Jubilee Hills By-Election: జూబ్లీహిల్స్ ఉపఎన్నిక నామినేషన్ల ఉపసంహరణకు ఇవాళ చివరి అవకాశం. మధ్యాహ్నం 3 గంటల వరకు అభ్యర్థులు తమ నామినేషన్లను ఉపసంహరించుకునేందుకు అవకాశం ఉంది. మధ్యాహ్నం 3 గంటల తరువాత ఉపసంహరణ మినహా బరిలో మిగిలిన అభ్యర్థుల తుది జాబితాను ఎన్నికల అధికారులు విడుదల చేయనున్నారు. ఈ సందర్భంగా మూడు ప్రధాన పార్టీల అభ్యర్థులతో పాటు మిగతా స్వతంత్ర, చిన్న పార్టీల అభ్యర్థులకు గుర్తులు కేటాయించనున్నారు. మొత్తం 81 మంది అభ్యర్థులు బరిలో ఉండగా,…
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు నామినేషన్ గడువు ముగిసింది. చివరి రోజు కావడంతో ప్రధాన పార్టీల అభ్యర్థులతో పాటు, స్వతంత్ర అభ్యర్థులు భారీగా చేరుకున్నారు. దీంతో ఆర్వో కార్యాలయం వద్ద సందడి వాతావరణం నెలకొంది. ఈ మధ్యాహ్నం 3 గంటల వరకు వచ్చిన అభ్యర్థులను అధికారులు లోనికి అనుమతించారు. ఆర్వో కార్యాలయం కాంపౌండ్ లో భారీగా క్యూ కట్టారు స్వతంత్ర అభ్యర్థులు. సుమారు వందకు పైగా స్వతంత్ర అభ్యర్థుల నామినేషన్ దాఖలు చేసినట్లు సమాచారం. Also Read:Renu Desai…
Jubilee Hills Bye-Election: జూబ్లీహిల్స్ ఉపఎన్నిక నామినేషన్ల దాఖలు ప్రక్రియ ఈరోజుతో ముగియనుంది. మధ్యాహ్నం మూడు గంటల వరకు నామినేషన్లు స్వీకరించనున్నట్లు రిటర్నింగ్ ఆఫీసర్ తెలిపారు. చివరి రోజు కావడంతో భారీగా నామినేషన్లు దాఖలయ్యే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇప్పటి వరకు మొత్తం 94 మంది అభ్యర్థులు 127 సెట్ల నామినేషన్లను దాఖలు చేశారు. కాంగ్రెస్ తరఫున నవీన్ యాదవ్ రెండు సెట్ల నామినేషన్లు వేయగా, బీఆర్‌ఎస్ నుంచి మాగంటి సునీత మూడు సెట్ల…
హైదరాబాద్‌లో కేంద్ర మంత్రి జీ. కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. హైకోర్టులో బీసీ రిజర్వేషన్ల అంశంపై వాదనలు సమర్థవంతంగా వినిపించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆయన అన్నారు. “కేంద్ర మంత్రిగా నేను ఉన్నంత మాత్రాన రిజర్వేషన్ల విషయంలో ఏదైనా నిర్ణయం తీసుకోవడం సాధ్యం కాదు. సుప్రీంకోర్టు తీర్పుకు వ్యతిరేకంగా రాష్ట్రపతిగారు కూడా ఏం చేయలేరు,” అని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. మహారాష్ట్రలో తమ ప్రభుత్వమే ఉన్నప్పటికీ,…
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించిన కసరత్తును కాంగ్రెస్ పార్టీ ప్రారంభించింది. స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్‌తో పాటు జూబ్లీహిల్స్ ఎన్నిక షెడ్యూల్ కూడా వస్తుంది కాబట్టి.. కాంగ్రెస్ పార్టీ తమ అభ్యర్థి ఎంపికపై ఫోకస్ పెట్టింది. ఇందులో భాగంగానే ఈరోజు ఉదయం సీఎం రేవంత్ రెడ్డితో పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్, మంత్రి పొన్నం ప్రభాకర్ భేటీ అయ్యారు. ఈ భేటీలో స్థానిక సంస్థల ఎన్నికల అభ్యర్థులతో పాటు జూబ్లీహిల్స్ అభ్యర్థిపై చర్చ జరిగింది. ఈ…