Justin Trudeau: కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో సొంత దేశం, సొంత పార్టీతో పాటు ప్రపంచ దేశాల నుంచి ఛీత్కారాలు ఎదుర్కొంటున్నారు. ఖలిస్తాన్ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యలో భారత్‌తో వైరం పెంచుకున్నాడు. ఖలిస్తానీవాదులకు మద్దతుగా నిలిచాడు.
Justin Trudeau: తొమ్మిదేళ్లుగా అధికారంలో ఉన్న కెనడా ప్రధాన మంత్రి జస్టిన్ ట్రూడో తాను తన పదవికి రాజీనమా చేస్తున్నట్లు ప్రకటించారు. సొంత పార్టీ నుంచి వైదొలగాలని ఒత్తిడి పెరగడంతో ఆయనకు రాజీనామా చేయడం తప్ప వేరే అవకాశం లేకుండా పోయింది. అధికార లిబరల్ పార్టీ తదుపరి ప్రధాని పేరు ప్రకటించిన తర్వాత తాను దిగిపోనున్నట్లు వెల్లడించారు. లిబరల్ పార్టీ అధ్యక్ష పదవి నుంచి కూడా రాజీనామా ప్రకటించారు.