జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల వేడి రోజురోజుకీ పెరుగుతోంది. ఈ నేపథ్యంలో బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వ్యాఖ్యలపై మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్రంగా స్పందించారు.
KTR : జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల నేపథ్యంలో బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రచార వేగాన్ని మరింత పెంచారు. శుక్రవారం షేక్‌పేట్‌లో నిర్వహించిన భారీ రోడ్ షోలో ఆయన పాల్గొన్నారు. నందీనగర్ నివాసం నుంచి ప్రారంభమైన ఈ ప్రచారం సాయంత్రం వరకు ఉత్సాహంగా సాగింది. వేలాదిగా చేరిన కార్యకర్తలు, స్థానిక ప్రజలు “కేటీఆర్ జయహో”, “కారు గుర్తుకే ఓటు” అంటూ నినాదాలు చేశారు. పార్టీ అభ్యర్థి మాగంటి సునీతకు మద్దతుగా నిర్వహించిన ఈ ప్రచారంలో మాట్లాడిన కేటీఆర్,…
Mohammed Azharuddin: మహమ్మద్ అజహరుద్దీన్ కు మంత్రి పదవి వరించింది. నేడు రాష్ట్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. రాజ్‌భవన్‌లో గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ మధ్యాహ్నం 12.15గంటల ప్రాంతంలో ప్రమాణ స్వీకారం చేయించారు. కేబినెట్ విస్తరణలో భాగంగా ఆయన ఒక్కరే మంత్రిగా ప్రమాణం చేశారు. ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి, పలువురు మంత్రులు హాజరయ్యారు. నూతన మంత్రికి శుభాకాంక్షలు తెలిపారు. ఇంతకీ ఏ శాఖను కేటాయిస్తారు అనే అంశంపై క్లారిటీ లేదు.
Off The Record: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో జంబో బ్యాలెట్ ఎవరి కొంప ముంచబోతోంది? నెక్ టు నెక్ ఫైట్‌లో వాళ్ళ ప్రభావం ఏ మేరకు ఉండబోతోంది? 58 మంది అభ్యర్థులు బరిలో ఉంటే… అందులో 48 మంది నాన్ లోకల్సే ఎందుకున్నారు? అధికార కాంగ్రెస్‌తో పాటు ప్రతిపక్ష బీఆర్‌ఎస్ మీద కూడా పగ తీర్చుకోవడానికి నామినేషన్స్ వేశారా? రెండు పార్టీలను ఒకేసారి ఎందుకు వ్యతిరేకిస్తున్నారు? ఎక్కడైనా ఎన్నికలంటే… సాధారణంగా ప్రధాన పార్టీల అభ్యర్థులతో పాటు ఓ…
Off The Record: జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్ విసిరిన గూగ్లీకి కారు పార్టీలో కలవరం మొదలైందా? రాజకీయ ప్రత్యర్థి అలాంటి స్టెప్ తీసుకుంటారని గులాబీ పెద్దలు అస్సలు ఊహించలేకపోయారా? ముందు ఉలిక్కిపడి షాకైనా… వెంటనే విరుగుడు మంత్రం కోసం ప్రయత్నాలు మొదలయ్యాయా? కాంగ్రెస్ ప్రయోగించిన ఆ అస్త్రం ఏంటి? బీఆర్‌ఎస్ ఎలా కౌంటర్ చేసుకోవాలనుకుంటోంది? తెలంగాణలోని అన్ని ప్రధాన రాజకీయ పార్టీలకు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కీలకంగా మారింది. దాంతో ఎత్తులకు పై ఎత్తులతో పొలిటికల్ గేమ్ మాంఛి…
