విజయవాడ పశ్చిమ నియోజకవర్గం బీజేపీ ఎమ్మె్ల్యే అభ్యర్థి సుజనా చౌదరి సమక్షంలో వైసీపీ సీనియర్ నాయకులు, మాజీ కనకదుర్గ టెంపుల్ చైర్మన్ పైలా సోమి నాయుడు ఈరోజు బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా సుజనా చౌదరి మాట్లాడుతూ.. సొంత జిల్లా నుంచి పోటీ చేయడం అదృష్టంగా భావిస్తానని తెలిపారు. దేశ రాష్ట్ర రాజకీయాలను చూశా... ప్రపంచం మొత్తం తిరిగానన్నారు. కృష్ణా జిల్లా నా పుట్టినిల్లు.. విజయవాడ వెస్ట్ అభ్యర్థిగా బరిలో దిగడాన్ని భగవంతుడి వరంగా భావిస్తున్నానని పేర్కొన్నారు.…
సార్వత్రిక ఎన్నికల వేళ కాంగ్రెస్‌కు వరుస దెబ్బలు తగలుతున్నాయి. ఆ పార్టీని ముఖ్య నేతలు వీడుతున్నారు. గురువారం ఢిల్లీలో గుజరాత్‌కు చెందిన కాంగ్రెస్ మాజీ నేత రోహన్ గుప్తా భారతీయ జనతా పార్టీలో చేరారు.
కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గం నుంచి టీడీపీలోకి వలసల పర్వం కొనసాగుతుంది. కానూరులోని యార్లగడ్డ గ్రాండియర్ లో భారీగా వైసీపీ నుంచి టీడీపీలోకి చేరికలు జరిగాయి. గన్నవరం నియోజకవర్గంలోని ఏడు గ్రామాల నుంచి సుమారు నాలుగు వందల మంది వైసీపీ కార్యకర్తలు టీడీపీలో చేరారు. వారికి కండువా కప్పి టీడీపీ ఇంచార్జి యార్లగడ్డ వెంకట్రావు పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా టీడీపీలో చేరిన పలువురు నేతలు మాట్లాడుతూ.. యార్లగడ్డ గెలుపుకోసం ప్రత్యక్షంగా, పరోక్షంగా పనిచేస్తామని తెలిపారు.
విశాఖ డ్రగ్స్ రవాణా పంచాయతీ ఈసీకి చేరింది. విశాఖ డ్రగ్స్ రవాణాకు.. తమకు లింకులున్నాయన్న టీడీపీ ఆరోపణలపై వైసీపీ అభ్యంతరం వ్యక్తం చేసింది. టీడీపీ దుష్ప్రచారం చేస్తోందంటూ వైసీపీ ఈసీకి ఫిర్యాదు చేసింది. ఆధారాల్లేని ఆరోపణలు ఎన్నికల కోడ్ ఉల్లంఘనేనని మాజీ మంత్రి పేర్ని నాని మండిపడ్డారు. మరోవైపు.. చంద్రబాబు, పురంధేశ్వరి సన్నిహితులకే డ్రగ్స్ రవాణతో సంబంధం ఉందని వైసీపీ ఆరోపిస్తుంది. డ్రగ్స్ రవాణా విషయంలో చంద్రబాబు వ్యాఖ్యలపై వైసీపీ ఈసీకి కంప్లైంట్ చేసింది. సీబీఐ చెప్పిన…
Swarna Sudhakar Reddy: బీఆర్ఎస్కు మరో షాక్ తగిలింది. మహబూబ్ నగర్ జిల్లా పరిషత్ చైర్ పర్సన్ స్వర్ణ సుధాకర్ రెడ్డి బీఆర్ ఎస్ ను వీడి కాంగ్రెస్ పార్టీలో చేరారు.
జితేందర్ రెడ్డి పార్టీ మార్పుపై బీజేపీ మెదక్ ఎంపీ అభ్యర్థి రఘునందన్ తీవ్ర విమర్శలు చేశారు. బీజేపీలో పెద్ద పెద్ద పదవులు అనుభవించి... పార్టీకి సిద్దాంతం లేదని మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. కొడుక్కి సీటు ఇస్తే సిద్దాంతం ఉన్న పార్టీ.. నీకు సీటు ఇవ్వక పోతే సిద్దాంతం లేదా అని ప్రశ్నించారు. ఏ ఆర్థిక ప్రయోజనాలు కోసం మీరు పార్టీ మారారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మీ బంధువులు కంపెనీ అమ్ముతున్న ఫ్లాట్స్ ఏమీ.. చేవెళ్ల పార్లమెంట్ ఎంపీతో…
లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఇతర పార్టీల్లోకి వలసలు కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీకి మరో షాక్ తగిలింది. వర్థన్నపేట మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ బీజేపీలో చేరారు. రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఆయనకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఆరూరి పార్టీ వీడకుండా.. బీఆర్ఎస్ సీనియర్ నేతలు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. నిన్న బీఆర్ఎస్ కు రాజీనామా చేశారు. పార్టీ జిల్లా అధ్యక్ష పదవికి, ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్టు లేఖలో పేర్కొన్నారు.…
టీడీపీ అధినేత చంద్రబాబు సమక్షంలో వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి టీడీపీలో చేరారు. ఆయనతో పాటు కుమారుడు రాఘవరెడ్డి, కావలి మాజీ ఎమ్మెల్యే వంటేరు వేణుగోపాల్ రెడ్డి, అద్దంకి వైసీపీ నేతలు బాచిన కృష్ణ చైతన్య, గరటయ్య టీడీపీలో చేరారు. వారికి పార్టీ కండువా వేసి ఆహ్వానించారు చంద్రబాబు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. ప్రజలు గెలవాలి రాష్ట్రం నిలబడాలి.. సైకో పాలన పోవాలి ఎన్డీఏ పాలన రావాలన్నారు. రాష్ట్ర ప్రజలంతా ఆలోచించుకోవాల్సిన సమయం ఆసన్నమైందని…
పార్లమెంట్ ఎన్నికల వేళ బీఆర్ఎస్ కు మరో షాక్ తగిలింది. ఆ పార్టీ గోషామహల్ ఇంఛార్జి నందకిషోర్ వ్యాస్ రాజీనామా చేశారు. త్వరలో కాంగ్రెస్ లో చేరనున్నట్లు తెలిపారు. ఇదిలా ఉంటే.. తన రాజీనామా లేఖను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కి, తెలంగాణ భవన్ కి ప్యాక్స్ లో పంపించారు. తాను ఇక నుంచి పార్టీలో పని చేయలేనని.. పార్టీలోని తన పోస్టుకి, పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు రాజీనామా లేఖలో పేర్కొన్నారు.
ప్రకాశం జిల్లా గిద్దలూరు మండలం ముండ్లపాడు గ్రామంలోని 60 కుటుంబాలకు చెందిన వాల్మీకులు గిద్దలూరు వైసీపీ ఇంచార్జి, మార్కాపురం శాసన సభ్యులు కుందూరు నాగార్జునరెడ్డి సమక్షంలో వైఎస్సార్ పార్టీలో చేరారు. వారికి పార్టీ కండువాలు కప్పి కుందూరు నాగార్జున రెడ్డి పార్టీలోకి ఆహ్వానించారు. మండలంలో మేజర్ పంచాయతీ అయిన ముండ్లపాడు గ్రామ సర్పంచ్ పదవి విజయావకాశాలకు వాల్మీకి ఓటింగ్ కి చాలా ప్రాధాన్యత ఉంటుంది.