జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక బీఆర్‌ఎస్ మీద వత్తిడి పెంచుతోందా? సిట్టింగ్ సీటు కాబట్టి ఎంతో కొంత సహజమే అయినా… ప్రస్తుతం అంతకు మించి అన్నట్టుగా వాతావరణం ఉందా? ఎందుకు కారు పార్టీ అంత ప్రెజర్‌లో ఉంది? తిరిగి పాగా వేసేందుకు ఎలాంటి వ్యూహంతో ముందుకు వెళ్తోంది? ఈ ఒక్క సీటును మళ్లీ గెల్చుకుంటే బీఆర్‌ఎస్‌కు వచ్చే అడ్వాంటేజ్ ఏంటి? లేదంటే జరిగే నష్టమేంటటి? తెలంగాణలో ప్రధాన రాజకీయ పార్టీలకు జూబ్లీహిల్స్ ఫీవర్ పట్టుకుంది. ఇక్కడ ఉప ఎన్నికల్లో…
పార్టీ ఫిరాయింపులపై మరోసారి సుప్రీంకోర్టును ఆశ్రయించనున్నామని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వెల్లడించారు. కాంగ్రెస్ పార్టీపైన తొలి దెబ్బను జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో బీఆర్‌ఎస్ కొట్టబోతోందని అన్నారు.
Off The Record: తెలంగాణ రాజకీయం మొత్తం… ఇప్పుడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక చుట్టూనే తిరుగుతోంది. అధికార, ప్రతిపక్షాలకు ఇది చావో రేవో అన్నట్టుగా మారిపోయింది. మరీ ముఖ్యంగా…సిట్టింగ్ సీటును నిలబెట్టుకోవాలని బీఆర్‌ఎస్, అధికార బలం చూపించాలని కాంగ్రెస్ తహతహలాడుతున్నాయి. బీఆర్ఎస్ అయితే… సిట్టింగ్ సీట్ అనేకాకుండా… ఈ ఉప ఎన్నికలో గెలిస్తే… తిరిగి తమ బలం పెరిగిందన్న సంకేతాలు పంపడంతో పాటు వలసలు, కేడర్‌లో మనోధైర్యం నింపడం లాంటి చాలా ప్రశ్నలకు సమాధానం దొరుకుతుందని భావిస్తోందట.…
Maganti Sunitha: జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో భారత రాష్ట్ర సమితి (BRS) అభ్యర్థిగా మాగంటి సునీత అధికారికంగా నామినేషన్ దాఖలు చేశారు. షేక్‌పేట తహసీల్దార్ కార్యాలయంలో ఆమె తన నామపత్రాలను సమర్పించారు. ఈ కార్యక్రమానికి మాజీ మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, పద్మారావు గౌడ్, కార్పొరేషన్ మాజీ చైర్మన్ రావుల శ్రీధర్ రెడ్డి, కార్పొరేటర్ దేదీప్యతో పాటు పలువురు బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు హాజరయ్యారు. BC Leaders Fight: బీసీ సంఘాల ప్రతినిధులు మధ్య తోపులాట.. చెయ్యి చేసుకున్న…
Jubilee Hills By Election: జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నికల సందర్భంగా భారతీయ జనతా పార్టీ (BJP) తమ అభ్యర్థి పేరును ప్రకటించడంతో నెలకొన్న ఉత్కంఠకు తెరపడింది. బీజేపీ హైకమాండ్ హైదరాబాద్ సెంట్రల్ జిల్లా అధ్యక్షునిగా ఉన్న లంకల దీపక్ రెడ్డిని ఉప ఎన్నిక బరిలో తమ అభ్యర్థిగా ఎంపిక చేసింది. అభ్యర్థి ఎంపిక విషయంలో చివరి నిమిషం వరకు ఉత్కంఠ కొనసాగింది. ఇద్దరు మహిళా నేతలు సహా పలువురు సీనియర్ల పేర్లను పరిశీలించినప్పటికీ.. వివిధ సమీకరణాలను…
జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నికల్లో ప్రజలు భారత రాష్ట్ర సమితికి (బీఆర్ఎస్) గట్టి బుద్ధి చెప్పబోతున్నారని మంత్రి పొన్నం ప్రభాకర్ వ్యాఖ్యానించారు. ఆయన మాట్లాడుతూ.. గత పదేళ్లుగా ఆ పార్టీ పాలనలో జూబ్లీహిల్స్ నియోజకవర్గం అభివృద్ధి పరంగా ఏ మాత్రం ముందుకు సాగలేదని, ఇప్పుడు ప్రజలే ఆ విఫలతకు తీర్పు ఇవ్వబోతున్నారని అన్నారు. CM Chandrababu Tweet: సాంకేతిక పరంగా చారిత్రాత్మక మైలు రాయిని అధిగమించాం.. భారత్ ఏఐ ప్రయాణం ప్రారంభం.. అంతేకాకుండా.. “జూబ్లీహిల్స్‌లో బీఆర్ఎస్ పార్టీ…
Jubilee Hills By-Election: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో బీజేపీ అభ్యర్థి ప్రకటనపై ఉత్కంఠ ఇంకా కొనసాగుతోంది. ఇప్పటికే మూడు పేర్లను షార్ట్‌లిస్ట్ చేసిన పార్టీ, బీసీ సామాజిక వర్గానికి చెందిన నేతను అభ్యర్థిగా ఎంపిక చేయాలని ఢిల్లీ పెద్దల నుంచి సూచనలు వచ్చినట్లు సమాచారం. దీనితో ఆ దిశగా ఆలోచించాలని రాష్ట్ర నేతలకు ఆదేశాలు జారీ అయినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో అభ్యర్థి పేరుపై సస్పెన్స్ మరింత పెరిగింది. ప్రస్తుతం దీపక్ రెడ్డి, కీర్తి రెడ్డి, డాక్టర్…
Maganti Sunitha: జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నేపథ్యంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి మాగంటి సునీత, ఆమె కూతురు మాగంటి అక్షరపై పోలీసులు కేసు నమోదు చేశారు. యూసుఫ్‌గూడ డివిజన్‌లోని వెంకటగిరిలో శుక్రవారం నమాజ్ కోసం వెళ్తున్న ప్రజలను ఓటు వేయడానికి ప్రభావితం చేస్తున్నారనే ఆరోపణలపై ఈ కేసు నమోదైనట్లు సమాచారం. పోలీసులు మాగంటి సునీతను A1గా, ఆమె కూతురు మాగంటి అక్షరను A2గా పేర్కొంటూ, మరికొంత మందిని కూడా ఈ కేసులో చేరుస్తూ దర్యాప్తు ప్రారంభించారు. ఎన్నికల…
Raja Singh: గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ తాజాగా చేసిన వ్యాఖ్యలు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల సందర్భంలో రాజకీయ హాట్‌టాపిక్‌గా మారాయి. రాజా సింగ్ కిషన్ రెడ్డిని టార్గెట్‌గా చేస్తూ సోషల్ మీడియాలో వ్యాఖ్యానించారు. “జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో మీరు ఎన్ని ఓట్ల తేడాతో ఓడిపోతారు? తెలంగాణ, జూబ్లీహిల్స్ ప్రజలు మిమ్మల్ని అడుగుతున్నారని అన్నారు. టిఆర్ఎస్‌ని గెలిపిస్తారా? లేక కాంగ్రెస్‌ని గెలిపిస్తారా? అనే ప్రశ్నలు ప్రజల నుండి సోషల్ మీడియాలో వచ్చాయని ఆయన అన్నారు. మొబైల్ లవర్స్కి…