జెమినీ టీవీలో ఎన్టీఆర్ హోస్ట్ చేసిన ‘ఎవరు మీలో కోటీశ్వరులు’ షో ముగిసింది. గతంలో చిరంజీవి, నాగార్జున హోస్ట్ చేసిన షోలు స్టార్ మాటీవీలో ప్రసారం కాగా.. జూనియర్ ఎన్టీఆర్ హోస్ట్ చేసిన షో మాత్రం జెమినీ టీవీలో టెలీకాస్ట్ చేశారు. అయితే ఈ షోకు భారీ టీఆర్పీలు వస్తాయని నిర్వాహకులు ఆశించారు. కానీ ప్రారంభంలో ఆశలు రేకెత్తించిన టీఆర్పీలు రాను రాను తీసికట్టుగా వచ్చాయి. ఈ నేపథ్యంలో సీజన్ చివరి ఎపిసోడ్‌కు ఏకంగా సూపర్‌స్టార్ మహేష్‌బాబు లాంటి హీరోను ముఖ్య అతిథిగా తీసుకువచ్చినా టీఆర్పీ రేటింగ్‌లో మాత్రం నిర్వాహకులకు చుక్కెదురైందనే చెప్పాలి.
Read Also: ‘ఊ అంటావా ఊఊ అంటావా’ మేల్ వెర్షన్.. ఆడాళ్ల బుద్ధే వంకర బుద్ధి
ఎన్టీఆర్-మహేష్‌బాబు కలిసి నటించిన ఎపిసోడ్‌కు పూనకాల ఎపిసోడ్ అని నిర్వాహకులు భారీ ఎత్తున ప్రచారం చేసినా టీఆర్పీ మాత్రం ఊహించిన విధంగా రాలేదు. ఈ ఎపిసోడ్‌కు కేవలం 4.9 టీఆర్పీ మాత్రమే నమోదైంది. అయితే గతంలో రామ్‌చరణ్ అతిథిగా వచ్చిన ఎపిసోడ్‌కు ఏకంగా 11.4 టీఆర్పీ వచ్చిన సంగతి తెలిసిందే. అందులో సగం రేటింగ్ కూడా మహేష్‌బాబు ఎపిసోడ్‌కు రాకపోవడం నిర్వాహకులను నిరుత్సాహపరిచింది. కాగా ఇదే వారంలో జెమినీ టీవీ పాగల్ సినిమాను వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్‌గా టెలీకాస్ట్ చేయగా 5.2 టీఆర్పీ రావడం గమనార్హం.
#EvaruMeeloKoteeswarulu With #MaheshBabu As Guest On #GeminiTV Gets 4.90 TRP
— T2BLive.COM (@T2BLive) December 16, 2021