ఎలక్షన్స్ తర్వాత రాష్ట్రంలో బీజేపీ, ఏఐఏడీఎంకేలతో కూడిన నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (ఎన్డీయే) ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది అన్నారు. ఇక, ముఖ్యమంత్రి అభ్యర్థి ఏఐఏడీఎంకే నుంచి ఉంటారని స్పష్టం చేశారు. కాగా, పార్టీ ప్రస్తుత ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి కె పళనిస్వామి (ఈపీఎస్) పేరును అమిత్ షా ప్రస్తావించలేదు.