Telangana BJP : జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక వేళ అజారుద్దీన్ కు మంత్రి పదవి ఇవ్వడంపై బీజేపీ నేతలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే పాయల్ శంకర్, మర్రి శశిధర్ రెడ్డితో పలువురు బీజేపీ ప్రతినిధులు ఎన్నికల అధికారులను కలిసి ఫిర్యాదు చేశారు. జూబ్లీహిల్స్ ఎన్నికల వేళ అజారుద్దీన్ కు మంత్రి పదవి ఇవ్వడం ఎన్నికల కోడ్ ఉల్లంఘన కిందకే వస్తుందన్నారు. సీఎం రేవంత్ రెడ్డి కోడ్ ఉల్లంఘించారని ఆరోపించారు. ఇలా మంత్రి పదవి ఇవ్వడం…
KTR : కాంగ్రెస్ ప్రభుత్వం కేటీఆర్ ట్విట్టర్ వేదికగా మరోసారి ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామలను అమలు చేయాలంటే.. జూబ్లీహిల్స్ లో ఓడించాలన్నారు. అలా ఓడిస్తేనే ఆ పార్టీకి భయం పట్టుకుని హామీలను అమలు చేస్తుందన్నారు కేటీఆర్. జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్ కు డిపాజిట్ రాకుండా ఓడించాలన్నారు. కాంగ్రెస్ పార్టీ ఓట్ల కోసం చాలా రకాల ప్రయత్నాలు చేస్తోందన్నారు. అధికారంలోకి వచ్చిన రెండేళ్ల తర్వాత పార్టీ ఎట్టకేలకు క్షేత్రస్థాయి వాస్తవాలను గ్రహిస్తున్నట్లు కనిపిస్తోందన్నారు. అందుకే…
Telangana BJP : కాంగ్రెస్ నేత అజారుద్దీన్ కు మంత్రి పదవి ఇవ్వనున్నట్టు ఇప్పటికే ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక టికెట్ ఇవ్వనందుకు ఆయనకు ఏకంగా మంత్రి పదవే ఇస్తున్నారు. రేపు అజారుద్దీన్ మంత్రిగా ప్రమాణం చేయబోతున్నాడు. ఆయనకు మంత్రి పదవి ఇవ్వడంపై బీజేపీ ఫైర్ అయింది. అజారుద్దీన్ కు మంత్రి పదవి ఇవ్వడంపై బీజేపీ నేడు ఎలక్షన్ కమిషన్ కు ఫిర్యాదు చేయబోతోంది. ఉదయం 11 గంటలకు ఎలక్షన్ కమిషన్ ను…
Off The Record: జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ముంగిట్లో కీలక నిర్ణయం తీసుకుంది కాంగ్రెస్ అధినాయకత్వం. పార్టీ నాయకుడు, మాజీ క్రికెటర్ మహ్మద్ అజారుద్దీన్‌కు మంత్రి పదవి ప్రకటించింది. ఎల్లుండి సీఎం రేవ్ంత్ రెడ్డి టీమ్‌లో చేరబోతున్నారు అజార్. తెలంగాణ మంత్రివర్గంలో ఇంకా మూడు ఖాళీలు ఉండగా… అందులో ఒకదాన్ని అజార్‌కు క్లియర్ చేశారు. మిగతా రెండిటిని డిసెంబర్‌లో భర్తీ చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. శుక్రవారం ఉదయం రాజ్‌భవన్‌లో మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు అజార్.…
జూబ్లిహిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ప్రచారాన్ని ముమ్మరం చేసింది. మంగళవారం నియోజకవర్గంలో తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు నేతృత్వంలో ‘మాస్ కాంపెయిన్’ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా బీజేపీ నేతలు ప్రతి ఓటరునూ కలుసుకుని ఓట్లు అభ్యర్థించేలా పాదయాత్రలు ఘనంగా నిర్వహించారు. ఎన్ రామచంద్రరావు ఎర్రగడ్డ డివిజన్‌లో పాదయాత్రలో పాల్గొన్నారు. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి శ్రీనగర్ కాలనీ, ఎల్లారెడ్డిగూడలో, ప్రచార కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమాల్లో…