జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్‌కు మద్దతు సీఎం రేవంత్ రెడ్డి ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా శుక్రవారం నిర్వహించిన ప్రెస్ మీట్‌లో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. విజ్ఞతతో ఆలోచించి.. అభివృద్ధి పథం వైపు నడిపేందుకు ఆలోచన చేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
Naveen Yadav: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ ఎన్టీవీతో ప్రత్యేకంగా మాట్లాడారు. ఈ ప్రాంత ప్రజలతో తమ కుటుంబానికి గత 40 ఏళ్లుగా అనుబంధం ఉందని, సహాయం కోసం వచ్చిన వారందరికీ అండగా నిలిచామని ఆయన తెలిపారు. అన్ని కులాలు, మతాల వారితో తమకున్న సంబంధాల కారణంగానే ప్రజలు తనను ఒక సెక్యులర్ నాయకుడిగా భావించారని అన్నారు. అందుకే 2014లో MIM పార్టీ తరఫున పోటీ చేసినా.. ప్రజలు తనకు…
Flying Squad Raid: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో విజయం సాధించడానికి ప్రధాన పార్టీలు తమ సర్వశక్తులను ఒడ్డుతున్నాయి. ఓ వైపు ముఖ్యమంత్రి, మంత్రులు.. మరోవైపు విపక్షంలోని బీఆర్‌ఎస్, బీజేపీ ముఖ్య నేతలు నియోజకవర్గ పరిధిలో ముమ్మరంగా ప్రచారం చేస్తున్నారు. ప్రచార పర్వం నేపథ్యంలో ఓటర్లను తాయిలాలతో మభ్యపెట్టేందుకు ప్రధాన పార్టీలు సన్నద్ధమవుతున్నట్లుగా తెలుస్తోంది. దీంతో ఎన్నికల సంఘం అప్రమత్తమై కీలక నేతల కదలికలపై నిరంతరం దృష్టి సారించింది. ఈ క్రమంలోనే ఓటర్లకు డబ్బు పంచేందుకు భారీ ఎత్తున…
కేంద్రమంత్రి కిషన్ రెడ్డికి మంత్రి పొన్నం ప్రభాకర్ మరోసారి సవాల్ విసిరారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ తరఫున పోటీ చేసిన అభ్యర్థికి 25 వేల ఓట్లు వచ్చాయని, ఇప్పుడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలలో 25 వేలకు ఒక్క ఓటు తగ్గకుండా తీసుకువస్తే.. మీరేం (కిషన్ రెడ్డి) చెబితే అందుకు తాను సిద్ధం అని చెప్పారు. 25 వేల ఓట్లు బీజేపీ అభ్యర్థికి రాకపోతే.. తాను చెప్పింది చేయడానికి కిషన్ రెడ్డి సిద్ధమా? అని ప్రశ్నించారు. జూబ్లీహిల్స్…
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల నేపథ్యంలో సైబరాబాద్‌లో మూడు రోజుల పాటు మద్యం దుకాణాలు క్లోజ్ కానున్నాయి. నవంబర్ 9 సాయంత్రం 6 గంటల నుంచి నవంబర్ 11 సాయంత్రం 6 గంటల వరకు వైన్ షాపులు, బార్లు మూసివేయనున్నారు. అలాగే ఎన్నికల ఓట్ల లెక్కింపు రోజు నవంబర్ 14న ఉదయం 6 గంటల నుంచి లెక్కింపు పూర్తయ్యే వరకు, అవసరమైతే రిపోల్ రోజు కూడా వైన్ షాప్స్ బంద్ కానున్నాయి. ఈ మేరకు సైబరాబాద్ పోలీస్ కమిషనర్…
Bandi Sanjay: జూబ్లీహిల్స్ నియోజకవర్గం బోరబండలో కేంద్ర మంత్రి బండి సంజయ్ మీటింగ్‌కు పోలీసులు అనుమతి రద్దు చేశారు. షెడ్యూల్ ప్రకారం ఈరోజు సాయంత్రం బోరబండలో కొనసాగాల్సిన బండి సంజయ్ మీటింగ్‌ను నిలిపేశారు. పోలీసుల తీరుపై బీజేపీ శ్రేణుల మండిపడుతున్నారు. అనుమతి ఇచ్చి రద్దు చేయడమేంటని బీజేపీ ఎన్నికల ఇంఛార్జీ ధర్మారావు ప్రశ్నించారు.
Ponnam Prabhakar: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో భాగంగా యూసుఫ్‌గూడలో ఎన్నికల ప్రచారంలో నిర్వహించారు హైదరాబాద్ ఇన్‌ఛార్జి మంత్రి పొన్నం ప్రకాష్ భాకర్.. ఈ సందర్భగా ఆయన మీడియాతో మాట్లాడారు. మా అభ్యర్థి యువకుడు, స్థానికుడు, ఉత్సాహవంతుడు అని పేర్కొన్న ఆయన, రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపిస్తే అభివృద్ధికి మరింత అవకాశం ఉంటుందని ప్రజలు విశ్వసిస్తున్నారని తెలిపారు. గతంలో అధికారంలో ఉన్నప్పటికీ అభివృద్ధి చేయకుండా నిర్లక్ష్యం చేసినవారిని ప్రజలు తిరస్కరించారని, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం…
Ponnam Prabhakar : కుల గణనలో తెలంగాణ దేశానికి ఆదర్శంగా నిలిచిందని రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ అన్నారు. ఆదివారం మూసాపేటలోని మెజెస్టిక్ గార్డెన్స్‌లో జరిగిన మున్నూరు కాపు, కాపుల ఆత్మీయ సమ్మేళనంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, కోకాపేటలో మున్నూరు కాపు భవనం నిర్మాణాన్ని త్వరలో పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. బీసీ వర్గాల అభ్యున్నతికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల అమలుకు చట్టపరంగా ముందుకు వెళ్తామని స్పష్టం…
KTR : జూబ్లీహిల్స్ ఉపఎన్నిక ప్రచారం వేగంగా సాగుతోంది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ శనివారం షేక్‌పేట్‌లోని ఆదిత్య ఇంప్రెస్ గేటెడ్ కమ్యూనిటీని సందర్శించారు. ఆయనతో పాటు మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే జాజుల సురేందర్ కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ బీఆర్‌ఎస్ ప్రభుత్వంలో రాష్ట్రం అన్ని రంగాల్లో విశేష అభివృద్ధి సాధించిందని చెప్పారు. కేటీఆర్ మాట్లాడుతూ.. జూబ్లీహిల్స్ ఉపఎన్నిక అనేది మా ప్రియమైన నాయకుడు మాగంటి గోపీనాథ్…
KK Report : జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో సర్వే వివాదం రచ్చ రేపుతోంది. కేకే సర్వే సంస్థ విడుదల చేసిన సర్వే రిపోర్ట్‌పై కాంగ్రెస్ ఎమ్మెల్సీలు బల్మూరి వెంకట్, అద్దంకి దయాకర్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో వారు ఎన్నికల రిటర్నింగ్ ఆఫీసర్ (ఆర్‌ఓ) సాయిరాం ను కలసి అధికారికంగా ఫిర్యాదు చేశారు. ఈ భేటీ కోట్ల విజయభాస్కర్ ఇండోర్ స్టేడియంలో జరిగింది. కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ మాట్లాడుతూ, కేకే సర్వే సంస్థ…