Bandi Sanjay: తెలంగాణ లో 26 మంది ఎమ్మెల్యేలు మాతో టచ్ లో ఉన్నారని కేంద్ర హోమ్ శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కరీంనగర్ అభివృద్ధి కోసం ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నామన్నారు. స్మార్ట్ సిటీ పనుల గడువు పెరగడం వల్ల కరీంనగర్ కి మరిన్ని నిధులు వస్తాయన్నారు. రేవంత్ ఒక్కడే అడిగితే స్మార్ట్ సిటీల అభివృద్ధి గడువు పొడిగించలేదు… వివిధ రాష్ట్రాల సీఎంలు అడిగారని కీలక వ్యాఖ్యలు చేశారు. వేములవాడ ,కొండగట్టు,…
రాజ్యసభ సభ్యత్వానికి కే. కేశవరావు రాజీనామా చేశారు. ఉపరాష్ట్రపతి జగదీష్ ధన్ఖడ్ ను కలిసి రాజ్యసభ ఎంపీ పదవి రాజీనామా లేఖను ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీలో చేరిన కేకే.. బీఆర్ఎస్ పార్టీ ద్వారా ఎన్నిక అయిన రాజ్యసభ మెంబర్గా కొనసాగలేనని తెలిపారు. నైతికతకు కట్టుబడి రాజీనామా చేస్తున్నానని పేర్కొన్నారు.
టెట్, డీఎస్సీ అభ్యర్థులకు అలర్ట్.. ప్రిపరేషన్ కు సమయం ఏపీలో టెట్, మెగా డీఎస్సీ అభ్యర్థులకు అలర్ట్.. ఈ పరీక్షల నిర్వహణకు ప్రభుత్వం కొత్త తేదీలను ప్రకటించనుంది. మంత్రి నారా లోకేష్‌ను కలిసి టెట్, మెగా డీఎస్సీ పరీక్షలకు సన్నద్దమయ్యేందుకు మరింత సమయం కావాలని అభ్యర్థులు కోరారు. ఈ క్రమంలో.. టెట్, మెగా డీఎస్సీ సన్నద్ధతకు సమయమిచ్చే అంశంపై విద్యా శాఖ ఉన్నతాధికారులతో మంత్రి లోకేష్ సమీక్ష నిర్వహించారు. అభ్యర్థుల వినతిని పరిగణనలోకి తీసుకున్న మంత్రి లోకేష్..…
లోక్‌సభ విపక్ష నేత రాహుల్ గాంధీ, సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో మల్లికార్జున ఖర్గే కాంగ్రెస్ పార్టీ కండువాను కప్పి కే.కేశవరావు ని పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో ఏఐసీసీ జనరల్ సెక్రటరీ(ఆర్గ్. ఇన్చార్జి) కేసీ వేణుగోపాల్ , తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జ్ దీపదాస్ మున్షీ , తదితరులు పాల్గొన్నారు. కేశవ రావుకు ఇంకా రెండేళ్ల పదవీ కాలం మిగిలి ఉన్నప్పటికీ రాజ్యసభ సభ్యత్వాన్ని వదులుకునే అవకాశాలు ఉన్నాయని వర్గాలు తెలిపాయి. ఆయన వైదొలిగితే, కాంగ్రెస్…
అయోధ్య రామాలయాన్ని బీజేపీ రాజకీయం చేస్తుందన్నారు బీఆర్ఎస్ రాజ్యసభ పక్ష నేత కే కేశవరావు. ఇవాళ ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ.. రాముడిని రాజకీయం చేశారని, ప్రజా సమస్యలు పక్కన పెట్టి అయోధ్య గురించి పార్లమెంట్ లో చర్చ పెట్టి తీర్మానం చేశారన్నారు. అయోధ్య రామాలయంపై పార్లమెంట్ లో తీర్మనం చేయడం తప్పు.. వ్యతిరేకిస్తున్నానని ఆయన వ్యాఖ్యానించారు. కానీ సభాపతి అధికారం ఉంటుంది కాబట్టి చేశారని ఆయన అన్నారు. ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి రామలయాన్ని రాజకీయం చేస్తున్నారని,…
పార్లమెంట్ లో మహిళా రిజర్వేషన్ బిల్లుకు బీఆర్ఎస్ పార్టీ పూర్తి సపోర్ట్ ఇస్తుందని బీఆర్ఎస్ రాజ్యసభ ఫ్లోర్ లీడర్ కే. కేశవరావు అన్నారు. బిల్లుకు మేం 100 శాతం మద్దతు ఇస్తామన్నారు.
కేంద్రానికి చిత్తశుద్ధి ఉంటే ప్రతిపక్షాల కంటే ముందే కేంద్రం చర్చకు రావాలని బీఆర్‌ఎస్ ఎంపీలు వ్యాఖ్యానించారు. సభ నుంచి పారిపోయే ప్రయత్నం చేయవద్దని తెలంగాణ లోక్‌సభాపక్ష నేత, బీఆర్‌ఎస్ ఎంపీ నామా నాగేశ్వరరావు అన్నారు.
పార్లమెంట్‌లో అన్ని రాజకీయ పార్టీలు మద్దతిచ్చిన ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లు రాజ్యాంగ విరుద్ధమని ప్రధాని నరేంద్ర మోదీకి వివరించాలని టీఆర్‌ఎస్ ఎంపీలు బుధవారం డిమాండ్ చేశారు. బిల్లు ఆమోదంలో అశాస్త్రీయంగా ఏమి ఉందో బీజేపీ వివరించాలని డిమాండ్ చేశారు. కేంద్రంలోని ప్రస్తుత ఎన్డీయే ప్రభుత్వం పార్లమెంటులో చాలా బిల్లులను చర్చ లేకుండానే ఆమోదించిందని ఆరోపించారు. తెలంగాణ ఏర్పాటుపై ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలపై ఎంపీలు నామా నాగేశ్వరరావు, మాలోత్ కవిత, జీ రంజిత్‌రెడ్డి తదితరులతో కలిసి న్యూఢిల్లీలో…