హైదరాబాద్ జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గం ఉప ఎన్నిక ఇప్పుడు.... కాస్త రాజకీయ అవగాహన ఉన్న ప్రతి ఒక్కర్నీ విపరీతంగా ఆకర్షిస్తోంది. దీనికి సంబంధించి త్వరలోనే...త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. ఇది బీఆర్‌ఎస్ సిట్టింగ్ సీటు కాగా... అధికార పార్టీగా... ఎట్టి పరిస్థితుల్లో ఈసారి తమ చేయి దాటి పోనివ్వకూడదన్న పట్టుదలగా ఉంది కాంగ్రెస్. అటు బీజేపీ కూడా ప్రతిష్టాత్మకంగా భావిస్తుండటంతో... ఈ ఎన్నికల యుద్ధంపై ఆసక్తి అంతకంతకూ పెరుగుతోంది.
ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్... తన పదవికి రాజీనామా చేస్తారా..? అలా చేయాలనుకోవడం వెనక ఆయన స్కెచ్ ఏంటన్నది తెలంగాణ పొలిటికల్ సర్కిల్స్‌లో లేటెస్ట్ హాట్ సబ్జెక్ట్. బీఆర్‌ఎస్ నుంచి గెలిచి పార్టీ మారిన దానం.. అనర్హత వేటు నుంచి తప్పించుకోవాలంటే... రాజీనామా చేయడమే బెటర్ అనుకుంటున్నారన్న చర్చ నడుస్తోంది. తాజాగా... జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక అంశం తెర మీదకు రావడంతో.. నాగేందర్ మనసు అటువైపు మళ్ళినట్టు చెప్పుకుంటున్నారు.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కోసం కాంగ్రెస్ పార్టీ స్పెషల్ స్కెచ్ సిద్ధం చేస్తోందా? దానికి సంబంధించి ఇప్పటికే క్షేత్ర స్థాయిలో యాక్టివిటీ మొదలైపోయిందా? షెడ్యూల్ కంటే ముందే… బ్యాటింగ్ మొదలుపెట్టాలని కాంగ్రెస్ పెద్దలు గట్టిగా ఫిక్స్ అయ్యారా? ఇంతకీ అక్కడ అధికార పార్టీ ప్లాన్ ఏంటి? ఎలా అమలు చేయాలనుకుంటోంది? జూబ్లీహిల్స్ ఉప ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కాంగ్రెస్ పార్టీ…. ఆల్రెడీ యుద్ధానికి అవసరమైన అస్త్ర శస్త్రాలన్నిటినీ సిద్ధం చేసుకుంటోందట. ప్రస్తుతం ఇది బీఆర్‌ఎస్ సిట్టింగ్ సీటుకాగా……
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కోసం కాంగ్రెస్ పార్టీ కసరత్తు మొదలుపెట్టింది. రాష్ట్రంలో అధికారంలో ఉన్నందున ఉప ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకుని గెలిపించాలని టార్గెట్ ఫిక్స్ చేసిందట అధిష్టానం. పార్టీ పొలిటికల్ అఫైర్స్ కమిటీ సమావేశంలో కూడా ఇదే అంశంపై క్లారిటీ ఇచ్చినట్టు తెలిసింది.
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ కి తిరిగే లేని.. ఎవరు ఎదుర్కోలేరని సీఎం రేవంత్‌రెడ్డి ఆశా భావం వ్యక్తం చేశారు. జులై 4 న హైదరాబాద్‌కి ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే వస్తున్నట్లు వెల్లడించారు. అదే రోజు పొలిటికల్ అఫైర్స్ కమిటి సమావేశం నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
మంత్రుల తీరుపై సీఎం రేవంత్‌రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల బాధ్యత అంతా ఇన్‌ఛార్జి మంత్రులదే అని స్పష్టం చేశారు. నిధులు, బాధ్యతలు అన్నీ మీ దగ్గరే ఉన్నాయని వెల్లడించారు. జిల్లాలపై ఇన్‌ఛార్జి మంత్రులు దృష్టిపెట్టడం లేదని.. ఇది కరెక్ట్ కాదన్నారు. నామినేటెడ్ పోస్టులు భర్తీ చేయండి అంటే ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నించారు. వెంటనే జిల్లాలో పదవులు భర్తీ చేయాలని సూచించారు. కార్యకర్తలను నారాజ్ చేయకండని పిలుపునిచ్చారు.
సికింద్రాబాద్ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని అత్యంత కీలకమమైన అసెంబ్లీ సెగ్మెంట్స్‌లో ఒకటి జూబ్లీహిల్స్. 2009లో ఏర్పడ్డ ఈ నియోజకవర్గానికి ఇప్పటికి మూడు సార్లు ఎన్నికలు జరగ్గా... మొత్తం మూడు సార్లూ ఎమ్మెల్యేగా గెలిచారు మాగంటి గోపీనాథ్. టీడీపీ, బీఆర్‌ఎస్ తరపున ప్రాతినిధ్యం వహించారాయన.