తెలంగాణలో టీఆర్‌ఎస్‌కు ప్రత్యామ్నాయంగా బీజేపీ పార్టీ బలపడేందుకు ప్రయత్నిస్తోంది. టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీ నుంచి అసంతృప్తులను బీజేపీలో చేర్చుకునేందుకు బీజేపీ పార్టీ ప్రణాళికలను సిద్ధం చేసినట్టు వార్తలు వస్తున్నాయి. దీనిలో భాగంగానే ఆ పార్టీల్లో పలువురు నేతల్ని బీజేపీ ఈమ పార్టీలో కి చేర్చుకోవాలని భావిస్తుంది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లోపు అన్ని నియోజకవర్గాలకు సంబంధించి అభ్యర్థులను ఖరారు చేసుకునే యోచనలో బీజేపీ ఉంది. దీనిపై ఆపార్టీ నాయకులే .. మేం నేతలను చేర్చుకుని తెలంగాణలో బలపడతామని బహిరంగంగానే…
ఏపీపై బీజేపీ అధిష్టానం ఫోకస్ పెట్టింది. ఏపీ బీజేపీ కోర్ కమిటీని నియమించింది. ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు నేతృత్వంలో 16 మందితో కోర్ కమిటీని నియమించింది బీజేపీ అధినాయకత్వం. ఎంపీలైనా సరే తమను కోర్ కమిటీ భేటీలకు పిలవడం లేదని ఇటీవలే అమిత్ షా భేటీలో ఫిర్యాదు చేశారు సీఎం రమేష్, సుజనా చౌదరి. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా నియమించిన కోర్ కమిటీ సభ్యులుగా సీఎం రమేష్, సుజనా తదితరులు వున్నారు.…
ఏపీలోని బద్వేలు ఉపఎన్నిక ఫలితాలపై ప్రధాని అభినందించారని ఏపీ బీజేపీ వ్యవహారాల ఇన్ ఛార్జి సునీల్ దేవ్ ధర్ అన్నారు. 700 ఓట్లు రానిచోట 21 వేలకు పైగా ఓట్లు రావడంపై హర్షం వ్యక్తం చేశారన్నారు. ఏపీలో ఏదో జరుగుతుందన్న ఆశాభావం వ్యక్తమవుతోంది. ఏపీ ప్రభుత్వం చమురు ధరలపై వచ్చిన ప్రకటన పూర్తిగా అవాస్తవం. ఆ ప్రకటన ఏపీ ప్రజలను మోసగించడమే అవుతుందన్నారు. ప్రకటనలో తప్పుడు సమాచారం గురించి మా సోషల్ మీడియాలో కౌంటర్ ఇచ్చాం. ఏపీ…
తెలంగాణలో జరిగిన హూజూరాబాద్ ఉప ఎన్నికల్లో బీజేపీ సాధించిన ఫలితాలపై ప్రధాని, జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సంతృప్తిని వ్యక్తం చేస్తూ , రాష్ట్రపార్టీ నేతలను అభినందించారు. తెలంగాణలో, దక్షిణభారత దేశంలో బీజేపి బలపడుతుందన్న విశ్వాసాన్ని ప్రధాని, పార్టీ జాతీయ అధ్యక్షుడు జే.పి.నడ్డా వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ లో బద్వేల్ ఉపఎన్నికలలో ఓట్లశాతం పెరుగుదలపై సంతృప్తిని వ్యక్తం చేశారు. “దళితబంధు” పథకాన్ని రాష్ట్రమంతా అమలు చేసేలా తెలంగాణ ప్రభుత్వం పై ఒత్తిడి తీసుకువస్తామన్నారు బీజేపీ నేతలు. కేంద్ర…
తెలుగు రాష్ట్రాల్లో బీజేపీ పుంజుకుంటోందని ప్రధాని మోడీ అభిప్రాయం వ్యక్తం చేశారు. ఢిల్లీలో ఆదివారం బీజేపీ కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ప్రధాని మోడీ తో పాటు జెపీ నడ్డా కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మోడీ మాట్లాడుతూ.. తెలుగు రాష్ట్రల్లో పరిస్థితులు బీజేపీకి అనుకూలంగా మారుతున్నాయన్నారు. అంతేకాకుండా దుబ్బాక, హుజురాబాద్ ఫలితాలపై హర్షం వ్యక్తం చేశారు. తెలంగాణ బీజేపీ నేతలను ప్రత్యేకంగా అభినందించారు. ఎన్నికలు జరిగే 5 రాష్ట్రాల్లోనూ బీజేపీదే విజయమని ఆయన అన్నారు.…
ఢిల్లీలో బిజేపి జాతీయ అధ్యక్షుడు జె.పి నడ్డాతో ఈటెల రాజేందర్ భేటీ అయ్యారు. ఈ సమావేశంలో బండి సంజయ్, రాష్ట్ర బిజేపి ఇంచార్జ్ తరుణ్ చుగ్, మాజీ ఎంపి వివేక్ వేంకటేస్వామి, ఏనుగు రవీందర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్బంగా జె.పి నడ్డా కీలక వ్యాఖ్యలు చేశారు. బిజేపిలో చేరాలన్న ఈటల నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని… తెలంగాణలో బిజేపి మరింత చురుకైన పాత్ర పోషిం చేందుకు సమాయత్తం కావాలని రాష్ట్ర నాయకులకు నడ్డా సూచించారు. ఉద్యమ నాయకులతో పార్టీ…
బిజేపి జాతీయ అధ్యక్షుడు జె.పి నడ్డా నివాసంలో ఈ రోజు కీలక సమావేశం జరుగనుంది. ఈ రోజు సాయంత్రం 6 గంటలకు జె.పి. నడ్డాతో ఈటల రాజేందర్ భేటీ కానున్నారు. తెలంగాణలో రాజకీయ పరిస్థితులు, ఇటీవల జరిగిన పరిణామాలను నడ్డాకు వివరించనున్నారు ఈటల రాజేందర్. ఇప్పటికే బిజేపిలో చేరేందుకు రంగం సిద్దం కాగా.. బిజేపిలో తాను నిర్వహించాల్సిన పాత్రపై చర్చిం చనున్నారు. తెలంగాణలో అన్ని సామాజిక వర్గాలకు రాష్ట్ర బిజేపిలో తగిన ప్రాధాన్యత, ప్రాతినిధ్యం కల్పించే అంశంపై…