యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి నటిస్తున్న క్రేజీ మల్టీస్టారర్ “ఆర్‌ఆర్‌ఆర్”. దిగ్గజ దర్శకుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ఈ ప్రతిష్టాత్మక చిత్రంలో బాలీవుడ్ హీరోయిన్ అలియా భట్ కూడా ప్రధాన పాత్ర పోషిస్తుంది. సినిమా 2022 జనవరి 7న విడుదలకు సిద్ధమవుతుండగా, ప్రమోషన్స్ స్టార్ట్ చేశారు మేకర్స్. ఈ రోజు హైదరాబాద్‌లో జరిగిన ప్రెస్ మీట్‌కు చిత్రబృందం మొత్తం హాజరయ్యింది. ఈ సందర్భంగా మీడియా ఇంటరాక్షన్ లో పలు విషయాలపై మేకర్స్ స్పందించారు. ఇందులో భాగంగా “దేశవ్యాప్తంగా ఒక్క ఆంధ్ర రాష్ట్రంలోనే టికెట్ రేట్ల ఇష్యూ ఉంది. ఆ సమస్యను పరిష్కరించడం కోసం ఎన్టీఆర్ సహాయం ఏమన్నా తీసుకుంటున్నారా ? ఆయన ఆప్త మిత్రులు ఇద్దరు అక్కడి ప్రభుత్వంలో మంచి పొజీషన్లలో ఉన్నారు కదా?” అనే ప్రశ్న ఎదురైంది చిత్ర నిర్మాత దానయ్యకు.
Read Also : తారక్ ను భయపెట్టింది ఎవరు ?
ఈ ప్రశ్నకు తారక్ ఏం మాట్లాడకుండా సీరియస్ చూస్తూ ఉండగా, ప్రొడ్యూసర్ దానయ్య స్పందిస్తూ “ఆంధ్రాలో రేట్లు తగ్గించారు. అది పెద్ద సినిమాలకు వేటికీ వర్కౌట్ కాదు. అయితే మేము ఇంకా ప్రభుత్వంతో ఈ సమస్య గురించి సంప్రదించడానికి ప్రయత్నిస్తున్నాము. గవర్నమెంట్ టికెట్ రేట్లపై సానుకూలంగా స్పందిస్తుందని ఎదురు చూస్తున్నాము” అంటూ చెప్పుకొచ్చారు. సినిమా విడుదలకు మరికొన్ని రోజులే ఉంది. మరి ఏపీ గవర్నమెంట్ టికెట్ రేట్లపై తన నిర్ణయం మార్చుకుంటుందా? అనేది వేచి చూడాలి.