కడప జిల్లాలో ప్రేమోన్మాది రెచ్చిపోయారు.. తనను ప్రేమించలేదని ప్రేమోన్మాది ఓ యువతిపై కత్తితో విచక్షణ రహితంగా దాడి చేశారు. వేముల మండలం కొత్తపల్లిలో ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఒంటరిగా ఉన్న షర్మిల అనే యువతిపై కులయప్ప అనే యువకుడు కత్తితో దాడి చేశారు. బాలిక కేకలు వేయడంతో చుట్టుపక్కల ఉన్న వారు అక్కడకు రావడంతో వారిని చూసి కులయప్ప పరారయ్యారు.
అన్నమయ్య జిల్లా గువ్వలచెరువు ఘాట్‌లో ప్రమాదానికి గురై చికిత్స పొందుతూ 108 అంబులెన్స్ పైలట్ రమేష్ ఈరోజు మృతి చెందారు. ప్రమాదంలో మరణించిన 108 అంబులెన్స్ పైలట్ రమేష్ కుమార్ భార్య అనూషతో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ఫోన్‌లో మాట్లాడారు.
కడప జిల్లాలోని కమలాపురం శ్రీ బాలయోగి గురుకుల పాఠశాలలో ఇంటర్మీడియట్ చదువుతున్న అమ్మాయి ఆత్మహత్యాయత్నం చేసింది. హాస్టల్ గదిలో గొంతు కోసుకుని విద్యార్థిని ఆత్మహత్యాయత్నం చేసింది. నొప్పితో బాధపడుతున్న విద్యార్థిని తోటి విద్యార్థులు గమనించారు.
సోలార్ పవర్ ప్లాంట్ వద్ద మట్టితోలే అంశంలో ఇరువర్గాల మధ్య ఘర్షణ జరిగింది. ఈ ఘర్షణలో తుపాకీ కాల్పులు కలకలం సృష్టించాయి. దీంతో మరోమారు ఘర్షణలు జరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో పోలీసులు భారీ భద్రతను అక్కడ ఏర్పాటు చేశారు.
కడప జిల్లాలో ఓ తాగుబోతు హల్‌చల్ చేశాడు. వేంపల్లిలో ఓ తాగుబోతు పీకలదాకా తాగాడు. మద్యం మత్తులో రాయచోటి డిపోకు చెందిన రాయచోటి - వేంపల్లి పల్లె వెలుగు ఆర్టీసీ బస్సు టాప్ పైకెక్కి నిద్రించాడు. ఇది గమనించని ఆర్టీసీ బస్సు డ్రైవర్, కండక్టర్ బస్సును వేంపల్లి నుంచి రాయచోటికి తీసుకు వెళ్లే క్రమంలో చక్రాయపేట మండలం నాగులగుట్టపల్లికు బస్సు చేరుకుంది.
కడప జిల్లా బద్వేల్‌లో మాజీ సీఎం వైఎస్ జగన్ పర్యటించారు. యువకుడి చేతిలో హత్యకు గురైన యువతి కుటుంబసభ్యులను జగన్ పరామర్శించారు. శనివారం ఘటన జరిగితే ఎవరు పట్టించుకోలేదని.. కేవలం తాను వస్తున్నాను అని బాధితులకు సహాయం అందించారని ఆయన అన్నారు. కూటమి పాలనలో మహిళలకు రక్షణ, ప్రజలకు భరోసా లేదని తీవ్రంగా మండిపడ్డారు.
కడప జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. బద్వేలు సమీపంలో ఇంటర్ విద్యార్థినిపై పెట్లోల్ దాడి ఘటన కలకలం రేపింది. ఇంటర్ విద్యార్థినిని రోడ్డు పక్కనే చెట్లలోకి తీసుకెళ్లి ఓ యువకుడు పెట్రోల్ పోసి నిప్పంటించాడు. తీవ్రంగా గాయపడిన విద్యార్థినిని స్థానికులు కడప రిమ్స్‌కు తరలించారు.
Sathya in Kadapa: కడప జిల్లాలో సత్య ఏజెన్సీస్ 30వ షోరూంను ఘనంగా ప్రారంభోత్సవం చేయబోతుంది. ఇందులో భాగంగా, సత్య కొత్త షోరూమ్ ప్రారంభోత్సవానికి అన్ని బహుమతులు, క్యాష్‌బ్యాక్‌లను పొందండి!
చిన్న చిన్న విషయాలకే విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. కన్నతల్లిదండ్రులకు కడుపుకోత మిగిలిస్తున్నారు. తల్లిదండ్రులు తిట్టారనో.. గురువులు మందలించారనో.. ప్రేమ విఫలమైందనో ఇలా పులు కారణాలతో బలవన్మరణానికి పాల్పడుతున్నారు.