తెలంగాణ రాజకీయంలో ఎక్కువ భాగం ఇప్పుడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక చుట్టూ తిరుగుతోంది. ఇక్కడి నుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా గెలిచిన మాగంటి గోపీనాథ్ అకాల మరణంతో బైపోల్ అనివార్యమైంది. ఇంకో రెండు మూడు నెలల్లో దీనికి సంబంధించిన నోటిఫికేషన్ రావచ్చని భావిస్తున్నారు.
ఓ యువకుడు ప్రేమ పేరుతో బాలికపై లైంగిక దాడికి పాల్పడిన ఘటన జూబ్లీహిల్స్ లో చోటుచేసుకుంది. నేపాల్ కి చెందిన బాలిక జూబ్లీహిల్స్ లో తల్లితండ్రితో కలిసి నివాసం ఉంటోంది. బాలిక కి తన ఇంటి సమీపంలోని ఫాస్ట్ ఫుడ్ సెంటర్ నిర్వాహకుడు కృష్ణ తో పరిచయం ఏర్పడింది. ప్రేమ పేరుతో బాలిక ను ట్రాప్ చేశాడు కృష్ణ.. లేచిపోయి పెళ్లి చేసుకుందాం అని చెప్పడంతో ఇంట్లో నుంచి బాలిక వచ్చేసింది. Also Read:Gold Price Today:…
జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఉప ఎన్నికల సన్నాహకాలు మొదలయ్యాయి. ఇటీవల ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ మరణంతో ఆ నియోజకవర్గానికి ఉప ఎన్నికలు తప్పనిసరి అయ్యాయి.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కోసం కాంగ్రెస్ పార్టీ స్పెషల్ స్కెచ్‌లు సిద్ధం చేస్తోందా? గెలుపు ఇప్పుడు పరువు ప్రతిష్టల సమస్యగా మారిపోయిందా? అందుకే… అందరికంటే ముందే కసరత్తు మొదలుపెట్టేసిందా? ఇంతకీ ఉప ఎన్నిక కోసం కాంగ్రెస్ ప్రణాళికలు ఎలా ఉన్నాయి? పార్టీ వర్గాలు ఏమంటున్నాయి? తెలంగాణ కాంగ్రెస్‌కు ఇప్పుడో అగ్ని పరీక్ష ఎదురైంది. అదే… జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక. ఈ బైపోల్‌లో గెలుపన్నది అటు పార్టీ… ఇటు ప్రభుత్వానికి సవాల్ అన్న అభిప్రాయం అన్ని వర్గాల్లో ఉంది.18…
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికను సవాల్‌గా తీసుకుంటున్నాయి అన్ని రాజకీయ పార్టీలు. అందుకే నోటిఫికేషన్ రాకముందే ఈ నియోజకవర్గంలో ఎలా పాగవేయాలన్న ప్లానింగ్‌లో మునిగి తేలుతున్నట్టు తెలుస్తోంది. బీఆర్‌ఎస్ సిట్టింగ్ సీటును ఎలాగైనా కొట్టాలని అధికార పార్టీ ప్లాన్ చేస్తుంటే..
జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అనారోగ్యంతో ఈనెల 9న చనిపోయారు. దీంతో... ఈ అసెంబ్లీ సీటు ఖాళీ అయింది. ఇందుకు సంబంధించి శాసనసభ సెక్రటరీ గెజిట్ ఇచ్చారు కూడా. అటు కేంద్ర ఎన్నికల కమిషన్‌కు పూర్తి సమాచారం చేరింది.
Maganti Gopinath : జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ అంత్యక్రియలు ముగిశాయి. ఆయన మృతదేహాన్ని చూసేందుకు పెద్ద సంఖ్యలో అభిమానులు, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు హాజరయ్యారు. మాదాపూర్‌లోని ఆయన నివాసం నుంచి ప్రారంభమైన అంతిమయాత్ర, జూబ్లీహిల్స్ మహాప్రస్థానం వరకు సాగింది. ఈ సందర్భంగా మాదాపూర్ నీరూస్, జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్, రోడ్ నెంబర్ 45, ఫిల్మ్‌నగర్ వంటి ప్రధాన ప్రాంతాల గుండా యాత్ర సాగింది. BC Janardhan Reddy: ఓటు అనే ఆయుధంతో ప్రజలే మిమ్మల్ని వెన్నుపోటు పొడిచారు..…
CM Revanth Reddy : మహిళల శక్తిని ప్రేరణగా తీసుకుని, రాష్ట్ర అభివృద్ధిలో కీలక పాత్ర పోషించేలా చేయడమే తమ ప్రభుత్వ ధ్యేయమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. కోటి మంది మహిళలు కోటీశ్వరులవ్వాలన్నదే తమ ప్రభుత్వ లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు. జూబ్లీహిల్స్ జేఆర్సీ కన్వెన్షన్ సెంటర్లో నిర్వహించిన వీహబ్ వుమెన్ యాక్సిలరేషన్ కార్యక్రమాన్ని సీఎం రేవంత్ ప్రారంభించారు. ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన మహిళా స్టాళ్లను పరిశీలించారు. అనంతరం నిర్వహించిన సభలో మాట్లాడుతూ..…