ఎన్నికల ఏడాదికి ముందు.. అత్యంత కీలకమైన బడ్జెట్ ఫిబ్రవరి 1న పార్లమెంట్ ముందుకు రానుంది. ఇందుకోసం పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు.. జనవరి 31న ప్రారంభమవుతాయి. తొలిరోజు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రెండు సభలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. అయితే.. ఇప్పటికే బడ్జెట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై ప్రతిపక్షాలు సమావేశమవుతున్నాయి. ఈ క్రమంలోనే నిన్న సీఎం కేసీఆర్ అధ్యక్షతన బీఆర్‌ఎస్ పార్టమెంటరీ పార్టీ సమావేశమైంది. పార్లమెంట్‌లో బీఆర్‌ఎస్‌న ఎంపీలు అనుసరించాల్సిన వ్యూహాలపై కేసీఆర్ సూచనలు చేశారు. అయితే.. తాజాగా బీఆర్ఎస్ పార్లమెంటరిపార్టీ నేత కే కేశవరావు మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్ కోసం కోర్టు సహాయం కొరాల్సి వస్తుంది …ఇలాంటి పరిస్థితి ఎప్పుడు ఎదురుకాలేదన్నారు. బడ్జెట్ కు ఆమోదం తెలపకుండా గవర్నర్ వ్యవహరిస్తున్నారని ఆయన విమర్శించారు. గవర్నర్ వ్యవస్థపై పార్లమెంట్‌లో చర్చ జరగాలన్నారు. ఢిల్లీ, తమిళనాడు, కేరళ అనేక రాష్ట్రాల్లో గవర్నర్ వ్యవస్థ గురించి ఇబ్బందులు ఉన్నాయని ఆయన అన్నారు.
Also Read : Viswa Karthikeya: ‘ఎన్త్ అవర్’ మూవీ కాన్సెప్ట్ మోషన్ పోస్టర్ ను ఆవిష్కరించిన కిషన్ రెడ్డి
అంతేకాకుండా.. సమాఖ్య వ్యవస్థ,ఫెడరలిజం గురించి చర్చ జరగాలన్నారు. అసెంబ్లీని నిరవధిక వాయిదా వేయలేదు కాబట్టి గవర్నర్ ప్రసంగం లేదని, గవర్నర్ ప్రసంగం గురించి రాష్ట్ర ప్రభుత్వంతో అభ్యంతరాలు ఉంటే కూర్చుని మాట్లాడాలన్నారు. రాష్ట్రపతి ప్రసంగం బహిష్కరణపై నిర్ణయం తీసుకున్నాక వెల్లడిస్తామని ఆయన పేర్కొన్నారు. అనంతరం బీఆర్ఎస్ లోక్ సభా పక్ష నేత నామా నాగేశ్వర రావు మాట్లాడుతూ.. రైతుల పంటల మద్దతు ధర రెట్టింపు చేయలేదని, నిరుద్యోగం అంశంపైనా చర్చ జరగలని కోరామన్నారు. దేశ సమస్యలపై చర్చ జరపాలని కోరామని, కేవలం బిల్లుల ఆమోదం కాదు.. ప్రజా సమస్యలపై పార్లమెంట్ లో చర్చ జరపాలని కోరామన్నారు. గవర్నర్ వ్యవస్థ పై చర్చ జరపాలని కోరామని, పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో రాష్ట్ర సమస్యలు లెవనెత్తుతామని ఆయన పేర్కొన్నారు.
Also Read : T+1 Settlement Cycle: ఒక్క రోజులోనే మన ఖాతాలోకి డబ్బులు లేదా సెక్యూరిటీలు