Lakshmi Parvathi: తెలుగు, సంస్కృతి అకాడమీ అధ్యక్షురాలు నందమూరి లక్ష్మీపార్వతి తిరుపతిలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇటీవల కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో జూనియర్ ఎన్టీఆర్ భేటీ కావడంపై ఆమె స్పందించారు. జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రావాలని లక్ష్మీపార్వతి ఆకాంక్షించారు. అంతేకాకుండా ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వచ్చి తెలుగు దేశం పార్టీని స్వాధీనం చేసుకోవాలని సూచించారు. అదే తన కోరిక అని చెప్పారు. చంద్రబాబు దుర్మార్గంగా వ్యవహరించి మహానేత ఎన్టీఆర్‌ను వెన్నుపోటు పొడిచి టీడీపీని…
కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా, టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ డిన్నర్ భేటీ.. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో రచ్చ రేపుతోంది.. ఈ భేటీలో సినిమాకు సంబంధించిన చర్చ, సీనియర్ ఎన్టీఆర్ గురించి ప్రస్తావన వచ్చిందని బీజేపీ నేతలు చెబుతున్నా.. ఇది పక్కా రాజకీయ చర్చ జరిగిన సమావేశంగా ప్రచారం సాగుతోంది.. ఈ తరుణంలో షా-ఎన్టీఆర్ భేటీపై సంచలన వ్యాఖ్యలు చేశారు మాజీ మంత్రి, వైసీపీ నేత కొడాలి నాని.. ఈ పరిణామాలపై ఎన్టీవీతో ప్రత్యేకంగా మాట్లాడిన ఆయన..…
అమిత్ షా, జూనియర్ ఎన్టీఆర్ భేటీ పై కొడాలి నాని ఆసక్తికర వ్యాఖ్యలు.. ప్రధాని నరేంద్ర మోడీ, అమిత్‌షా ఉపయోగం లేకుంటే నిమిషం కూడా ఎవరితో మాట్లాడరని పేర్కొన్న ఆయన.. భారతీయ జనతా పార్టీని విస్తరించేందుకే జూనియర్ ఎన్టీఆర్ తో, అమిత్ షా సమావేశం అయ్యాడని భావిస్తున్నానన్నారు..
అమిత్ షా, జూనియర్ ఎన్టీఆర్ భేటీకి రాజకీయ ప్రాధాన్యత లేదని స్పష్టం చేశారు కిషన్ రెడ్డి.. రాజకీయాలకు ఏ మాత్రం సంబంధం లేని సమావేశం అదన్న ఆయన.. సినిమాలకు సంబంధించిన చర్చ మాత్రమే జరిగిందన్నారు.
కొరటాల శివతో ఎన్టీఆర్ చేయబోయే సినిమా.. ఎప్పుడెప్పుడు సెట్స్ పైకి వెళ్తుందా.. అని ఎదురు చూస్తున్నారు ఆభిమానులు.. అయినా అదుగో.. ఇదుగో.. అనడమే తప్పా.. ముందుకు మాత్రం కదలడం లేదు ఎన్టీఆర్ 30 సినిమా. కానీ సినీ వర్గాలు మాత్రం అలా చేస్తున్నారు.. ఇలా చేస్తున్నారంటూ తెగ ఊరిస్తున్నారు. ఇదొక్కటే కాదు.. ఎన్టీఆర్ ఓ తమిళ్ దర్శకుడికి కూడా ఓకే చెప్పినట్టు వార్తలొస్తున్నాయి.. ఇంతకీ భారీ సెట్టింగ్ మరియు కోలీవుడ్ డైరెక్టర్ అసలు కథేంటి..! ఎన్టీఆర్-కొరటాల ప్రాజెక్ట్…
మహానాయకుడు, విశ్వవిఖ్యాత నటసార్వభౌమ నందమూరి తారకరామారావు జయంతి నేడు.. అయితే.. ఈ నేపథ్యంలో తాతాను తలుచుకుంటూ.. జూనియర్ ఎన్టీఆర్ ట్విట్టర్ వేదికగా సదా మిమ్మల్ని స్మరించుకుంటూ అంటూ ఎమోషనల్‌గా ట్వీట్ చేశారు. ‘మీ పాదం మోపక తెలుగు ధరిత్రి చిన్నబోతోంది.. మీ రూపు కానక తెలుగు గుండె తల్లడిల్లిపోతోంది. పెద్దమనుసుతో ఈ ధరిత్రిని, ఈ గుండెను మరొక్కసారి తాకిపో తాతా..’ సదా మీ ప్రేమకు బానిసను అంటూ.. ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు జూ.ఎన్టీఆర్. ఇదిలా ఉంటే.. ఎన్టీఆర్…
యంగ్ టైగర్ జూ ఎన్టీఆర్ అభిమానులకు నేడు పండగ రోజు. సన్నిహితులు ముద్దుగా తారక్ అని పిలుచుకునే ఈ నందమూరి స్టార్ 39వ వసంతంలోకి అడుగు పెడుతున్నారు. యంగ్ టైగర్‌ను పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపేందుకు తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాల నుంచి అభిమానులు హైదరాబాద్ తరలివచ్చారు. దీంతో.. ఎన్టీఆర్ పుట్టిన రోజు సందర్భంగా అభిమానులు ఆయన ఇంటి దగ్గర హడావుడి చేశారు. ఆయన ఇంటి వద్దకు భారీగా అభిమానులు తరలిరావడంతో ఆ ప్రాంతమంతా రద్దీగా మారింది.…
‘ట్రిపుల్ ఆర్’ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా దర్శకుడు రాజమౌళి, హీరోలు ఎన్టీయార్, రామ్ చరణ్ ఇటీవలే దేశంలోని నాలుగు మూలలు చుట్టివచ్చారు. అంతేకాదు… వివిధ భాషల్లోని ఛానెల్స్ కు ఇంటర్వ్యూలూ ఇచ్చారు. అలా మలయాళ ప్రేక్షకుల కోసం ఇచ్చిన ఇంటర్వూలో ఎన్టీయార్… ‘ఇటీవల కాలంలో తన ఫోన్ లో ఎక్కువ సార్లు విన్న పాట ‘ఆశా పాశం’ మని చెప్పారు. ‘కేరాఫ్ కంచర పాలెం’లోని ఆ పాట అంటే తనకెంతో ఇష్టమని చెప్పిన ఎన్టీయార్ ఆ…
జెమినీ టీవీలో ఎన్టీఆర్ హోస్ట్ చేసిన ‘ఎవరు మీలో కోటీశ్వరులు’ షో ముగిసింది. గతంలో చిరంజీవి, నాగార్జున హోస్ట్ చేసిన షోలు స్టార్ మాటీవీలో ప్రసారం కాగా.. జూనియర్ ఎన్టీఆర్ హోస్ట్ చేసిన షో మాత్రం జెమినీ టీవీలో టెలీకాస్ట్ చేశారు. అయితే ఈ షోకు భారీ టీఆర్పీలు వస్తాయని నిర్వాహకులు ఆశించారు. కానీ ప్రారంభంలో ఆశలు రేకెత్తించిన టీఆర్పీలు రాను రాను తీసికట్టుగా వచ్చాయి. ఈ నేపథ్యంలో సీజన్ చివరి ఎపిసోడ్‌కు ఏకంగా సూపర్‌స్టార్ మహేష్‌బాబు…