Etela Rajender Rajagopal Reddy Ultimatum To BJP Leadership: శనివాయం ఢిల్లీలో బీజేపీ అగ్రనేతలతో ఈటల రాజేందర్, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి భేటీ అయిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా.. అధిష్టానానికి వాళ్లిద్దరు అల్టిమేటం జారీ చేశారు. కేసీఆర్ అవినీతి పాలనపై చర్యలు తీసుకోవాల్సిందేనని, మద్యం కేసులో ఎమ్మెల్సీ కవిత విషయంలో కఠినంగా వ్యవహరించాలని ఆ ఇద్దరు నేతలు తేల్చి చెప్పారు. సరైన చర్యలు తీసుకోకపోవడం వల్లే.. బీజేపీ, బీఆర్ఎస్ మధ్య అండర్‌స్టాండింగ్ ఉందని ప్రజలు అనుకుంటున్నారని.. ఈ అపోహలు తొలగాలంటే యాక్షన్ తప్పదని చెప్పినట్లు తెలిసింది. అలాగే.. పార్టీ బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలను సైతం అధిష్టానానికి సూచించారు. పదవుల కోసమో, స్వార్థం కోసమో కాదని.. రాష్ట్రం కోసం తాము కష్టపడుతున్నామని ఆ నేతలిద్దరు అధిష్టానికి చెప్పారు.
Jammu Kashmir: నియంత్రణ రేఖ వెంబడి ముగ్గురు పాక్ చొరబాటుదారులు హతం
ఈ భేటీ అనంతరం ఈటల రాజేందర్ మాట్లాడుతూ.. నడ్డాతో మీటింగ్ జరిగిందని, తెలంగాణలో ఉన్న రాజకీయ పరిస్థితులపై చర్చలు జరిపామని తెలిపారు. పార్టీ బలోపేతంపై వాళ్లు సూచనలు కూడా చేశారన్నారు. అనంతరం రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ.. అధిష్టానం పిలుపు మేరకు తాము ఢిల్లీ వచ్చామన్నారు. అమిత్ షా, నడ్డాతో సమావేశం జరిగిందని.. రాష్ట్రంలో రాజకీయ పరిణామాలపై, బీజేపీ తక్షణ నిర్ణయాలపై చర్చ సాగిందని స్పష్టం చేశారు. నిర్మొహమాటంగా, నిక్కచ్చిగా తాము వాస్తవాలు చెప్పామన్నారు. కొన్ని నిర్ణయాలను ఎట్టి పరిస్థితుల్లోనైనా తీసుకోవాల్సిందేనని తాము కోరామన్నారు. ఇప్పటికైనా బీజేపీని ప్రజలు విశ్వసిస్తారని అనుకుంటున్నానని ఆశాభావం వ్యక్తం చేశారు. తమ విజ్ఞప్తులక వాళ్లు సానుకూలంగానే స్పందించారని రాజగోపాల్ రెడ్డి చెప్పుకొచ్చారు.
Hyderabad Rains: హైదరాబాద్లో కుండపోత వర్షం.. బయటకు రావొద్దని హెచ్చరికలు!
మరోవైపు.. ఢిల్లీ పర్యటనకు బయలుదేరడానికి ముందు పార్టీ మార్పుపై వస్తున్న ప్రచారాల్ని రాజగోపాల్ రెడ్డి ఖండించారు. తాను కాంగ్రెస్‌లో చేరుతున్నానని వస్తున్న వార్తల్లో ఎలాంటి వాస్తవం లేదని, తాను బీజేపీలోనే ఉన్నానని క్లారిటీ ఇచ్చారు. ఊహాగానాలను, ప్రచారాలను నమ్మొద్దని సూచించారు. తాను ఎలాంటి నిర్ణయం తీసుకోకపోయినా.. పార్టీ మారుతున్నట్టు తనపై ప్రచారాలు ఎందుకు వస్తున్నాయో అర్థం కావడం లేదని అన్నారు. పార్టీ మార్పుపై తాము ఏదైనా నిర్ణయం తీసుకుంటే, తామే స్వయంగా మీడియాకి చెప్తాం కదా! అని పేర్కొన్నారు. రాష్ట్రంలో కేసీఆర్ కుటుంబ పాలన పోయి ప్రజాస్వామ్యం బతకాలంటే, అది ప్రధాని మోడీ నాయకత్వంలోని బీజేపీతోనే సాధ్యమవుతుందనే ఉద్దేశంతోనే తాను బీజేపీలో చేరానని పేర్కొన్నారు.