సనాతన ధర్మానికి వ్యతిరేకంగా తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ సోమవారం చెన్నైలో నిరసనను నిర్వహించనున్నట్లు బీజేపీ రాష్ట్ర విభాగం తెలిపింది. ఈ వ్యవహారంలో మరో మంత్రి పీకే శేఖర్‌బాబును బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేసింది.
K.Annamalai : తమిళనాడు బీజేపీ చీఫ్ కె. అన్నామలై మరోసారి అధికార డీఎంకేను టార్గెట్ చేశారు. తమిళనాడులో రూ.2000 నోట్ల లావాదేవీలను ట్రాక్ చేయాలని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు విజ్ఞప్తి చేశారు.
తమిళనాడులో ప్రతిపక్ష అన్నాడీఏంకే, బీజేపీ మధ్య వివాదంతో ఇరు పార్టీల మధ్య దూరం పెరుగుతోదని ప్రచారం జరుగుతోంది. ఏఐఏడీఎంకే-బీజేపీ మధ్య విభేదాలు తలెత్తినట్లు రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది. కూటమికి కూటమికి బీటలువారనున్నాయా? అనే అనుమానాలు వ్యక్తం అవుతున్న తరుణంలో ఇరు పార్టీలకు చెందిన కీలక నేతలు సమావేశం అయినట్లు సమాచారం.
తమిళనాడులో రాజకీయాలు వేడెక్కాయి. ఏఐఏడీఎంకే-బీజేపీ కూటమి చీలిపోతూ వస్తోంది. రాష్ట్ర నాయకత్వంపై అసంతృప్తితో ఉన్న నేతలంతా ఏఐఏడీఎంకే పార్టీకి వరుస కడుతున్నారు. ఇప్పటికే రెండు పార్టీల మధ్య వివాదం ముదురుతోంది.
Khushbu Sundar: ప్రముఖ సినీనటి, బీజేపీ నేత ఖుష్బూ సుందర్ కు కీలక పదవి లభించింది. జాతీయ మహిళా కమిషన్( ఎన్సీడబ్ల్యూ) సభ్యురాలిగా ఆమెను కేంద్రం నామినేట్ చేసింది. ఆమెతో పాటు మరో ఇద్దరిని నామినేట్ అయ్యారు. బీజేపీ జాతీయ కార్యవర్గం సభ్యురాలు అయిన ఖుష్బూ తన నియామక పత్రాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.