“ఆర్ఆర్ఆర్ ” టీం దూకుడుగా ప్రమోషన్స్ ను స్టార్ట్ చేసింది. డిసెంబర్ 9న సినిమా ట్రైలర్ తో సందడి స్టార్ట్ కాగా నిన్న ముంబైలో ప్రెస్ మీట్ నిర్వహించారు. అందులో రామ్ చరణ్ పాల్గొనలేకపోయినా, ఎన్టీఆర్ ఎనర్జీకి బాలీవుడ్ ఫిదా అయ్యింది. ఇక అదే ఈరోజు హైదరాబాద్ లో మీడియా సమావేశం నిర్వహించాల్సి ఉండగా, ఈ ఈవెంట్ కు జనాలు ఎక్కువగా రావడంతో క్యాన్సిల్ చేశారు. నిన్న బెంగుళూరులో “ఆర్ఆర్ఆర్” మీడియా మీట్ నిర్వహించారు. అక్కడ పలువురు అడిగిన ప్రశ్నలను ‘ఆర్ఆర్ఆర్’ టీం సమాధానాలు ఇచ్చింది. తాజాగా హైదరాబాద్ లో మీడియా సమావేశంలో పాల్గొన్నారు “ఆర్ఆర్ఆర్” చిత్రబృందం.
Read Also : బుల్లి గౌనులో బుట్టబొమ్మ… ది స్టన్నర్ !
ఈ కార్యక్రమంలో రాజమౌళి, ఎన్టీఆర్, రామ్ చరణ్ తో పాటు అలియా భట్ కూడా పాల్గొంది. ఇక సమావేశంలో భాగంగా జర్నలిస్టులు అడిగిన ప్రశ్నలకు ఇద్దరు హీరోలతో పాటు రాజమౌళి కూడా సమాధానాలు చెప్పారు. అయితే ఓ జర్నలిస్ట్ మాత్రం అలియాను ఉద్దేశిస్తూ “ఆర్” అనే అక్షరానికి మీ జీవితంలో చాలా ప్రాధాన్యత ఉంది. సినిమా టైటిల్ లో కూడా “ఆర్ఆర్ఆర్” ఉంది. మరి సినిమాను, దాని టైటిల్ ను ఎలా ఎంజాయ్ చేశారు? అని అడిగాడు. ఆ ప్రశ్నకు రాజమౌళి స్పందిస్తూ వాళ్ళ ప్రశ్నలను మనం కాపీ కొట్టొద్దు అంటూ కౌంటర్ ఇచ్చాడు.