“ఆర్ఆర్ఆర్” చిత్ర బృందం దేశవ్యాప్తంగా సినిమా ప్రమోషన్స్ లో దూకుడుగా పాల్గొంటోంది. ట్రైలర్‌ను రిలీజ్ చేసి ప్రమోషన్లలో మరింత వేగం పెంచిన మేకర్స్ ఈరోజు హైదరాబాద్ లో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో పాల్గొన్నారు. ఇందులో చరణ్, తారక్, రాజమౌళితో పాటు అలియా భట్ కూడా పాల్గొంది. ఈరోజు అలియా తన షూటింగ్‌ను వాయిదా వేసుకుని హైదరాబాద్‌లో “ఆర్ఆర్ఆర్” విలేకరుల సమావేశానికి హాజరు కావడానికి కొంత సమయం కేటాయించింది. తెలుగు మీడియాతో తన ఇంటరాక్షన్ సమయంలో అలియా తెలుగులో మాట్లాడి ఆకట్టుకుంది.
Read Also : తారక్ ను ముడిపెడుతూ ఏపీ టికెట్ రేట్లపై ప్రశ్న… నిర్మాత ఏమన్నాడంటే?
“ఎలా వున్నారు? మీరు బాగున్నారా?” “ఆర్ఆర్ఆర్ ట్రైలర్ పగిలిపోయింది… ముంబైలో మాకు పిచ్చెక్కిపోయింది” అంటూ ట్రైలర్ పై కామెంట్స్ చేయడమే కాకుండా ‘మీరు ఎలా ఉన్నారు ? అని ప్రశ్నించిన మీడియా ప్రతినిధులకు “బాగున్నాను” అని సమాధానం చెప్పి ఆశ్చర్యపరిచింది. అలియా ఒక సంవత్సరం పాటు తెలుగు నేర్చుకుందని, ఆమెకు ఇప్పుడు భాష బాగా తెలిసిందని, ఆమెకు భాష బాగా అర్థమైందని రాజమౌళి అన్నారు. “లాక్‌డౌన్ సమయంలో నేను ట్యూటర్ నుండి జూమ్ కాల్స్ ద్వారా తెలుగు నేర్చుకున్నాను. లాక్‌డౌన్ ఉన్నందున నేను వ్యక్తిగతంగా ఆయనను కలవలేకపోయాను అంటూనే సెట్స్‌లో రామ్ చరణ్ మరియు ఎన్టీఆర్ మధ్య ఉన్న అనుబంధం గురించి అలియా పంచుకుంది.
“నేను సెట్స్‌పై ఉన్నప్పుడు, రామ్ చరణ్, ఎన్టీఆర్ ఒకరితో ఒకరు తెలుగులో మాట్లాడుకునేవారు. ఒకరి కాళ్లు ఒకరు పట్టుకుని లాగేవారు. ఎప్పుడూ సరదా సరదాగా ఉండేవారు. వారి స్నేహ బంధం గొప్పది. నేను అక్కడ ఉన్నాననే ఆలోచనే లేదు వారికి…” అంటూ ఎన్టీఆర్, చరణ్ ఇద్దరూ బిజీబిజీగా ఉంటూ తనను పట్టించుకోలేదని అలియా సరదాగా చెప్పింది. ఎన్టీఆర్, చరణ్‌లతో కలిసి పనిచేయడం చాలా అద్భుతంగా ఉందని ఆలియా పేర్కొంది. రాజమౌళి తన దర్శకత్వ ప్రతిభ, విజన్ పై ప్రశంసలు కురిపించింది.