి
షర్మిల డిగ్రీ రెండవ సంవత్సరం చదువుతోంది. తన రెండవ చెల్లికి అనారోగ్యంగా ఉండడంతో ఆమె ఇంటి వద్ద ఉంటూ ఆ బాలిక బాగోగులు చూసుకుంటూ ఉండేది. తండ్రి భాస్కర్ వీఆర్ఏగా పనిచేస్తున్నాడు. ఈనెల ఆరవ తేదీన రెవెన్యూ సదస్సులలో పాల్గొనడానికి ఆయన గొందిపల్లి గ్రామానికి వెళ్ళాడు. షర్మిల తల్లి కూలి పనికి వెళ్లడంతో ఇంట్లో ఎవరూ లేరని నిర్ధారించుకున్న ఆ ప్రేమోన్మాది తన వ్యూహాన్నీ అమలు చేశాడు. ఒంటరిగా ఇంట్లో ఉన్న షర్మిల వద్దకు వెళ్లి తలుపు తీయాలంటూ ఒత్తిడి తెచ్చాడు. అయితే ఆ యువతి తలుపు తీయకపోవడంతో మీ నాన్నను చంపేస్తానంటూ బెదిరింపులకు దిగాడు. భయభ్రాంతులకు లోనైనా ఆ యువతి తలుపులు తీయగానే ఒక్కసారిగా ఆమెపై కత్తితో దాడి చేశాడు. ఆ ప్రేమోన్మాది కత్తి దాటికి కుప్పకూలిపోయింది షర్మిల… రక్తపు మడుగులో కింద పడిపోయిన ఆమెను వదలకుండా కత్తితో విచక్షణ రహితంగా 13 పోట్లు పొడిచాడు. ఇక చనిపోయింది అనుకొని అక్కడి నుంచి పారిపోయాడు.. ఆ తరువాత తాను ప్రేమించిన అమ్మాయి ఇక లేదని అతను కూడా ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నించాడు. ప్రేమోన్మాది దాడిలో తీవ్రంగా గాయపడిన షర్మిల ప్రస్తుతం కొన ఊపిరితో తిరుపతిలోని రుయా ఆసుపత్రిలో కొట్టుమిట్టాడుతోంది. అయితే పోలీసులు ప్రేమోన్మాదిని అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు.