Raghunandan Rao: పెద్ద పదవులు అనుభవించి.. పార్టీకి సిద్ధాంతం లేదని మాట్లాడుతారా..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
జితేందర్ రెడ్డి పార్టీ మార్పుపై బీజేపీ మెదక్ ఎంపీ అభ్యర్థి రఘునందన్ తీవ్ర విమర్శలు చేశారు. బీజేపీలో పెద్ద పెద్ద పదవులు అనుభవించి… పార్టీకి సిద్దాంతం లేదని మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. కొడుక్కి సీటు ఇస్తే సిద్దాంతం ఉన్న పార్టీ.. నీకు సీటు ఇవ్వక పోతే సిద్దాంతం లేదా అని ప్రశ్నించారు. ఏ ఆర్థిక ప్రయోజనాలు కోసం మీరు పార్టీ మారారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మీ బంధువులు కంపెనీ అమ్ముతున్న ఫ్లాట్స్ ఏమీ.. చేవెళ్ల పార్లమెంట్ ఎంపీతో కలిసి ఏమీ మాట్లాడారు.. ఈస్టర్న్ కన్స్ట్రక్షన్ ఎవరిది.. భూములను ఆక్రమించింది ఎంత.. సర్వే నంబర్ 343, 403 లో ఏమీ జరుగుతుందని ప్రశ్నించారు.
Heroine Accident: విజయ్ ఆంటోనీ హీరోయిన్‌కి రోడ్డు ప్రమాదం.. హాస్పిటల్‌కి కూడా డబ్బుల్లేక?
Also Read
- Special Train: శ్రీశైలం, తిరుమల భక్తులతో సోమనాథ్‌కు ప్రత్యేక రైలు.. పూర్తి వివరాలు ఇవే
- Smart Roads: వాహనదారులకు శుభవార్త.. అమరావతిలో సరికొత్త స్మార్ట్ రోడ్లు.. ఈ ప్రాంతాల్లో..
- VIVO S60T: 7200mAh బ్యాటరీ, 6.59-అంగుళాల AMOLED డిస్‌ప్లే.. Vivo S60t స్మార్ట్ ఫోన్ లాంచ్..
- Honor New Mobile: 6000 mAH బ్యాటరీ, 120Hz రిఫ్రెష్ రేట్, 1TB స్టోరేజ్.. Honor X5ds లాంచ్..
అడ్డగోలు కన్స్ట్రక్షన్ మీద ఈడీ, ఐటీకి ఫిర్యాదు చేస్తానని రఘునందన్ రావు అన్నారు. తమ దగ్గర పూర్తి సమాచారం ఉంది.. మీరు ఎందుకు పార్టీ మారారో ఆధారాలు తమ దగ్గర ఉన్నాయన్నారు. మీరు బీజేపీకి కొత్తగా సిద్దాంతాలు నేర్పించాల్సిన అవసరం లేదని మండిపడ్డారు. వ్యక్తిగత, ఆర్థిక లబ్ది కోసం మీరు పార్టీ మారారని పేర్కొన్నారు. పాలమూరులో మీరు మీ కొడుకు కోసం పని చేశారా… ఇప్పుడు అధికారంలోకి ఉన్న పార్టీకి మద్దతు ఇవ్వలేదా అని ప్రశ్నించారు. కన్స్ట్రక్షన్ కంపెనీల నుండి డబ్బులు వందల కోట్లు చేతులు మారాయి.. కాంగ్రెస్ అభ్యర్థులకు ఆ డబ్బులు పంపబోతున్నారని రఘునందన్ రావు తెలిపారు.
MLA Rammohan Reddy: పార్టీ ఫిరాయింపులపై బీఆర్ఎస్ తీరు దెయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉంది..
ఇదిలా ఉంటే.. శుక్రవారం జితేందర్ రెడ్డి బీజేపీకి రాజీనామా చేసి కాంగ్రెస్ లో చేరారు. బీజేపీ నుంచి మహబూబ్‌నగర్ ఎంపీ టికెట్ ఆశించి నిరాశచెందిన ఆయన తన కుమారుడు మిథున్‌రెడ్డితో కలిసి కాంగ్రెస్‌లో చేరారు. సీఎం రేవంత్‌రెడ్డి, రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌ఛార్జ్ దీపదాస్ మున్షీ సమక్షంలో ఆయన చేతులు కలిపారు. కాంగ్రెస్‌లో చేరిన వెంటనే జితేందర్‌రెడ్డికి కేబినెట్ హోదాతో కూడిన రెండు పదవులు కాంగ్రెస్ అధిష్టానం ప్రకటించింది. ఢిల్లీలో తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా, రాష్ట్ర ప్రభుత్వానికి క్రీడా వ్యవహారాల సలహాదారుగా నియమిస్తూ అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది.
తాజావార్తలు
-
Adarsha Kutumbam: రూ.300 కోట్ల హీరో.. తోపు డైరెక్టర్.. అయినా ‘ఆదర్శ కుటుంబం’పై ఇంత సైలెన్స్ ఏంటి?
-
Special Train: శ్రీశైలం, తిరుమల భక్తులతో సోమనాథ్‌కు ప్రత్యేక రైలు.. పూర్తి వివరాలు ఇవే
-
Trivikram : గురూజీకి హనుమాన్ అన్ష్ టెన్షన్!
-
Quba Pub Fight: విశాఖ ‘క్యూబా’ పబ్‌లో రచ్చరచ్చ.. డ్యాన్స్ వివాదంతో మొదలై రోడ్డుపైకి చేరిన రగడ..
-
The Paradise OTT: సిల్వర్ స్క్రీన్‌పై ‘ది ప్యారడైజ్’లో మిస్సయిన ఆ పాట.. నెట్‌ఫ్లిక్స్ కోసం శ్రీకాంత్ ఓదెల మాస్టర్ స్కెచ్!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!