జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా నేడు తెలంగాణకు రానున్నారు. ఈ క్రమంలోనే కాషాయ పార్టీ హైక మాండ్ పార్టీ వ్యవహారాలను సెట్ చేసే పనిలో పడింది. ఇవాళ ఉదయం పార్టీ నేతలతో నడ్డా సమావేశమయ్యే అవకాశాలు ఉన్నాయి.
వైసీపీ ప్రభుత్వంపై బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా విమర్శలకు మాజీ మంత్రి పేర్నినాని స్పందించారు. బీజేపీ కర్ణాటకలో కుక్క చావు చచ్చింది.. నడ్డా మర్యాదగా మాట్లాడి ఉంటే బాగుంటుంది.. అడ్డంగా ఉన్న నడ్డా చాలా మాట్లాడారు అంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
మోడీ తొమ్మిదేళ్ల పాలనలో జరిగిన దేశాభివృద్ధిని వివరించేందుకు బీజేపీ తలపెట్టిన సభల్లో ఒకటి శనివారం సాయంత్రం శ్రీకాళహస్తిలోని భేరివారి మండపం వద్ద జరగనుంది. ఇవాళ శ్రీకాళహస్తిలో జేపీ నడ్డా అధ్వర్యంలో భారీ బహిరంగ సభ నిర్వహించేందుకు బీజేపీ సిద్ధమైంది.
JP Nadda: ఉచితాలపై బీజేపీ జాతీయాద్యక్షుడు జేపీ నడ్డా కీలక వ్యాఖ్యలు చేశారు. కోవిడ్ -19 మహమ్మారి సమయంలో జపాన్, అమెరికా, చైనా దేశాలు ఉచితాలపై డబ్బులను ఖర్చు పెట్టాయని, ఇదే ఆ దేశాల్లో ఆర్థిక సంక్షోభానికి కారణం అయిందని అన్నారు. భారతదేశం మాత్రం రూ.20 లక్షల కోట్ల ప్యాకేజీని ప్రకటించిందని.. ఇది మౌళిక సదుపాయాలు, వ్యవసాయం, ఇతర సెక్టార్లకు బూస్ట్ ఇచ్చిందని ఆయన అన్నారు.