Kodali Nani: మాజీ మంత్రి కొడాలి నాని మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో ఎన్టీఆర్ డీఎన్‌ఏ లేకుండా చేయాలని టీడీపీ కుట్రలు పన్నుతోందని ఆయన ఆరోపించారు. నారా లోకేష్ కోసం జూనియర్ ఎన్టీఆర్‌ను రాజకీయాల్లోకి రాకుండా చంద్రబాబు తొక్కేస్తున్నాడని కొడాలి నాని విమర్శించారు. ఎన్టీఆర్ డీఎన్ఏ అయిన జూనియర్ ఎన్టీఆర్‌ను కాదని నారా లోకేష్‌ను అందలెక్కించడం ద్వారా చంద్రబాబు కుట్రలు చేస్తున్నారని కొడాలి నాని పరోక్షంగా ఆరోపించారు. అలాగే ఏపీని ఆక్రమించాలని ఓ కులం పన్నాగాలు…
సూపర్ స్టార్ కృష్ణ ఈ లోకాన్ని విడిచివెళ్లడం యావత్ తెలుగు రాష్ట్రాల సినీ రాజకీయ సామాన్య ప్రజలని కూడా బాధ పెట్టింది. మోస్ట్ డేరింగ్ అండ్ డాషింగ్ హీరోగా ఎన్నో ప్రయోగాలు చేసిన కృష్ణ చనిపోవడం మహేష్ బాబుకి తీరని లోటు.
JR.NTR : యంగ్ టైగర్ ఎన్టీఆర్ పై ఇప్పుడు అభిమానులతో పాటు నెటిజన్స్ ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. ఆయన సింప్లిసిటీకి ఫిదా అవుతున్నారు. మహిళ పట్ల ఆయనకున్న గౌరవాన్ని చూసి అబ్బురపడుతున్నారు.
Somu Veerraju: విజయవాడలోని బీజేపీ కార్యాలయంలో గురుపూజోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మరోసారి జూనియర్ ఎన్టీఆర్ పేరును సోము వీర్రాజు ప్రస్తావించారు. ఈ కార్యక్రమంలో నృత్యం చేసిన చిన్నారి గురించి ప్రస్తావిస్తూ జూనియర్ ఎన్టీఆర్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. జూనియర్ ఎన్టీఆర్ చక్కటి నటుడు అని.. భరత నాట్యాన్ని అభ్యసించాడని.. బాల రామాయణం జూనియర్ ఎన్టీఆర్ తొలి సినిమా అని.. భరత…
Harikrishna Birth Anniversary: నందమూరి హరికృష్ణ 66వ జయంతి సందర్భంగా ఆయన తనయుడు, టాలీవుడ్ స్టార్ హీరో జూ.ఎన్టీఆర్ ఘనంగా నివాళులర్పించాడు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా భావోద్వేగ ట్వీట్ చేశాడు. ‘ఈ అస్తిత్వం మీరు.. ఈ వ్యక్తిత్వం మీరు.. మొక్కవోని ధైర్యంతో కొనసాగే మా ఈ ప్రస్థానానికి నేతృత్వం మీరు.. ఆజన్మాంతం తలచుకునే అశ్రుకణం మీరే’ అంటూ ఓ ఫోటోను ఎన్టీఆర్ షేర్ చేశాడు. మరోవైపు హరికృష్ణ పెద్దకుమారుడు నందమూరి కళ్యాణ్‌రామ్ కూడా ఇదే…
Minister Roja: రాజమండ్రిలో శుక్రవారం నాడు పర్యాటక శాఖ మంత్రి రోజా పర్యటించారు. వీఎల్ పురంలో మల్టీ పర్పస్ ఇండోర్ స్టేడియం నిర్మాణానికి ఆమె శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆమె సంచలన వ్యాఖ్యలు చేశారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షాను జూనియర్ ఎన్టీఆర్ కలిసిప్పటి నుంచి చంద్రబాబులో వణుకు మొదలైందని మంత్రి రోజా వ్యాఖ్యానించారు. మరోవైపు బాలకృష్ణ ఉచిత ఆరోగ్య రథం ప్రారంభించి ఆ రథంపై కేవలం ఎన్టీఆర్, బాలకృష్ణ ఫోటోలనే ముద్రించుకున్నారని.. చంద్రబాబు ఫోటో…
లక్ష్మీపార్వతి అడిగారనో.. నేను అడిగాననో.. జూనియర్ ఎన్టీఆర్ వెళ్లి తెలుగుదేశం పార్టీ పగ్గాలు తీసుకోరన్నారు కొడాలి నాని.. ఆయనకి అవకాశం వచ్చినప్పుడు, ఆ టైం వచ్చినప్పుడు, తీసుకోగలను అనుకున్నప్పుడు.. తీసుకునే పరిస్థితి ఉన్నప్పుడు తప్పకుండా తీసుకుంటారని.. దానికి తొందరెందుకు అని వ్యాఖ్యానించారు.