తెలుగు చిత్ర పరిశ్రమలో క్లీన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్లకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచిన దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి, తన 43వ చిత్రంగా ‘వేదవ్యాస్’ అనే భారీ ప్రాజెక్టును తెరకెక్కిస్తున్నారు. ప్రముఖ నిర్మాత కె. అచ్చిరెడ్డి సమర్పణలో, సాయిప్రగతి ఫిలింస్ బ్యానర్‌పై కొమ్మూరి ప్రతాప్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇటీవల నిర్మాత అచ్చిరెడ్డి పుట్టినరోజు సందర్భంగా జరిగిన వేడుకలో ఈ సినిమాతో హీరోగా పరిచయమవుతున్న పిడుగు విశ్వనాథ్‌ను చిత్ర బృందం ఘనంగా పరిచయం చేసింది. భారతీయ సంస్కృతి సంప్రదాయాల…